IND vs NZ, 2nd Test Match: డబుల్ సెంచరీ వైపు మయాంక్.. లంచ్‌కు టీమ్‌ఇండియా 285/6
కివీస్‌తో రెండో టెస్టులో టీమ్‌ఇండియా నిలకడగా ఆడుతోంది. మయాంక్ అగర్వాల్ డబుల్ సెంచరీ వైపు సాగుతున్నాడు. అశ్విన్, సాహా ఔటయ్యారు.
ముంబయి టెస్టులో ఓపెనర్ మయాంక్ అగర్వాల్ (146 బ్యాటింగ్; 306 బంతుల్లో 16x4, 4x6) అదరగొడుతున్నాడు. డబుల్ సెంచరీ వైపు దూసుకుపోతున్నాడు. న్యూజిలాండ్ బౌలర్లను ఆటాడుకుంటున్నాడు! అతడికి అక్షర్ పటేల్ (32 బ్యాటింగ్; 98 బంతుల్లో 4x4) అండగా నిలవడంతో రెండో రోజు లంచ్ విరామానికి కోహ్లీసేన 285/6తో నిలిచింది.
ఓవర్‌నైట్ స్కోరు 221/4తో టీమ్‌ఇండియా రెండో రోజు బ్యాటింగ్ ఆరంభించింది. కానీ కివీస్ హీరో అజాజ్ పటేల్ మళ్లీ చెలరేగాడు. ఓకే ఓవర్లో వరుస బంతుల్లో జట్టు స్కోరు 224 వద్ద రెండు వికెట్లు తీశాడు. 71.4వ బంతికి నైట్ వాచ్‌మన్ వృద్ధిమాన్ సాహా (27; 62 బంతుల్లో 3x4, 1x6)ను వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. ఆ తర్వాతి బంతికి క్రీజులోకి వచ్చిన రవిచంద్రన్ అశ్విన్ (0)ను క్లీన్‌బౌల్డ్ చేసి షాకిచ్చాడు. అక్కడి నుంచి అక్షర్ పటేల్‌తో కలిసి మయాంక్ నిలకడగా ఆడాడు. స్పిన్‌ను చక్కగా ఎదుర్కొన్నాడు. వీరిద్దరూ ఏడో వికెట్‌కు అజేయంగా 61 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. దాంతో కోహ్లీసేన కాస్త పుంజుకొంది.
It's Lunch on Day 2 of the 2nd @Paytm #INDvNZ Test in Mumbai! #TeamIndia resolute with the bat. 👍 👍
— BCCI (@BCCI) December 4, 2021
1⃣4⃣6⃣* for @mayankcricket
3⃣2⃣* for @akshar2026
We will be back for the second session soon.
Scorecard ▶️ https://t.co/CmrJV47AeP pic.twitter.com/6Bf1YG4Zrt
Also Read: Kohli ODI Captaincy: మోదీ ప్రభుత్వం ఓకే అనేస్తే..! కోహ్లీ వన్డే కెప్టెన్సీకి గుడ్‌బై!
Also Read: Ganguly on Laxman: హైదరాబాద్‌ను వదిలేస్తున్న వీవీఎస్.. మా లక్ష్మణ్ బంగారం అంటున్న గంగూలీ!
Also Read: Srikanth Kidambi: గత మూడువారాల్లో ఎంతో నేర్చుకున్నా.. తర్వాతి లక్ష్యం అదే :కిడాంబి శ్రీకాంత్
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి