అన్వేషించండి

Ind vs NZ 2nd T20I: ఆదమరిస్తే దెబ్బకొడతారు.. రెండో టీ20లో కివీస్‌తో జాగ్రత్త!

టీమ్‌ఇండియా రెండో టీ20కి సిద్ధమైంది. ఈ మ్యాచులో న్యూజిలాండ్‌ను ఓడించి సిరీస్‌ కైవసం చేసుకోవాలని పట్టుదలగా ఉంది. మరోవైపు హిట్‌మ్యాన్‌ సేనను ఓడించి 1-1తో ఆశలు నిలుపుకోవాలని కివీస్‌ అనుకుంటోంది.

తొలిపోరులో అద్భుత విజయం అందుకున్న టీమ్‌ఇండియా రెండో టీ20కి సిద్ధమైంది. ఈ మ్యాచులో న్యూజిలాండ్‌ను ఓడించి సిరీస్‌ కైవసం చేసుకోవాలని పట్టుదలగా ఉంది. మరోవైపు హిట్‌మ్యాన్‌ సేనను ఓడించి 1-1తో ఆశలు నిలుపుకోవాలని కివీస్‌ అనుకుంటోంది. మరి రాంచీలో గెలుపు ఎవరిని వరిస్తుందో చూడాలి!!

విరామం లేదు

ఈ సిరీసుకు సన్నద్ధం అయ్యేందుకు టీమ్‌ఇండియాకు కొంత సమయం దొరికింది. ముందుగానే దుబాయ్‌ నుంచి వచ్చి కాస్త విశ్రాంతి తీసుకుంది. కుర్రాళ్లు, సీనియర్లు తాజాగా కనిపించారు. కెప్టెన్‌గా రోహిత్‌, కోచ్‌గా ద్రవిడ్‌ తమ ప్రస్థానం ఆరంభించడంతో కుర్రాళ్లు ఉత్సాహంగా కనిపించారు. గెలుపోటములను పక్కనపెట్టి ఫియర్‌లెస్‌ క్రికెట్‌ ఆడేందుకు ప్రయత్నించారు. కివీస్‌ మాత్రం అలసటతో కనిపించింది. గత ఆదివారం ప్రపంచకప్‌ ఫైనల్‌ ఆడి విరామమే లేకుండా టీమ్‌ఇండియాతో తొలి టీ20 ఆడింది. పైగా విలియమ్సన్‌ అందుబాటులో లేడు. రెండో టీ20కి ఆ జట్టుకు కాస్త విశ్రాంతి లభించే ఉంటుంది.

టీమ్‌ఇండియా బలాలు

  • రోహిత్‌ ఓపెనింగ్‌ మెరుపులు.
  • సూర్యకుమార్‌ ఫామ్‌లోకి రావడం.
  • పంత్‌ పరిణతితో ఆడటం.
  • భువీ బంతిని స్వింగ్‌ చేస్తూ వికెట్లు తీయడం.
  • అశ్విన్‌, అక్షర్ జోడీ బంతితో మాయ చేయడం.
  • వెంకటేశ్‌ అయ్యర్‌ రాకతో ఆరో బౌలింగ్‌ ఆప్షన్‌ దొరకడం

టీమ్‌ఇండియా బలహీనతలు

  • మంచు కురిస్తే మెరుగ్గా బౌలింగ్‌ చేయకపోవడం.
  • దీపక్‌ చాహర్‌, సిరాజ్‌ పరుగులు ఇవ్వడం.
  • వెంకటేశ్‌ అయ్యర్‌ బ్యాటింగ్‌ చేయకపోవడం.
  • కివీస్‌ బౌలర్లకు భారత బ్యాటర్ల బలహీనతలు తెలియడం.

పట్టుదలగా కివీస్‌

న్యూజిలాండ్‌ జట్టులో మార్టిన్‌ గప్తిల్‌ వీరోచిత ఫామ్‌లో ఉన్నాడు. విలియమ్సన్‌ స్థానంలో వచ్చిన చాప్‌మన్‌ రాణించాడు. అయితే మిడిలార్డర్‌లో కొంత తడబాటు కనిపించింది. గ్లెన్‌ ఫిలిప్స్‌ ఈ మ్యాచులో అదరగొట్టేందుకు ప్రయత్నిస్తాడు. రచిన్‌ రవీంద్ర, జిమ్మీ నీషమ్‌ బ్యాటు ఝుళిపించాల్సిన అవసరం ఉంది. కివీస్‌ పేసర్లు తెలివిగా బంతులేస్తారు. ఇక్కడి పిచ్‌లు, భారత బ్యాటర్ల గురించి సౌథీ, బౌల్ట్‌కు బాగా తెలియడం అనకూల అంశం. టాడ్‌ ఆస్ట్లే ఎక్కువ పరుగులు ఇచ్చాడు. ఏదేమైనా రాంచీలో టాస్‌ కీలకం కానుంది. ఛేదనలో మంచు కురిసే అవకాశం ఉంది.

Also Read: Ind vs NZ- 1st T20, Full Match Highlight: రోహిత్ శర్మకు శుభారంభం.. మొదటి మ్యాచ్‌లో కివీపై విజయం!

Also Read: IND vs NZ: బ్యాటర్‌ను బోల్తా కొట్టించడం బౌల్ట్‌కు నేనే నేర్పించా..! నా బలహీనత అతడికి తెలుసన్న రోహిత్ శర్మ

Also Read: Rachin Ravindra: రాహుల్‌ ద్రవిడ్‌లో 'ర'.. సచిన్‌లో 'చిన్‌' కలిస్తే 'రచిన్‌ రవీంద్ర'.. కివీస్‌లో భారత క్రికెటర్‌

Also Read: Ricky Ponting Update: ఐపీఎల్‌ సమయంలో పాంటింగ్‌కు టీమ్‌ఇండియా కోచ్‌ ఆఫర్‌.. ఎందుకు తిరస్కరించాడంటే?

Also Read: Ind vs NZ 2nd T20I: రెండో టీ20 వాయిదా పడుతుందా? ఏకంగా హైకోర్టులో!

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Good News For Farmers: సన్న వడ్లకు క్వింటాకు రూ.500 బోనస్, రైతుల ఖాతాల్లో జమపై ప్రభుత్వం శుభవార్త
సన్న వడ్లకు క్వింటాకు రూ.500 బోనస్, రైతుల ఖాతాల్లో జమపై ప్రభుత్వం శుభవార్త
Tirumala Brahmotsavalu 2024: శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ, Photo చూశారా
శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ, Photo చూశారా
Ola Offer: రూ.50 వేలలోపే ఎలక్ట్రిక్ స్కూటర్ - అద్భుతమైన ఆఫర్ ఇస్తున్న ఓలా!
రూ.50 వేలలోపే ఎలక్ట్రిక్ స్కూటర్ - అద్భుతమైన ఆఫర్ ఇస్తున్న ఓలా!
Telangana News: కేటీఆర్ పై ఉట్నూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన ఆత్రం సుగుణక్క
కేటీఆర్ పై ఉట్నూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన ఆత్రం సుగుణక్క
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Rupai Village Story | ఈ ఊరి పేరు వెనుక స్టోరీ వింటే ఆశ్చర్యపోతారు | ABP DesamThalapathy69 Cast Reveal | తలపతి విజయ్ ఆఖరి సినిమా కథ ఇదేనా.? | ABP DesamRohit Sharma on Virat Kohli | టెస్ట్ క్రికెట్ లో టీమిండియా ప్రభంజనం..ఓపెన్ అయిన రోహిత్ | ABP Desamఇజ్రాయేల్‌పై ఇరాన్ భీకర దాడులు, నెతన్యాహు స్ట్రాంగ్ వార్నింగ్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Good News For Farmers: సన్న వడ్లకు క్వింటాకు రూ.500 బోనస్, రైతుల ఖాతాల్లో జమపై ప్రభుత్వం శుభవార్త
సన్న వడ్లకు క్వింటాకు రూ.500 బోనస్, రైతుల ఖాతాల్లో జమపై ప్రభుత్వం శుభవార్త
Tirumala Brahmotsavalu 2024: శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ, Photo చూశారా
శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ, Photo చూశారా
Ola Offer: రూ.50 వేలలోపే ఎలక్ట్రిక్ స్కూటర్ - అద్భుతమైన ఆఫర్ ఇస్తున్న ఓలా!
రూ.50 వేలలోపే ఎలక్ట్రిక్ స్కూటర్ - అద్భుతమైన ఆఫర్ ఇస్తున్న ఓలా!
Telangana News: కేటీఆర్ పై ఉట్నూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన ఆత్రం సుగుణక్క
కేటీఆర్ పై ఉట్నూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన ఆత్రం సుగుణక్క
Jio Best 5G Plan: జియో చవకైన 5జీ ప్లాన్ - రూ.200 లోపే అన్‌లిమిటెడ్ డేటా!
జియో చవకైన 5జీ ప్లాన్ - రూ.200 లోపే అన్‌లిమిటెడ్ డేటా!
Raashi Khanna : గ్రే సూట్​లో హాట్​ ఫోటోషూట్ చేసిన రాశీ ఖన్నా.. స్టైలిష్​ లుక్స్​ చూశారా?
గ్రే సూట్​లో హాట్​ ఫోటోషూట్ చేసిన రాశీ ఖన్నా.. స్టైలిష్​ లుక్స్​ చూశారా?
Nagarjuna Defamation: మంత్రి కొండా సురేఖపై పరువు నష్టం దావా వేసిన నాగార్జున, ఏం డిమాండ్ చేశారంటే!
మంత్రి కొండా సురేఖపై పరువు నష్టం దావా వేసిన నాగార్జున, ఏం డిమాండ్ చేశారంటే!
Happy Dussehra 2024 : దసరా శుభాకాంక్షలు సోషల్ మీడియాలో ఇలా చెప్పేయండి.. ఫేస్​బుక్, వాట్సాప్​ల​లో ఇవి షేర్ చేసేయండి
దసరా శుభాకాంక్షలు సోషల్ మీడియాలో ఇలా చెప్పేయండి.. ఫేస్​బుక్, వాట్సాప్​ల​లో ఇవి షేర్ చేసేయండి
Embed widget