IND vs NZ 1st Test: 51/5తో టీమ్‌ఇండియా విలవిల..! గట్టెక్కించేందుకు శ్రేయస్, అశ్విన్ పోరాటం
న్యూజిలాండ్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తుండటంతో కాన్పూర్ టెస్టులో టీమ్‌ఇండియా కష్టాల్లో పడింది! షాట్ల ఎంపిక, నిర్ణయాల్లో బ్యాటర్లు తడబాటుకు గురయ్యారు.
కాన్పూర్ టెస్టులో టీమ్‌ఇండియా కష్టాల్లో పడింది! న్యూజిలాండ్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తుండటంతో పీకల్లోతు కష్టాల్లో పడింది. షాట్ల ఎంపిక, నిర్ణయాల్లో బ్యాటర్లు తడబాటుకు గురయ్యారు. దాంతో నాలుగో రోజు, భోజన విరామానికి రెండో ఇన్నింగ్స్‌లో భారత్ 5 వికెట్ల నష్టానికి 84 పరుగులు చేసింది. శతక వీరుడు శ్రేయస్ అయ్యర్ (18 బ్యాటింగ్; 51 బంతుల్లో 3x4), రవిచంద్రన్ అశ్విన్ (20 బ్యాటింగ్; 35 బంతుల్లో 3x4) కీలకంగా ఆడుతున్నారు.
ఓవర్ నైట్ స్కోరు 14/1తో టీమ్‌ఇండియా ఆదివారం ఆట మొదలు పెట్టింది. ఓపెనర్ మయాంక్ అగర్వాల్ (17; 53 బంతుల్లో 3x4), నయావాల్ చెతేశ్వర్ పుజారా (22; 33 బంతుల్లో 3x4) సానుకూల దృక్పథంతో ఆడారు. తొలి అర్ధగంట వరకు వీరిద్దరూ నిలకడగా ఆడుతూ రెండో వికెట్‌కు 30 పరుగుల భాగస్వామ్యం అందించారు.
కుదురుకున్న ఈ జోడీని పుజారాను ఔట్ చేయడం ద్వారా జేమీసన్ విడదీశాడు. అప్పటికి స్కోరు 32. మరికాసేపటికే అజాజ్ పటేల్ వేసిన బంతిని క్రీజులోంచి ఆడి అజింక్య రహానె (4; 15 బంతుల్లో 1x4) వెనుదిరిగాడు. ఇక జట్టు స్కోరు 51 వద్ద ఓకే ఓవర్లో మయాంక్ అగర్వాల్, రవీంద్ర జడేజా (0)ను టిమ్ సౌథీ పెవిలియన్ పంపించాడు. దాంతో టీమ్‌ఇండియా 51/5తో కష్టాల్లో పడింది. శ్రేయస్, అశ్విన్ 74 బంతుల్లో 33 పరుగుల అజేయ భాగస్వామ్యంతో ఇన్నింగ్స్ నిర్మించే పనిలో ఉన్నారు.
That will be Lunch on Day 4 of the 1st Test.#TeamIndia 345 & 84/5, lead New Zealand (296) by 133 runs.
— BCCI (@BCCI) November 28, 2021
Scorecard - https://t.co/WRsJCUhS2d #INDvNZ @Paytm pic.twitter.com/VdJmIvzoSA
Also Read: Watch Video: అశ్విన్‌కు ఎడ్జ్ చేయడం నేర్పించిన అక్షర్..!
Also Read: IND vs NZ Kanpur Test: యాష్ నువ్వే భేష్..! బ్యాటర్ల బుర్రల్లో చిక్కుముళ్లు వేశావన్న వెటోరీ
Also Read: Kapil Dev: ముందు పాండ్యను బౌలింగ్ చేయనివ్వండి..! నా వరకైతే అశ్వినే మెరుగైన ఆల్‌రౌండర్
Also Read: Shreyas Iyer: నాలుగేళ్లుగా డీపీ మార్చని శ్రేయస్ తండ్రి..! కొడుకు సెంచరీకీ దానికీ లింకేంటి?
Also Read: IPL 2022 Auction: ముంబయి ఇండియన్స్ తీసుకుంటానన్నా.. నో.. నో అంటున్న స్టార్ ప్లేయర్
Also Read: Ind-Pak 2021 WC: రికార్డు బద్దలు కొట్టిన ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్.. ఎంతమంది చూశారంటే?
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి