By: ABP Desam | Updated at : 02 Jul 2022 04:29 PM (IST)
Edited By: Ramakrishna Paladi
భారత్ vs ఇంగ్లాండ్, ( Image Source : BCCI )
IND vs ENG, 1st Innings Highlights: ఎడ్జ్‌బాస్టన్‌లో టీమ్‌ఇండియా దాదాపుగా 'ఎడ్జ్' సాధించింది. ఇంగ్లాండ్‌తో ఐదో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 84.5 ఓవర్లకు 416కు ఆలౌటైంది. 98కే 5 వికెట్లు చేజార్చుకున్న భారత్‌ను రిషభ్ పంత్ (146; 111 బంతుల్లో 20x4, 4x6), రవీంద్ర జడేజా (104; 194 బంతుల్లో 13x4) అద్వితీయమైన సెంచరీలతో ఆదుకున్నారు. ప్రత్యర్థి జట్టుపై ఆధిక్యం సాధించగల స్కోరును అందించారు.
రెండో రోజైన శనివారం ఓవర్‌నైట్ స్కోరు 338/7తో టీమ్‌ఇండియా బ్యాటింగ్ ఆరంభించింది. కేవలం 11.5 ఓవర్లు మాత్రమే ఆడింది. అయితేనేం! 78 పరుగులు సాధించింది. వ్యక్తిగత స్కోరు 83తో క్రీజులోకి వచ్చిన రవీంద్ర జడేజా చక్కని కవర్‌డ్రైవ్‌లతో అలరించాడు. మ్యాటీ పాట్స్ వేసిన 78.5వ బంతికి లభించిన జీవనదానాన్ని ఉపయోగించుకున్నాడు. అదే ఓవర్లో ఆఖరి రెండు బంతుల్ని బౌండరీకి పంపించి టెస్టుల్లో మూడో సెంచరీ అందుకున్నాడు. మొత్తంగా 183 బంతుల్లో 13 ఫోర్లతో ఈ ఘనత సాధించాడు. అయితే అండర్సన్ వేసిన 82.2వ బంతికి అతడు ఔటయ్యాడు. అంతకు ముందే షమీ ఔటవ్వడంతో భారత్ 375/9తో నిలిచింది.
Also Read: జస్ట్ 6.14 నిమిషాల్లో రిషభ్ పంత్ ఊచకోత - వైరల్ వీడియో!
Also Read: ఎడ్జ్‌బాస్టన్‌లో 'రాక్‌స్టార్'! వరుస బౌండరీలతో జడ్డూ సెంచరీ
జట్టు స్కోరు 400 దాటితే బాగుండూ అనుకుంటున్న తరుణంలో కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా (31*; 16 బంతుల్లో 4x4, 2x6) స్టేడియాన్ని దద్దరిల్లేలా చేశాడు. స్టువర్ట్ బ్రాడ్ వేసిన 84వ ఓవర్లో ఏకంగా 35 రన్స్ కొట్టి సర్‌ప్రైజ్ చేశాడు. వరుసగా 4 Wd5 N6 4 4 4 6 1తో దుమ్మురేపాడు. అండర్సన్ వేసిన 84.5వ బంతికి సిరాజ్ (2) ఔటవ్వడంతో టీమ్‌ఇండియా తొలి ఇన్నింగ్స్ ముగిసింది. జిమ్మీ ఆరోసారి టీమ్‌ఇండియాపై 5 వికెట్ల ఘనత అందుకున్నాడు.
Innings Break!
— BCCI (@BCCI) July 2, 2022
Centuries from @RishabhPant17 (146) & @imjadeja (104) and an entertaining 31* from @Jaspritbumrah93 as #TeamIndia post 416 in the first innings.
Scorecard - https://t.co/xOyMtKJzWm #ENGvIND pic.twitter.com/M9RtB5Hu02
#TeamIndia fans, did you enjoy that from @Jaspritbumrah93 😄😄
— BCCI (@BCCI) July 2, 2022
Live - https://t.co/xOyMtKJzWm #ENGvIND pic.twitter.com/xfBZ18bdd5
A 32nd Test five-fer for the great man @jimmy9! 👏
— England Cricket (@englandcricket) July 2, 2022
Scorecard/Videos: https://t.co/jKoipF4U01
🏴 #ENGvIND 🇮🇳 | #BlueForBob | @IGCom pic.twitter.com/xQyZwWdjSL
Mukesh Kumar: ఘనంగా టీమిండియా పేసర్ పెళ్లి , వరుసగా మోగుతున్న పెళ్లి బాజాలు
Ruturaj Gaikwad: తొలి భారత బ్యాటర్ రుతురాజే , అరుదైన రికార్డు సృష్టించిన యంగ్ గన్
Wrestling Federation of India: రెజ్లింగ్ సమాఖ్య ఎన్నికలకు పచ్చజెండా, స్టేను కొట్టేసిన సుప్రీంకోర్టు
T20 World Cup 2024: టీ 20 ప్రపంచకప్‌నకు నమీబియా, వరుసగా మూడోసారి అరుదైన ఘనత
Ishan Kishan: ఇషాన్ కిషన్ ఆ తప్పు చేయకుండా ఉంటే...
Telangana Elections 2023 : దేవుడి మీదే భారం - ఆలయాలకు క్యూ కట్టిన అన్ని పార్టీల నేతలు !
EC Arrangements: పోలింగ్ డే కోసం ఈసీ భారీ ఏర్పాట్లు- ఎన్నికల సిబ్బందికి కీలక సూచనలు
Janasena Meeting: డిసెంబర్ 1 జనసేన విస్తృతస్థాయి సమావేశం - ఏం చర్చిస్తారంటే?
సముద్రంలో కుప్ప కూలిన అమెరికా మిలిటరీ ఎయిర్‌క్రాఫ్ట్, జపాన్‌లోని ఓ ద్వీపం వద్ద ప్రమాదం
/body>