Rishabh Pant Century: జస్ట్ 6.14 నిమిషాల్లో రిషభ్ పంత్ ఊచకోత - వైరల్ వీడియో!
IND vs ENG 5th Test: ఇంగ్లాండ్‌తో ఐదో టెస్టులో ప్రత్యర్థి వ్యూహాలను రిషభ్ పంత్ (146; 111 బంతుల్లో 20x4, 4x6) పటాపంచలు చేశాడు. అండర్సన్, బ్రాడ్, మ్యాటీ పాట్స్, జాక్‌లీచ్ బౌలింగ్‌ను ఉతికారేశాడు.
Rishabh Pant Century: ఇంగ్లాండ్‌తో జరుగుతున్న ఐదో టెస్టులో టీమ్‌ఇండియా అద్భుతంగా ఆడుతోంది. తొలిరోజు ప్రత్యర్థి జట్టుపై ఆధిపత్యం చెలాయించింది. మొదట 98 పరుగులకే ఐదు వికెట్లు తీసిన బెన్‌స్టోక్స్ సేన ఒత్తిడి పెంచింది. 150 పరుగుల్లోపే బూమ్.. బూమ్.. బుమ్రా సేనను ఆలౌట్ చేసేందుకు ప్రయత్నించింది. వారి వ్యూహాలను యువ వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ (146; 111 బంతుల్లో 20x4, 4x6) పటాపంచలు చేశాడు. అండర్సన్, బ్రాడ్, మ్యాటీ పాట్స్, జాక్‌లీచ్ బౌలింగ్‌ను ఉతికారేశాడు.
6 mins 14 secs of glorious RishabhPantness.pic.twitter.com/HjtLSUwMeL
— Vinayakk (@vinayakkm) July 1, 2022
రవీంద్ర జడేజా (83 బ్యాటింగ్; 163 బంతుల్లో 10x4) సాయంతో రిషభ్ పంత్ (Rishabh Pant) ఆరో వికెట్‌కు 239 బంతుల్లోనే 222 పరుగుల భాగస్వామ్యం అందించాడు. ముఖ్యంగా షార్ట్‌లెంగ్త్ బంతుల్ని అతడు ఫైన్‌లెగ్‌లోకి పంపించిన తీరు ఆకట్టుకుంది. ప్రత్యర్థితులు ఎలాంటి బంతులతో భయపెట్టినా దూకుడుగా ఆడాడు. కౌంటర్ అటాక్‌తో వారిని వణికించాడు. అతడు కొట్టే షాట్లకు ఆంగ్లేయుల వద్ద సమాధానమే లేదు. అతడికి బౌలింగ్ చేసేందుకు చాలా ఇబ్బంది పడ్డారు. 89 బంతుల్లోనే సెంచరీ కొట్టేసిన పంత్‌పై ఇప్పుడు ప్రశంసల జల్లు కురుస్తోంది. అతడి ఇన్నింగ్స్ వీడియోను సోనీలైవ్ ట్విటర్లో పోస్టు చేసింది. మొత్తం విధ్వంసాన్ని 6.14 నిమిషాల్లో చూసి ఎంజాయ్ చేయండి.
Also Read: ధోనీకి మోకాళ్ల నొప్పులు! ఆయుర్వేద చికిత్స తీసుకుంటున్న ఛాంపియన్!
Also Read: క్రెడిట్ కార్డు అప్పు గుదిబండలా మారిందా? ఈ 10 చిట్కాలతో రిలాక్స్ అవ్వండి!
A fine fine innings from Rishabh Pant comes to an end.
— BCCI (@BCCI) July 1, 2022
He departs after scoring 146 runs.
Live - https://t.co/xOyMtKJzWm #ENGvIND pic.twitter.com/cojpQHJqJm
A fine fine innings from Rishabh Pant comes to an end.
— BCCI (@BCCI) July 1, 2022
He departs after scoring 146 runs.
Live - https://t.co/xOyMtKJzWm #ENGvIND pic.twitter.com/cojpQHJqJm
.@RishabhPant17 scored a stunning 146 as he brought up his 5⃣th Test ton & was our top performer from Day 1 of the #ENGvIND Edgbaston Test. 👏 👏 #TeamIndia
— BCCI (@BCCI) July 1, 2022
A summary of his knock 🔽 pic.twitter.com/31d1j8yBgo