IND vs ENG, 5th Test: రద్దైన టెస్టును మళ్లీ నిర్వహించండి... ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డును కోరిన BCCI
బీసీసీఐ... ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డును రద్దైన టెస్టు మ్యాచ్‌ను తర్వాత అయినా జరిపించాలని కోరిందట.
ఎన్నో చర్చల అనంతరం భారత్ X ఇంగ్లాండ్ మధ్య ఈ రోజు (శుక్రవారం) ప్రారంభం అవ్వాల్సిన ఐదో టెస్టును రద్దు చేశారు. అయితే ఈ టెస్టును ఎలాగైనా జరిపించాలని బీసీసీఐ ఆలోచిస్తోంది. ఈ నేపథ్యంలో బీసీసీఐ... ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డును రద్దైన టెస్టు మ్యాచ్‌ను తర్వాత అయినా జరిపించాలని కోరిందట.
Following ongoing conversations with the BCCI, the ECB can confirm that the fifth LV= Insurance Test at Emirates Old Trafford, due to start today, will be cancelled.
— England Cricket (@englandcricket) September 10, 2021
ఐదో టెస్టును త్వరలోనే మళ్లీ నిర్వహించేందుకు ఈసీబీ(ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు)తో కలిసి పని చేస్తున్నట్లు బీసీసీఐ సెక్రటరీ జైషా తెలిపారు. ఈ కష్ట సమయంలో తమ పరిస్థితిని అర్థం చేసుకొని సహకరించినందుకు ఈ సందర్భంగా ఈసీబీకి జైషా థాంక్స్ చెప్పారు. మరో వైపు ఫైనల్ మ్యాచ్ రద్దవ్వడంపై పలువురు మాజీలు, అభిమానులు నిరాశకు గురయ్యారు. సామాజిక మాధ్యమాల్లో అసహనం వ్యక్తం చేశారు.
Update: The BCCI and ECB held several rounds of discussion to find a way to play the match, however, the outbreak of Covid-19 in the Indian team contingent forced the decision of calling off the Old Trafford Test.
— BCCI (@BCCI) September 10, 2021
Details: https://t.co/5EiVOPPOBB
అంతకుముందు మ్యాచ్ రద్దుపై తొలుత ఇంగ్లాండ్, వేల్స్ క్రికెట్ బోర్డు అభిమానులను గందరగోళానికి గురి చేసింది. ఈ టెస్టులో టీమిండియా తమ తుది జట్టును బరిలోకి దింపలేకపోతున్నందున మ్యాచ్‌ను కోల్పోయిందని ప్రకటించింది. తర్వాత ఈ వ్యాఖ్యలను సరిచేసుకొని ఐదో టెస్టు రద్దయినట్లు తెలిపింది.
,
India have let English Cricket down !!! But England did let South African Cricket down !!!
— Michael Vaughan (@MichaelVaughan) September 10, 2021
భారత క్రికెట్ జట్టు ఫిజియోకి కరోనా పాజిటివ్ రావడంతో చివరి టెస్టును రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఆటగాళ్లకు నిర్వహించిన టెస్టుల్లో అందరికీ నెగిటివ్ ఫలితాలే వచ్చాయి.