By: ABP Desam | Updated at : 04 Feb 2022 12:39 PM (IST)
Edited By: Ramakrishna Paladi
విరాట్ కోహ్లీ
ఐసీసీ అండర్-19 ప్రపంచకప్‌లో టీమ్‌ఇండియా ఇరగదీస్తోంది. భారత జట్టులో కొవిడ్-19 ప్రకంపనలు సృష్టించినా వరుస విజయాలు సాధించింది. మరోసారి ఫైనల్ చేరుకొని సత్తా చాటింది. తుది సమరానికి ముందు కుర్రాళ్లకు టీమ్‌ఇండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ విలువైన సలహాలు ఇచ్చాడు.
ఇప్పటి వరకు భారత జట్టు నాలుగు సార్లు అండర్-19 ప్రపంచకప్ గెలిచింది. ఈ ఈవెంట్‌ను అత్యధిక సార్లు గెలిచిన జట్టు మనదే. తాజాగా మరోసారి కప్పు ముంగిట నిలిచింది. భారత కాలమానం ప్రకారం శనివారం సాయంత్రం 6:30 గంటలకు ఇంగ్లాండ్‌ను ఫైనల్లో ఢీకొట్టనుంది. ఇందులో గెలిస్తే ఐదుసార్లు ప్రపంచకప్ గెలిచిన ఏకైక జట్టుగా యువ భారత్ నిలుస్తుంది. అందుకే ఈ కీలక సమరానికి ముందు విరాట్ కోహ్లీతో కుర్రాళ్లకు వర్చువల్ సమావేశం ఏర్పాటు చేశారు.
అండర్-19 సారథిగా విరాట్ కోహ్లీకి మంచి అనుభవమే ఉంది. 2008లో అతడి నాయకత్వంలో కుర్ర జట్టు ప్రపంచకప్ గెలిచింది. అతడు జట్టును నడిపించిన తీరు అందరికీ ఆకట్టుకుంది. ఇక సీనియర్ క్రికెట్ జట్టు కెప్టెన్‌గానూ అతడు రికార్డు సృష్టించాడు. ఫైనల్‌కు ముందు అతడి సలహాలు జట్టుకు ఉపయోగపడతాయని బీసీసీఐ భావించింది. అతడితో వర్చువల్‌గా సమావేశం ఏర్పాటు చేసింది. ఇందుకు సంబంధించిన స్క్రీన్‌షాట్లను కుర్ర క్రికెటర్లు పంచుకున్నారు.
Also Read: Sourav Ganguly: ఐపీఎల్ 2022 ఇక్కడే.. త్వరలో మహిళల ఐపీఎల్ కూడా.. గంగూలీ ఏమన్నారంటే?
'ఫైనల్స్‌కు ముందు GOAT (గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్‌టైమ్) నుంచి కొన్ని విలువైన సలహాలు అందుకున్నాం' అని అండర్-19 ఆఫ్ స్పిన్నర్ కుశాల్ తంబె ఇన్‌స్టాలో పోస్టు చేశాడు. 'మీతో మాట్లాడటం చాలా బాగుంది విరాట్ కోహ్లీ భయ్యా. జీవితం, క్రికెట్‌ఫై మీ నుంచి కొన్ని కీలకమైన పాఠాలు నేర్చుకున్నాం. మున్ముందు మేం మరింత మెరుగయ్యేందుకు అవి మాకు సాయం చేస్తాయి' అని ఆల్‌రౌండర్ రాజ్‌వర్ధర్ హంగర్‌గేకర్ అన్నాడు.
వెస్టిండీస్ వేదికగా ఈ సారి అండర్-19 ప్రపంచకప్ జరుగుతోంది. యశ్‌ధుల్ కెప్టెన్సీ చేస్తున్నాడు. అతడికి ఆంధ్రా క్రికెటర్ షేక్ రషీద్ వైస్ కెప్టెన్‌గా సాయపడుతున్నాడు. ఒకట్రెండు మ్యాచులు కాగానే భారత జట్టులో కొందరికి కొవిడ్ సోకింది. దాంతో రిజర్వు సభ్యులతో కలిసి టీమ్‌ఇండియా మ్యాచులు ఆడి గెలిచింది. కీలకమైన సెమీస్‌లో ఆసీస్‌పై యశ్ సెంచరీ కొట్టాడు. షేక్ రషీద్ (94) సెంచరీకి చేరువయ్యాడు. వీరిద్దరూ ఫైనల్లోనూ ఇలాగే చెలరేగాలని అభిమానులు కోరుకుంటున్నారు.
It's time to 🗣️ 𝑰𝒏𝒅𝒊𝒂𝒂 𝑰𝒏𝒅𝒊𝒂𝒂 in the #ICC #U19CWC Final! 🤩
— Star Sports (@StarSportsIndia) February 4, 2022
Give us a 🙌 if you're ready to #BelieveInBlue & cheer for #TeamIndia just like #ViratKohli!
#INDvENG | Feb 5, 6:30 PM | Star Sports 1/1HD/Select 2/Select 2HD/Disney+Hotstar pic.twitter.com/AAK0p3a4eN
LSG vs RCB, Eliminator Highlights: LSGని ఎలిమినేట్ చేసిన RCB - రాహుల్ సేనను ముంచిన క్యాచ్‌డ్రాప్‌లు!
LSG vs RCB, Eliminator Highlights: సెంచరీతో రప్ఫాడించిన రజత్ - ఎలిమినేటర్‌లో LSG టార్గెట్ 208
LSG vs RCB, Eliminator: లక్నోదే లక్కు! టాస్ గెలిచిన రాహుల్ - ఆర్సీబీ ఫస్ట్ బ్యాటింగ్
LSG vs RCB, Eliminator: బ్యాడ్ న్యూస్! వర్షంతో ఎలిమినేటర్ మ్యాచ్ టాస్ ఆలస్యం
IPL 2022: ఈ రికార్డ్ LSGకే సొంతమేమో! ప్లేఆఫ్స్ చేరిన RR, RCB, GTపై గెలవనేదుగా!!
Telangana CM KCR Bengaluru Tour: నేడు హైదరాబాద్‌కు ప్రధాని మోదీ- బెంగళూరుకు సీఎం కేసీఆర్, ముచ్చటగా మూడోసారి
Diabetes: అధ్యయనంలో షాకింగ్ రిజల్ట్, టైప్ 2 డయాబెటిస్ ఉంటే మెదడు త్వరగా ముసలిదైపోతుంది
Weather Updates: నేడు ఈ జిల్లాల్లో వర్షం, ఎల్లో అలర్ట్ జారీ! ఏపీలో నేడు 2-4 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు
YS Jagan Davos Tour: మచిలీపట్నంలో కర్బన రహిత ఇండస్ట్రియల్ మాన్యుఫ్యాక్చరింగ్ జోన్, ఏపీతో ఏస్ అర్బన్ డెవలపర్స్ ఒప్పందం