WI vs SL, Match Highlights: అస్సాం ట్రైన్ ఎక్కేసిన వెస్టిండీస్.. 20 పరుగులతో శ్రీలంక విజయం
ICC T20 WC 2021, WI vs SL: టీ20 వరల్డ్ కప్ నుంచి డిఫెండింగ్ చాంపియన్ వెస్టిండీస్ నిష్క్రమించింది. కీలక సూపర్ 12 మ్యాచ్‌లో వెస్టిండీస్‌పై శ్రీలంక 20 పరుగుల తేడాతో విజయం సాధించింది.
టీ20 వరల్డ్‌కప్ నుంచి డిఫెండింగ్ చాంపియన్ వెస్టిండీస్ నిష్క్రమించింది. టోర్నీలో నిలవాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో శ్రీలంక చేతిలో పరుగుల చేతిలో ఓడిపోయింది. మొదట బ్యాటింగ్ చేసిన శ్రీలంక 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి నష్టానికి 189 పరుగులు చేసింది. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన వెస్టిండీస్ 20 ఓవర్లలో వికెట్ల నష్టానికి పరుగులు చేసింది.
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంకకు మంచి ఆరంభం లభించింది. నిశ్శంక, కుశాల్ పెరీరా మొదటి వికెట్‌కు 42 పరుగులు జోడించాక ఇన్నింగ్స్ ఆరో ఓవర్లో కుశాల్ పెరీరా అవుటయ్యాడు. ఆ తర్వాత అసలంక, నిశ్శంక రెండో వికెట్‌కు 91 పరుగులు జోడించారు. అర్థసెంచరీ చేసిన అనంతరం 16వ ఓవర్లో నిశ్శంక అవుటయ్యాడు.
ఆ తర్వాత అసలంక, షనక వేగంగా ఆడటంతో శ్రీలంక 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 189 పరుగులు చేసింది. వెస్టిండీస్ బౌలర్లలో రసెల్ రెండు వికెట్లు తీయగా.. డీజే బ్రేవోకి ఒక వికెట్ దక్కింది. ఈ మ్యాచ్‌లో వెస్టిండీస్ ఏకంగా ఏడు బౌలింగ్ ఆప్షన్లను ట్రై చేసింది.
190 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన వెస్టిండీస్ బ్యాట్స్‌మెన్ ఘోరంగా విఫలమయ్యారు. షిమ్రన్ హెట్‌మేయర్, నికోలస్ పూరన్ మినహా ఒక్క బ్యాట్స్‌మెన్ కూడా రెండంకెల స్కోరు చేయలేదు. చివర్లో హెట్‌మేయర్ చెలరేగి ఆడటంతో విండీస్ చివరి ఐదు ఓవర్లలో 59 పరుగులు చేసింది. అయితే ఛేదించాల్సిన లక్ష్యం ఎక్కువగా ఉండటంతో ఆ వేగం సరిపోలేదు. దీంతో వెస్టిండీస్ 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 169 పరుగులకే పరిమితం అయింది.
శ్రీలంక బౌలర్లలో ఫెర్నాండో, కరుణరత్నే, వనిందు హసరంగ తలో రెండు వికెట్లు తీశారు. చమీర, షనకకు చెరో వికెట్ దక్కింది. ఈ పరాజయంతో వెస్టిండీస్ టోర్నీ నుంచి నిష్క్రమించింది. గ్రూప్-1లో ఇంగ్లండ్ ఇప్పటికే సెమీస్‌కు వెళ్లిపోగా.. ప్రస్తుతానికి ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా రెండో స్థానం కోసం రేసులో ఉన్నాయి.
Also Read: Khel Ratna Award 2021: ఈసారి 12 మందికి ఖేల్‌రత్న.. ఒలింపియన్లకు గౌరవం.. జాబితాలో మిథాలీ, ఛెత్రీ