Harbhajan Singh on Politics: భల్లే.. భల్లే..! భజ్జీకి పార్టీలు, ఫ్రాంచైజీల నుంచి ఆఫర్లు
ముందే వీడ్కోలు పలకాల్సిందని టీమ్‌ఇండియా మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ అన్నాడు. ఇక నుంచి కుటుంబానికి సమయం ఇస్తానని పేర్కొన్నాడు. రాజకీయ పార్టీల నుంచి తనకు ఆఫర్లు వస్తున్నాయని వెల్లడించాడు.
అంతర్జాతీయ క్రికెట్‌కు మూడునాలుగేళ్ల ముందే వీడ్కోలు పలకాల్సిందని టీమ్‌ఇండియా మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ అన్నాడు. ఇక నుంచి కుటుంబానికి సమయం ఇస్తానని పేర్కొన్నాడు. రాజకీయ పార్టీల నుంచి తనకు ఆఫర్లు వస్తున్నాయని వెల్లడించాడు. మాజీ క్రికెటర్ సిద్ధూతో కలిసి తీసుకున్న చిత్రంపై స్పందించాడు. పంజాబ్‌లోని జలంధర్‌కు వచ్చిన భజ్జీ అక్కడి బాల్టన్ పార్క్‌ను సందర్శించాడు.
'జీవించడానికి మనకు ఒకే ఒక్క అవకాశం వస్తుంది. అందుకే చేయాల్సిందంతా చేసేయాలి. నేనిప్పుడు కుటుంబానికి సమయం ఇవ్వాలని అనుకుంటున్నా' అని భజ్జీ అన్నాడు. 'నేనీ మైదానం నుంచే క్రికెట్ మొదలు పెట్టాను' అని బాల్టన్ మైదానాన్ని ఉద్దేశించి చెప్పాడు.
All good things come to an end and today as I bid adieu to the game that has given me everything in life, I would like to thank everyone who made this 23-year-long journey beautiful and memorable.
— Harbhajan Turbanator (@harbhajan_singh) December 24, 2021
My heartfelt thank you 🙏 Grateful .https://t.co/iD6WHU46MU
'నేను రాజకీయ పార్టీలో చేరతానా లేదా అన్నది కచ్చితంగా చెబుతాను. పార్టీల నుంచి నాకు ఆఫర్లు వస్తున్నాయి. మనసును అందుకు సిద్ధం చేసుకుంటున్నాను. నచ్చినప్పుడే రాజకీయాల్లో చేరతా. ఇప్పటికైతే నిర్ణయం తీసుకోలేదు. భవిష్యత్తు గురించి ప్రణాళికలు వేసుకుంటున్నా. ఒకవేళ రాజకీయ పార్టీలో చేరాలనుకుంటే కచ్చితంగా ప్రతి ఒక్కరి అభిప్రాయం తీసుకుంటాం. అందరూ మద్దతు ఇస్తారనే అనుకుంటున్నా' అని హర్భజన్ చెప్పాడు.
मैंने अभी इस बारे में कुछ नहीं सोचा है। मुझे अलग-अलग पार्टियों से शामिल होने के ऑफर मिले हैं। मैंने नवजोत सिंह सिद्धू से बतौर क्रिकेटर मुलाकात की: कांग्रेस पार्टी में शामिल होने पर हरभजन सिंह pic.twitter.com/kxSHJcFQLP
— ANI_HindiNews (@AHindinews) December 25, 2021
పంజాబ్ కాంగ్రెస్ అధ్యక్షుడు నవజ్యోత్ సింగ్ సిద్ధూను కలవడంపై భజ్జీ మాట్లాడాడు. 'ఒక క్రికెటర్‌గానే సిద్ధూను కలిశాను. ఎలక్షన్ సమయం కాబట్టి ఒక ఫొటో తీసుకున్నా వదంతులు వ్యాపిస్తూనే ఉంటారు. నాకు ఇతర పార్టీల్లోనూ మిత్రులు ఉన్నారు. ఐపీఎల్ జట్ల నుంచీ ఆఫర్లు ఉన్నాయి. మెంటార్, కామెంటేటర్‌గా ఆహ్వానాలు అందుతున్నాయి' అని చెప్పాడు. బహుశా భజ్జీ కోల్‌కతా లేదా కొత్త ఫ్రాంచైజీల్లో ఒకదానికి మెంటార్‌గా ఉండే అవకాశం ఉంది.
Thank you Jam🤗, @imVkohli 🤗@cheteshwar1 🤗 🙏 Love you guys .. Good luck .. win the series in SA https://t.co/32ZlGUygPh
— Harbhajan Turbanator (@harbhajan_singh) December 24, 2021
Also Read: 83 Film Update: ప్రపంచకప్ గెలిచిన రోజు పస్తులతో పడుకున్న కపిల్ డెవిల్స్..! ఎందుకో తెలుసా?
Also Read: Virat Kohli Captaincy Row: కోహ్లీ, గంగూలీలో ఎవరిది అబద్ధమంటే.. రవిశాస్త్రి కామెంట్స్!
Also Read: Thaggedhe Le: ‘నీ అంత బాగా చేయలేదు బన్నీ’ అన్న జడ్డూ.. ఎందుకంటే?
Also Read: IND vs SA: ద్రవిడ్ అనుభవం 'బూస్టు' అంటున్న టీమ్‌ఇండియా ఇద్దరు మిత్రులు!
Also Read: Harbhajan Singh Retirement: బంతి పక్కన పెట్టేసిన భజ్జీ.. క్రికెట్ నుంచి పూర్తిగా వీడ్కోలు!
Also Read: Harbhajan Singh retirement: 711 వికెట్లు తీయడమంటే 'దబిడి దిబిడే'.. భజ్జీపై ద్రవిడ్, కోహ్లీ ప్రశంసలు