Hardik Mahieka Beach Photos:బీచ్ ఫోటోలు రిలీజ్ చేసి మహీకాతో రిలేషన్ డిక్లేర్ చేసిన హార్థిక్ పాండ్యా..! కుర్ర మోడల్‌తో కొత్త ఇన్నింగ్స్...!
Hardik Mahieka: ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా సోషల్‌మీడియాను షేక్ చేశాడు.. మహీక శర్మతో తన రూమర్డ్ రిలేషన్‌షిప్‌ను Instagram అఫీషియల్ చేశాడు. కొత్త జంట బీచ్ ఫోటోలు ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారాయి.

Hardik Mahieka Relation: ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి వార్తల్లో నిలిచింది. ఈసారి క్రికెట్ ఫీల్డ్ కాకుండా ప్రేమకథ తో సోషల్ మీడియా హైలైట్‌లోకి వచ్చాడు. మాజీ భార్య నటాషా స్టాంకోవిచ్ తో విడాకుల తర్వాత మహీక శర్మ Mahieka Sharma అనే మోడల్‌తో హార్దిక్ కొత్త ఇన్నింగ్స్ మొదలుపెట్టాడని నెటిజన్లు అంచనా వేస్తున్నారు. తాజాగా అతను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఫోటోలు ఈ అంచనాలను నిజం చేస్తున్నాయి. తన కొత్త గర్ల్‌ఫ్రెండ్ మహీకాతో ఫోటోలను తన ఇన్‌స్టాగ్రమ్ స్టోరీలో పోస్ట్ చేసి తమ రిలేషన్‌ను Instgram Official చేశాడు
బీచ్ వెకేషన్ ఫోటోలు వైరల్
హార్దిక్ షేర్ చేసిన ఫోటోలలో మోడల్ మహీక శర్మతో బీచ్ వెకేషన్ స్పాట్‌లో ఇద్దరూ కలిసి ఉన్నారు. మొదటి ఫోటోలో హార్దిక్ casual poseలో మహీక భుజంపై చేయి పెట్టి relaxed గా కనిపించాడు. ఈ ఫోటో చూసిన ఫ్యాన్స్, "ఈ రిలేషన్ Instagram official అయిందే" అని ఫీల్ అవుతున్నారు.
రెండో ఫోటోలో వీరిద్దరూ డేట్ నైట్ లేదా నైట్ అవుట్ కోసం డ్రెస్-అప్ అయినట్లు కనిపిస్తోంది. హార్దిక్ oversize షర్ట్ + జీన్స్ లుక్‌లో, మహీక sleek black dressలో చాలా స్టైలిష్, స్టన్నింగ్గా కనిపించింది. బయటకు వచ్చిన వెంటనే ఈ ఫోటోలు ఇంటర్నెట్లో బజ్ క్రియేట్ చేశాయి. ఈ ఫోటోలు పెట్టడం ద్వారా హార్డిక్ తన రిలేషన్ను అఫీషియల్ చేశాడు అని భావిస్తున్నారు.

మహీక కూడా social media ద్వారా hints ఇచ్చింది
మహీక తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో కూడా హార్దిక్ ఫోటోను షేర్ చేసింది. ఫోటోపై pink bow , cake emojis పెట్టడం fans లో “couple goals” vibes ని పెంచింది. అసలు ఎలాంటి హింట్స్ లేకపోయినా స్టోరీలు అల్లేసే నెట్టిల్లు.. ఇక ఇలాంటి హింట్స్ వస్తే ఎందుకు ఆగుతారు.. చెలరేగిపోతారు.. సో ఇప్పుడు నెట్టింట్లో హార్దిక్ మహీకలో రిలేషనే హాట్ టాపిక్. ఫోటోలు వైరల్ కావడంతో సోషల్ మీడియా కామెంట్లు వరదలా వచ్చాయి. "Soft launch పూర్తయింది, full reveal ఇదే”, "Chemistry undeniable, perfect couple!”, “Hardik truly moved on fast!”, “This is Hardik’s quietest relationship announcement yet” వంటి కామెంట్లు వచ్చాయి.
నటాషాతో డైవోర్స్:
హార్దిక్ 2024 జూలైలో నటాషా స్టాంకోవిచ్తో విడాకులు ప్రకటించారు. వీరిద్దరూ 'అగస్త్య' అనే తమ కుమారుడి co-parenting కొనసాగిస్తున్నారు.
ఇప్పటివరకు హార్దిక్ ఈషా గుప్తాతో కూడా rumored relationship లో ఉన్నాడని వార్తలు వచ్చాయి. కానీ "మేము డేటింగ్‌లో లేం, కొన్ని months casual conversation మాత్రమే. అది dating-stage కి రాలేదు.” ఈషా స్పష్టం చేసింది –
మహీక శర్మ – కొత్త క్రష్
మహీక ఫ్యాషన్ ఇండస్ట్రీలో తనదైన గుర్తింపు తెచ్చుకున్నది. Economics & Finance లో డిగ్రీ పూర్తి చేసి, IFA Model of the Year, Elle Model of the Season awards గెల్చింది. క్రికెట్లో ఫంకీగా ఉండే హార్దిక్కు మహీక పర్ఫెక్ట్ జోడీలా కనిపిస్తోంది. ఫోటోలు, social media hints చూస్తే, మహీక & హార్దిక్‌ల కెమిస్ట్రీ బాగానే వర్కవుట్ అయినట్లు అనిపిస్తోంది. తమ రిలేషన్ పై అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు కానీ.. ఇప్పటికైతే... 'Instagram official' చేసినట్లు అనిపిస్తోంది.





















