Hardik Pandya Rumoured Girlfriend Mahieka Sharma | ఎవరీ మహికా శర్మ?
టీమిండియా క్రికెటర్ హార్దిక్ పాండ్యా మరోసారి వార్తల్లో నిలిచారు. ఆయన ప్రముఖ మోడల్ మహికా శర్మతో ప్రేమలో ఉన్నారనే వార్తలు గత కొంతకాలంగా హల్చల్ చేస్తున్నాయి. నటాషాతో డివోర్స్ తర్వాత మోడల్ మిహికా శర్మతో ఆయన లవ్‌లో ఉన్నారనే రూమర్లు వినిపిస్తున్నాయి. మహికా శర్మ లేటెస్ట్ గా ఒక దిగిన ఒకలో హార్దిక్ పాండ్యా ఉన్నారంటూ నెటిజన్లు వైరల్ చేశారు. దీంతో ఆమె ఎవరా? అంటూ నెటిజన్లు తెగ సెర్చ్ చేస్తున్నారు.
మహికా శర్మ ఓ ప్రముఖ మోడల్, హీరోయిన్. ఫ్యాషన్, ఎంటర్టైన్మెంట్ రంగంలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటారు. ఇండిపెండెంట్ మూవీస్, మ్యూజిక్ ఆల్బమ్స్‌లోనూ నటించారు. ఫేమస్ ఇండియన్ డిజైనర్ల కోసం ర్యాంప్ వాక్ కూడా చేశారు. అంతే కాకుండా 2024లో ఇండియన్ ఫ్యాషన్ అవార్డ్స్‌లో 'మోడల్ ఆఫ్ ది ఇయర్ (న్యూ ఏజ్)' బహుమతి అందుకున్నారు. ఈ రూమర్స్ పై అటు హార్దిక్ కానీ ఇటు మహికా కానీ ఎవరూ రియాక్ట్ కాకపోయినప్పటికీ వీరిద్దరి మధ్య స్నేహానికి మించి ఏదో ఉందని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. దీంతో ప్రస్తుతం ఇది హాట్ టాపిక్‌గా మారింది.





















