News
News
X

India U19 WC Sqaud 2022: ఐసీసీ అండర్‌-19 ప్రపంచకప్‌ భారత జట్టు వైస్‌ కెప్టెన్‌గా తెలుగు కుర్రాడు.. త్వరలో విండీస్‌కు పయనం

వెస్టిండీస్‌లో U-19 ప్రపంచకప్‌ జరుగుతోంది. ఈ టోర్నీలో 16 జట్లు తలపడుతున్నాయి. అన్ని జట్లను నాలుగు గ్రూపులుగా విభజించారు. భారత్‌ 'గ్రూప్‌ బి'లో ఉంది. బీసీసీఐ మొత్తం 17 మందిని ఎంపిక చేసింది.

FOLLOW US: 

ఐసీసీ అండర్‌ 19 ప్రపంచకప్‌నకు బీసీసీఐ భారత జట్టును ప్రకటించింది. మొత్తం 17 మందిని ఎంపిక చేసింది. ఐదుగురిని స్టాండ్‌బైగా పంపిస్తోంది. జనవరి 14 నుంచి ఫిబ్రవరి 5 వరకు ఈ టోర్నీ జరుగుతోంది.

వెస్టిండీస్‌ వేదికగా ఈ సారి ప్రపంచకప్‌ జరుగుతోంది. మొత్తం నాలుగు దేశాలు మ్యాచులకు ఆతిథ్యం ఇస్తున్నాయి. ఈ టోర్నీలో 16 జట్లు తలపడుతున్నాయి. అన్ని జట్లను నాలుగు గ్రూపులుగా విభజించారు. 48 మ్యాచులు జరుగుతాయి. ప్రతి గ్రూపులో అగ్రస్థానంలో నిలిచిన 2 జట్లు సూపర్‌ లీగ్‌కు అర్హత సాధిస్తాయి. భారత్‌ 'గ్రూప్‌ బి'లో ఉంది.

ఐసీసీ అండర్‌ 19 ప్రపంచకప్‌లో టీమ్‌ఇండియాది తిరుగులేని ప్రస్థానం. ఇప్పటి వరకు నాలుగు సార్లు విజేతగా ఆవిర్భవించింది. 2000, 2008, 2012, 2018లో ప్రపంచకప్‌లను ముద్దాడింది. 2016, 2020లో రన్నరప్‌గా నిలిచింది. 

టీమ్‌ఇండియా అండర్‌-19 జట్టుకు దిల్లీ కుర్రాడు యశ్‌ ధుల్‌ సారథ్యం వహించనున్నాడు. వైస్‌ కెప్టెన్‌గా ఎస్‌కే రషీద్‌ను ఎంపిక చేశారు. అతడు ఆంధ్రా కుర్రాడు కావడం గమనార్హం. హైదరాబాద్‌కు చెందిన రిషిత్‌ రెడ్డిని స్టాండ్‌బై ఆటగాడిగా ఎంపికయ్యాడు. జనవరి 15న గయానా వేదికగా దక్షిణాఫ్రికా, 19న ట్రినిడాడ్‌ అండ్‌ టొబాగో వేదికగా ఐర్లాండ్‌, 22న అక్కడే ఉగాండాతో టీమ్‌ఇండియా తలపడనుంది.

భారత జట్టు: యశ్‌ దుల్‌, రాజ్‌ అంగద్‌, హర్‌నూర్‌ సింగ్‌, మనవ్‌ ప్రకాశ్‌, అంగకృష్‌ రఘువంశీ, కుశాల్‌ తంబె, ఎస్‌కే రషీద్‌, హంగర్‌గెకర్‌, నిషాంత్‌ సింధు, వాసు వత్స్‌, సిద్ధార్థ్‌ యాదవ్‌, వికీ ఓస్త్‌వల్‌, అనీశ్వర్‌ గౌతమ్‌, రవికుమార్‌, దినేశ్‌ బనా, గార్వ్‌ సంగ్వాన్‌, ఆరాధ్య యాదవ్‌

స్టాండ్‌బై: రిషిత్‌ రెడ్డి, ఉదయ్‌ సహారన్‌, అన్ష్‌ గోసాయ్‌, అమృత్‌ రాజ్‌ ఉపాధ్యాయ్‌, పీఎం సింగ్‌ రాఠోడ్‌

Also Read: Kidambi Srikanth: తెలుగు తేజం మరో సంచలనం.. ఫైనల్లోకి దూసుకెళ్లిన కిడాంబి శ్రీకాంత్

Also Read: Year Ender 2021: ఈ ఏడాదీ యువరాజ్‌ దొరకలేదు..! ప్రపంచకప్పులు అందలేదు!

Also Read: IND vs SA: గబ్బర్‌ను పక్కన పెడితే అన్యాయమే! మిస్టర్‌ ఐసీసీనే పక్కన పెట్టేస్తారా?

Also Read: IND vs SA, KL Rahul: టీమ్‌ఇండియా టెస్టు వైస్‌ కెప్టెన్‌గా కేఎల్‌ రాహుల్‌

Also Read: Watch: ఊ.. అంటావ్‌ మామా! ఈ జింక పిల్ల గోల్‌ చూస్తే అనక తప్పదు మామా!!

Also Read: IND Vs SA: కెప్టెన్సీ రచ్చ అంతా సోషల్‌ మీడియాలోనే..! మస్తు ఎంజాయ్‌ చేస్తున్న ద్రవిడ్‌, కోహ్లీ!

Published at : 19 Dec 2021 07:01 PM (IST) Tags: India Team India BCCI ICC U19 Cricket World Cup 2022 Sk Rashid Yash Dhull

సంబంధిత కథనాలు

Ross Taylor on IPL Owner: దేవుడా!! డకౌట్‌ అయ్యాడని క్రికెటర్‌ చెంపలు వాయించిన ఐపీఎల్‌ ఓనర్‌!!

Ross Taylor on IPL Owner: దేవుడా!! డకౌట్‌ అయ్యాడని క్రికెటర్‌ చెంపలు వాయించిన ఐపీఎల్‌ ఓనర్‌!!

IND vs ZIM: ఓ మై గాడ్‌! టీమ్‌ఇండియాకే వార్నింగ్‌ ఇచ్చిన జింబాబ్వే కోచ్‌!

IND vs ZIM: ఓ మై గాడ్‌! టీమ్‌ఇండియాకే వార్నింగ్‌ ఇచ్చిన జింబాబ్వే కోచ్‌!

Indians In Foreign Leagues: ఎంఎస్‌ ధోనీకైనా ఇదే రూల్‌! కఠిన ఆదేశాలు ఇవ్వబోతున్న బీసీసీఐ

Indians In Foreign Leagues: ఎంఎస్‌ ధోనీకైనా ఇదే రూల్‌! కఠిన ఆదేశాలు ఇవ్వబోతున్న బీసీసీఐ

MS Dhoni Har Ghar Tiranga: డీపీ మార్చిన ధోనీ! ట్యాగ్‌ లైన్‌ చదివితే దేశభక్తి ఉప్పొంగుతుంది!

MS Dhoni Har Ghar Tiranga: డీపీ మార్చిన ధోనీ! ట్యాగ్‌ లైన్‌ చదివితే దేశభక్తి ఉప్పొంగుతుంది!

టీమిండియాకు పెద్ద దెబ్బ - టీ20 ప్రపంచకప్‌కు స్టార్ బౌలర్ దూరం?

టీమిండియాకు పెద్ద దెబ్బ - టీ20 ప్రపంచకప్‌కు స్టార్ బౌలర్ దూరం?

టాప్ స్టోరీస్

Minister Srinivas Goud : నా ఎదుగుదల ఓర్చుకోలేకే కుట్రలు, అది బుల్లెట్లు లేని బ్లాంక్ గన్ - మంత్రి శ్రీనివాస్ గౌడ్

Minister Srinivas Goud : నా ఎదుగుదల ఓర్చుకోలేకే కుట్రలు, అది బుల్లెట్లు లేని బ్లాంక్ గన్ - మంత్రి శ్రీనివాస్ గౌడ్

ఇక ఆన్‌లైన్‌లో ఉన్నా కనిపించదు - మూడు సూపర్ ఫీచర్లు తీసుకొస్తున్న వాట్సాప్!

ఇక ఆన్‌లైన్‌లో ఉన్నా కనిపించదు - మూడు సూపర్ ఫీచర్లు తీసుకొస్తున్న వాట్సాప్!

చైనా ఫోన్లపై ప్రభుత్వం బ్యాన్? - వినియోగదారుడికి లాభమా? నష్టమా?

చైనా ఫోన్లపై ప్రభుత్వం బ్యాన్? - వినియోగదారుడికి లాభమా? నష్టమా?

Telangana TDP Votes : టీడీపీ మద్దతుంటే తెలంగాణలో విజయం ఖాయమా ? రాజకీయ పార్టీలేం ఆలోచిస్తున్నాయి ?

Telangana TDP Votes :  టీడీపీ మద్దతుంటే తెలంగాణలో విజయం ఖాయమా ? రాజకీయ పార్టీలేం ఆలోచిస్తున్నాయి ?