IND Vs SA: కెప్టెన్సీ రచ్చ అంతా సోషల్ మీడియాలోనే..! మస్తు ఎంజాయ్ చేస్తున్న ద్రవిడ్, కోహ్లీ!
జోహానెస్ బర్గ్‌లో కెప్టెన్ విరాట్ కోహ్లీ, కోచ్ రాహుల్ ద్రవిడ్ సహా క్రికెటర్లంతా కలిసి కిక్ వాలీబాల్ ఆడారు. ముఖ్యంగా విరాట్, ద్రవిడ్ జోష్ చూస్తుంటే ఆశ్చర్యం వేస్తోంది.
రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ కెప్టెన్సీ వివాదం మీడియా, సోషల్ మీడియా, అభిమానులను మాత్రమే ప్రభావితం చేసినట్టుంది! ఇద్దరు కెప్టెన్లు, కోచ్ రాహుల్ ద్రవిడ్, ఆటగాళ్లపై దాని ప్రభావం అస్సలే లేనట్టు కనిపిస్తోంది. జోహానెస్ బర్గ్‌లో టీమ్‌ఇండియా జోరు చూస్తుంటే అలాగే అనిపిస్తోంది మరి!
How did #TeamIndia recharge their batteries ahead of their first training session in Jo'Burg? 🤔
— BCCI (@BCCI) December 18, 2021
On your marks, get set & Footvolley! ☺️😎👏👌#SAvIND pic.twitter.com/dIyn8y1wtz
దక్షిణాఫ్రికాతో మూడు టెస్టులు, మూడు వన్డేల సిరీసు కోసం టీమ్‌ఇండియా రెండురోజుల క్రితం జోహానెస్ బర్గ్‌కు చేరుకుంది. స్వల్ప కఠిన క్వారంటైన్ తర్వాత ఆటగాళ్లు బయటకు వచ్చారు. అంతా కలిసి సాధన చేశారు. కెప్టెన్ విరాట్ కోహ్లీ, కోచ్ రాహుల్ ద్రవిడ్ సహా క్రికెటర్లంతా కలిసి కిక్ వాలీబాల్ ఆడారు. ముఖ్యంగా విరాట్, ద్రవిడ్ జోష్ చూస్తుంటే ఆశ్చర్యం వేస్తోంది. వారి ఉత్సాహం చూస్తుంటే కెప్టెన్సీ వివాదం జట్టు సభ్యులపై ఏ మాత్రం లేదనే అనిపిస్తోంది. ఇందుకు సంబంధించిన వీడియోను బీసీసీఐ ట్వీట్ చేసింది.
కొన్ని రోజుల కఠిన క్వారంటైన్ తర్వాత టీమ్‌ఇండియా ఆటగాళ్లు మైదానంలోకి వచ్చి సాధన చేశారని జట్టు స్ట్రెంత్ అండ్ కండీషనింగ్ కోచ్ సోహమ్ దేశాయ్ అన్నాడు. ఆటగాళ్లంతా సౌకర్యంగా ఉండేందుకు తక్కువ రిస్క్‌గల ట్రైనింగ్ సెషన్ నిర్వహించామన్నాడు. స్ట్రెచింగ్, రన్నింగ్ వంటివి చేయించానని వెల్లడించాడు. ఆటగాళ్లంతా కిక్ వాలీబాల్‌ను ఆస్వాదించారని తెలిపాడు.
From Mumbai to Jo'Burg! 👍 👍
— BCCI (@BCCI) December 17, 2021
Capturing #TeamIndia's journey to South Africa 🇮🇳 ✈️ 🇿🇦 - By @28anand
Watch the full video 🎥 🔽 #SAvINDhttps://t.co/dJ4eTuyCz5 pic.twitter.com/F0qCR0DvoF
మూడు మ్యాచుల టెస్టు సిరీసు మరికొన్ని రోజుల్లో మొదలవుతోంది. సెంచూరియన్ వేదికగా డిసెంబర్ 26న తొలి టెస్టు, జనవరి 7 నుంచి జోహనెస్ బర్గ్‌లో రెండో టెస్టు, జనవరి 11 నుంచి న్యూలాండ్స్‌లో మూడో టెస్టు జరుగుతాయి. ఆ తర్వాత వన్డే సిరీసు మొదలవుతుంది. ప్రస్తుతం గాయపడ్డ రోహిత్ ఆ సిరీసుకు అందుబాటులో ఉంటాడు.
Also Read: Year Ender 2021: దిగ్గజాల నీడలోంచి వెలుగుతున్న సూరీడులా..! 'కెప్టెన్ రోహిత్' మర్చిపోలేని 2021
Also Read: Year Ender 2021: శాసించే స్థితి నుంచి 'కెప్టెన్సీ' పంచుకొనే స్థాయికి.. కోహ్లీకి అచ్చిరాని 2021
Also Read: Kidambi Srikanth: వరల్డ్ చాంపియన్ షిప్స్‌లో పతకం ఖాయం.. సెమీస్‌కు చేరిన తెలుగు తేజం!
Also Read: Hockey Men's Asian Champions Trophy: శెభాష్ భారత్..! పాక్‌ను ఓడించి సెమీస్ చేరిన హాకీ ఇండియా
Also Read: India U19 team: కుర్రాళ్లకు రోహిత్ పాఠాలు..! జోరు మీదున్న కొత్త కెప్టెన్!
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి