Karim Benzema Retires: ఫిఫా ఫైనల్ లో ఓటమి- అంతర్జాతీయ కెరీర్ కు గుడ్ బై చెప్పిన ఫ్రాన్స్ స్ట్రైకర్
Karim Benzema Retires: ఫిఫా ప్రపంచకప్ ఫైనల్ లో అర్జెంటీనా చేతిలో ఓటమి అనంతరం ఫ్రాన్స్ జట్టు స్ట్రైకర్ కరీం బెంజెమా అంతర్జాతీయ ఫుట్ బాల్ నుంచి రిటైర్ అవుతున్నట్లు ప్రకటించాడు.
Karim Benzema Retires: ఫిఫా ప్రపంచకప్ ఫైనల్ లో అర్జెంటీనా చేతిలో ఓటమి అనంతరం ఫ్రాన్స్ జట్టు స్ట్రైకర్ కరీం బెంజెమా అంతర్జాతీయ ఫుట్ బాల్ నుంచి రిటైర్ అవుతున్నట్లు ప్రకటించాడు. ఫైనల్ మ్యాచ్ లో ఓడిన మరుసటి రోజే తన నిర్ణయాన్ని తెలిపాడు. గాయం కారణంగా ఈసారి బెంజెమా ప్రపంచకప్ లో భాగం కాలేకపోయాడు. నేడు తన 35వ పుట్టినరోజు. ఈ సందర్భంగానే తన రిటైర్ మెంట్ నిర్ణయాన్ని వెలిబుచ్చాడు.
'నేను చాలా పొరపాట్లు చేశాను. వాటినుంచి ఎంతో నేర్చుకున్నాను. అందుకే ఈరోజు ఈ స్థితిలో ఉన్నాను. ఇందుకు గర్వపడుతున్నాను.' అని బెెంజెమా అన్నాను. బెంజెమా ఫ్రాన్స్ తరఫున 97 మ్యాచులు ఆడాడు. 37 గోల్స్ చేశాడు. మరో 20 గోల్స్ కు సహకరించాడు. అర్జెంటీనా- ఫ్రాన్స్ మ్యాచ్ కు ముందు ఆ దేశ అధ్యక్షుడు ఇమ్మాన్యుయల్ మాక్రాన్ ఆహ్వానాన్ని కరీం బెంజెమా తిరస్కరించినట్లు సమాచారం. ఆ ఆహ్వానం అనంతరం బెంజెమా తన ఇన్ స్టాగ్రామ్ పోస్టులో ఒక ఫొటోను పెట్టి నాకు ఆసక్తి లేదు అనే క్యాప్షన్ రాశాడు.
Official. Karim Benzema announces his retirement from international football 🚨🇫🇷 #Benzema
— Fabrizio Romano (@FabrizioRomano) December 19, 2022
He leaves the French national team. pic.twitter.com/FQMNi0TFu1
కప్పు వేటలో ఓడినా ఫ్రాన్స్ పోరాట పటిమ అందరినీ ఆకట్టుకుంది. ముఖ్యంగా ఆ జట్టు యువ సంచలనం ఎంబాపే అద్భుతమైన ఆటతీరును కనబరిచాడు. మ్యాచులో మొత్తం 4 గోల్స్ చేశాడు. తద్వారా గోల్డెన్ బూట్ అవార్డును అందుకున్నాడు.
అర్జెంటీనా విజయం
అసలైన పోరుకు సిసలైన నిర్వచనంలా సాగింది ఫిఫా ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్. ప్రేక్షకులను సీట్ల అంచున కూర్చోబెట్టిన అర్జెంటీనా- ఫ్రాన్స్ జట్లు నువ్వా నేనా అన్నట్లు తలపడ్డాయి. గోల్ గోల్ కు ఉత్కంఠ ఊపేస్తున్న వేళ... ఆధిపత్యం చేతులు మారినప్పుడల్లా గుండె వేగం పెరిగిపోతున్న వేళ.. సమయం తరిగిపోతున్నప్పుడల్లా ఊపరి ఆగిపోతున్నట్లపిస్తున్న వేళ... మెస్సీ జట్టు అర్జెంటీనా, ఫ్రాన్స్ పై విజయం సాధించింది. పెనాల్టీ షూటౌట్ లో ఫలితం తేలిన ఈ మ్యాచులో అర్జెంటీనా 4-2 తేడాతో గెలుపొందింది.
36 ఏళ్ల తర్వాత అర్జెంటీనా ఫిఫా ప్రపంచకప్ గెలుచుకుంది. ఆ జట్టు స్టార్ ఆటగాడు లియోనెల్ మెస్సీ 3 గోల్స్ తో జట్టుకు విజయాన్ని అందించాడు. తన కెరీర్ లో కలగా మిగిలిన ప్రపంచకప్ ను మెస్సీ అందుకున్నాడు. అలాగే పలు రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు.
J’ai fait les efforts et les erreurs qu’il fallait pour être là où je suis aujourd’hui et j’en suis fier !
— Karim Benzema (@Benzema) December 19, 2022
J’ai écrit mon histoire et la nôtre prend fin. #Nueve pic.twitter.com/7LYEzbpHEs