అన్వేషించండి

FIFA World Cup 2026 Schedule: ఫీఫా ప్రపంచకప్‌లో 48 జట్లు, 104 మ్యాచ్‌లు! ముందెన్నడూ చూడని మెగా ఈవెంట్‌ రెడీ!

FIFA World Cup 2026 Schedule: 48 జట్లు, 104 మ్యాచ్‌లతో 2026 ఫిఫా వరల్డ్ కప్ అలరించనుంది. అమెరికా, మెక్సికో, కెనడా దేశాల్లో జరగనున్న ఈ సంగ్రామం పూర్తి షెడ్యూల్ ఇదే. 

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • 2026 ప్రపంచకప్ 48 జట్లతో కెనడా, మెక్సికో, యూఎస్ ఆతిథ్యం.
  • మెక్సికో జూన్ 11న ప్రారంభమై, న్యూయార్క్ జులై 19న ఫైనల్.
  • 12 గ్రూపులు, రౌండ్ ఆఫ్ 32 దశతో కొత్త ఫార్మాట్ అమలు.
  • ఫుట్‌బాల్‌ను విస్తరిస్తూ కొత్త దేశాలకు అవకాశం కల్పిస్తుంది.

FIFA World Cup 2026 Schedule: ఫుట్‌బాల్ ప్రేమికుల కలల వేదిక, ప్రపంచంలోనే అత్యంత ఆదరణ కలిగిన క్రీడా సంబరం ఫీఫా ప్రపంచకప్‌ మరోసారి సరికొత్త రికార్డులతో మన ముందుకురాబోతోంది. 2026లో జరగబోయే ఈ టోర్నమెంట్‌ కేవలం ఒక ఆట మాత్రమే కాదు, ఫుట్‌బాల్‌ చరిత్రలోనే సరికొత్త అధ్యాయం. ఇప్పటి వరకు మనం చూసిన ప్రపంచ కప్‌ల కంటే ఇది భిన్నంగా, భారీగా ఉండబోతోంది. 

39 రోజులు ప్రపంచవ్యాప్తంగా సందడే సందడి

ప్రపంచకప్‌  ఎందుకు ప్రత్యకమైందో తెలుసుకోవాలంటే ముందుగా దాని పరిమాణాన్ని చూడాలి. గతంలో 32 జట్లు మాత్రమే టోర్నీలో పాల్గొనేవి. కానీ ఈసారి ఏకంగా 48 జట్లు ట్రోఫీ కోసం పోటీ పడబోతున్నాయి. జట్ల సంఖ్య పెరగడంతో మ్యాచ్‌ల సంఖ్య కూడా 104కు చేరుకుంది. ఇది ఫుట్‌బాల్‌ ప్రపంచంలో అతి పెద్ద, సుదీర్ఘమైన టోర్నమెంట్‌గా నిలవనుంది. సుమారు 39 రోజుల పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రీడాభిమానులను ఈ టోర్నీ ఉర్రూతలూగించనుంది. 

జూన్ 11 నుంచి జులై 19 వరకు టోర్నీ 

ఈ మెగా టోర్నీకి ఉత్తర అమెరికా ఖండంలోని మూడు దేశాలు కెనడా, మెక్సికో, యునైటెడ్‌ స్టేట్స్‌ సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్నాయి. జూన్ 11న మెక్సికో సిటీలోని ప్రతిష్టాత్మకమైన మెక్సికో సిటీ స్టేడియంలో ఘనంగా ప్రారంభంకానుంది. ఆతిథ్య దేశం మెక్సికో తన సొంత గడ్డపై స్థానిక అభిమానుల కేరింత మధ్య తొలి మ్యాచ్ ఆడనుంది. జులై 19న న్యూయార్క్-న్యూజెర్సీ స్టేడియంలో ప్రపంచ విజేత ఎవరో తేలిపోనుంది. 

కొత్తగా మరికొన్ని దేశాలు

ఫుట్‌బాల్‌ను ప్రపంచవ్యాప్తంగా మరింత విస్తరించాలనే లక్ష్యంతో ఫిఫా జట్ల సంఖ్యను పెంచింది. దీని వల్ల మరిన్ని దేశాలకు ప్రపంచ క్ వేదికపై తమ ప్రతిభను చాటుకునే అవకాశం లభిస్తుంది. ఈ క్రమంలోనే కేప్‌ వెర్దే, కురాకో, జోర్డాన్, ఉజ్బెకిస్తాన్ వంటి దేశాలు తొలిసారిగా ప్రపంచకప్‌ బరిలోకి దిగుతున్నాయి. ఇది ఆయా దేశాల్లో ఫుట్‌బాల్‌ క్రీడాభివృద్ధికి గొప్ప ఊతాన్ని ఇస్తుంది. 

మొత్తం 48 జట్లను 12 గ్రూపులుగా విభజించారు. ఇవి ఏ నుంచి ఎల్ వరకు ఉన్నాయి. ప్రతి గ్రూపులో నాలుగు జట్లు ఉంటాయి. ప్రతి జట్టు తన గ్రూపులోని మిగిలిన మూడు జట్లతో తలపడుతుంది. 

సరికొత్త ఫార్మాట్‌ - గెలుపు గుర్రాలు ఎలా తేలుతుంటాయి?

గతంలో ఉన్న 8 గ్రూపుల స్థానంలో ఇప్పుడు 12 గ్రూపులను ఏర్పాటు చేశారు. ప్రతి గ్రూపులో నాలుగు జట్లు ఉంటాయి. ప్రతి గ్రూప్ నుంచి మొదటి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు నేరుగా నాకౌట్‌ దశకు చేరుకుంటాయి. వీరితోపాటు, 12 గ్రూపుల్లో ఉత్తమ ప్రతిభ కనబరచిన 8 మూడవ స్థాన జట్లు కూడా నాకౌట్ దశకు అర్హత సాధిస్తాయి.  దీని వల్ల మొదటిసారిగా ప్రపంచకప్‌లో రౌండ్ ఆఫ్ 32 అనే కొత్త దశను ప్రవేశ పెట్టారు. అంటే టైటిల్ గెలవాలంటే ఒక జట్టు గతంలో లాగా 7 మ్యాచ్‌లు కాకుండా, ఈసారి 8 మ్యాచ్‌లు ఆడాల్సి ఉంటుంది. 

డ్రా ఫలితాల ప్రకారం గ్రూపుల వివరాలు ఇలా ఉన్నాయి

  • గ్రూప్‌ Aలో మెక్సికో, దక్షిణ కొరియా, దక్షిణాఫ్రికా, ప్లే ఆఫ్ విజేత
  • గ్రూప్‌ B:- కెనడా, స్విట్జర్లాండ్, ఖతార్, ప్లే ఆఫ్ విజేత 
  • గ్రూప్‌ C:- బ్రెజిల్‌, మొరాకో, స్కాట్‌లాండ్‌, హైతీ
  • గ్రూప్‌ D: యూఎస్‌ఏ, ఆస్ట్రేలియా, పరాగ్వే, ప్లే ఆఫ్‌ విజేత 
  • గ్రూప్‌I (గ్రూప్ ఆఫ్‌ డెత్): ఫ్రాన్స్, సెనెగల్, నార్వే, ప్లే ఆఫ్‌ విజేత, ఇక్కడ ఎర్లింగ్‌ హాలాండ్‌(నార్వే), ఎంబాపే(ఫ్రాన్స్‌) మధ్య పోరు ఆసక్తికరంగా ఉంటుంది. 
  • గ్రూప్‌ J: డిఫెండింగ్‌ ఛాంపియన్ అర్జెంటినా, ఆస్ట్రియా, అల్జీరియా, జోర్డాన్
  • గ్రూప్‌ K: పోర్చుగల్‌, కొలంబియా, ఉజ్బెకిస్తాన్, ప్లే ఆఫ్‌ విజేత. క్రిస్టియానో రొనాల్డో తన 6వ ప్రపంచ కప్‌లో ఇక్కడే బరిలోకి దిగనున్నాడు. 

టోర్నమెంట్‌ షెడ్యూల్ ఇదే!

  • గ్రూప్‌ దశ- జూన్ 11 నుంచి జూన్ 27 వరకు 
  • రౌండ్‌ ఆఫ్‌ 32:- జూన్ 28 నుంచి జులై 3వ వరకు
  • రౌండ్‌ ఆఫ్‌ 16:- జులై 4 నుంచి జులై7 వరకు 
  • క్వార్టర్ ఫైనల్స్‌:- జులై 9 నుంచి జులై 11 వరకు 
  • సెమీఫైనల్స్ జులై 14, 15 తేదీల్లో 
  •  ఫైనల్‌: జులై 19

స్టేడియంల పేర్లలో మార్పు 

ఫిపా నిబంధనల ప్రకారం టోర్నమెంట్‌ జరిగే సమయంలో స్టేడియంల పేర్లలో స్పాన్సర్ల పేర్లు ఉండకూడదు. అందుకే వాణిజ్యపరమైన బ్రాండ్‌ పేర్లు కాకుండా, కేవలం భౌగోళిక ప్రాంతం, లేదా నగరాల పేర్లతోనే స్టేడియంను పిలవనున్నారు. 

1930లో ఉరుగ్వేలో కేవలం 13 జట్లతో ప్రారంభమైన ప్రపంచకప్‌ ప్రస్థానం, నేడు 48 జట్ల వరకు చేరింది. ఇది కేవలం క్రీడా మాత్రమే కాదు, వేల కోట్ల డాలర్ల వ్యాపారం, అంతులేని భావోద్వేగం. అమెరికా, మెక్సికో, కెనడాలు సంయుక్తంగా నిర్వహించే ఈ టోర్నీ ఫుట్‌బాల్ చరిత్రలో ఒక న భూతో న భవిష్యతి అన్నట్టు నిలిచిపోనుంది.    

Frequently Asked Questions

2026 ఫిఫా ప్రపంచకప్‌ ఎప్పుడు, ఎక్కడ జరగనుంది?

ఈ మెగా టోర్నీ జూన్ 11 నుండి జులై 19 వరకు కెనడా, మెక్సికో, యునైటెడ్‌ స్టేట్స్‌లో జరుగుతుంది. జూన్ 11న మెక్సికో సిటీలో ప్రారంభమై, జులై 19న న్యూయార్క్-న్యూజెర్సీలో ఫైనల్ జరగనుంది.

2026 ప్రపంచకప్‌లో ఎన్ని జట్లు పాల్గొంటాయి? ఎన్ని మ్యాచ్‌లు జరుగుతాయి?

2026 ప్రపంచకప్‌లో 48 జట్లు పాల్గొంటాయి, ఇది గతంలో కంటే ఎక్కువ. ఈసారి మొత్తం 104 మ్యాచ్‌లు జరుగుతాయి, ఇది ఫుట్‌బాల్‌ చరిత్రలోనే సుదీర్ఘమైన టోర్నమెంట్‌గా నిలుస్తుంది.

2026 ప్రపంచకప్‌లో కొత్త ఫార్మాట్ ఎలా ఉంటుంది?

48 జట్లను 12 గ్రూపులుగా విభజిస్తారు. ప్రతి గ్రూప్ నుండి మొదటి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు, అలాగే ఉత్తమ 8 మూడవ స్థాన జట్లు నాకౌట్‌కు అర్హత సాధిస్తాయి. దీనివల్ల తొలిసారి రౌండ్ ఆఫ్ 32 దశను ప్రవేశపెట్టారు.

ప్రపంచకప్‌ సమయంలో స్టేడియంల పేర్లలో మార్పు ఉంటుందా?

అవును, ఫిఫా నిబంధనల ప్రకారం టోర్నమెంట్‌ సమయంలో స్టేడియంల పేర్లలో స్పాన్సర్ల పేర్లు ఉండవు. బదులుగా, వాటిని భౌగోళిక ప్రాంతం లేదా నగరాల పేర్లతో పిలుస్తారు.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

AB Venkateswara Rao: టీడీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షం కన్నా ఎక్కువగా దాడి చేస్తున్న మాజీ ఐపీఎస్ ఏబీవీ - టీడీపీలో చేర్చుకోలేదనే ఇలా చేస్తున్నారా?
టీడీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షం కన్నా ఎక్కువగా దాడి చేస్తున్న మాజీ ఐపీఎస్ ఏబీవీ - టీడీపీలో చేర్చుకోలేదనే ఇలా చేస్తున్నారా?
Siddipet Road Accident: సిద్ధిపేట జిల్లాలో ఘోర విషాదం! అదుపుతప్పి బావిలో పడ్డ కారు! ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!
సిద్ధిపేట జిల్లాలో ఘోర విషాదం! అదుపుతప్పి బావిలో పడ్డ కారు! ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!
Mister Middle Class OTT : రెండు ఓటీటీల్లో మిస్టర్ మిడిల్ క్లాస్ - శ్రీకాంత్, లయ కొత్త మూవీ సడన్ స్ట్రీమింగ్
రెండు ఓటీటీల్లో మిస్టర్ మిడిల్ క్లాస్ - శ్రీకాంత్, లయ కొత్త మూవీ సడన్ స్ట్రీమింగ్
Congress Politics: మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
మంత్రి కొండా సురేఖకు షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
Advertisement

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AB Venkateswara Rao: టీడీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షం కన్నా ఎక్కువగా దాడి చేస్తున్న మాజీ ఐపీఎస్ ఏబీవీ - టీడీపీలో చేర్చుకోలేదనే ఇలా చేస్తున్నారా?
టీడీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షం కన్నా ఎక్కువగా దాడి చేస్తున్న మాజీ ఐపీఎస్ ఏబీవీ - టీడీపీలో చేర్చుకోలేదనే ఇలా చేస్తున్నారా?
Siddipet Road Accident: సిద్ధిపేట జిల్లాలో ఘోర విషాదం! అదుపుతప్పి బావిలో పడ్డ కారు! ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!
సిద్ధిపేట జిల్లాలో ఘోర విషాదం! అదుపుతప్పి బావిలో పడ్డ కారు! ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!
Mister Middle Class OTT : రెండు ఓటీటీల్లో మిస్టర్ మిడిల్ క్లాస్ - శ్రీకాంత్, లయ కొత్త మూవీ సడన్ స్ట్రీమింగ్
రెండు ఓటీటీల్లో మిస్టర్ మిడిల్ క్లాస్ - శ్రీకాంత్, లయ కొత్త మూవీ సడన్ స్ట్రీమింగ్
Congress Politics: మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
మంత్రి కొండా సురేఖకు షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
Ram Pothineni : 'ఫుడ్, మందులు నేనే పంపిస్తా... ఆరోగ్యంతో రావాలి' - అభిమానికి హీరో రామ్ వీడియో కాల్
'ఫుడ్, మందులు నేనే పంపిస్తా... ఆరోగ్యంతో రావాలి' - అభిమానికి హీరో రామ్ వీడియో కాల్
2026లో AI, గూగుల్, మెటాలో ప్రపంచ మార్పులకు జ్యోతిష్య సంబంధం?
2026లో AI, గూగుల్, మెటాలో ప్రపంచ మార్పులకు జ్యోతిష్య సంబంధం?
FIA Guinness World Record: అమెరికాలో 1383 జెండాల ప్రదర్శనతో గిన్నిస్‌ రికార్డ్ సృష్టించిన భారతీయ డయాస్పోరా!
అమెరికాలో 1383 జెండాల ప్రదర్శనతో గిన్నిస్‌ రికార్డ్ సృష్టించిన భారతీయ డయాస్పోరా!
Principal Roopa Reddy Murder Case: ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
Embed widget