FIFA World Cup 2022: ఫిఫా ప్రపంచకప్- 2022... పూర్తి వివరాలివిగో
FIFA World Cup 2022: ఫుట్ బాల్ ప్రియులను అలరించేందుకు ఫిఫా ప్రపంచకప్ 22 వ ఎడిషన్ వచ్చేసింది. ఖతార్ వేదికగా నవంబర్ 20 నుంచి డిసెంబర్ 18 వరకు ఈ మెగా ఈవెంట్ జరగనుంది.
FIFA World Cup 2022: ఫుట్ బాల్ ప్రియులను అలరించేందుకు ఫిఫా ప్రపంచకప్ 22 వ ఎడిషన్ వచ్చేసింది. ఖతార్ వేదికగా నవంబర్ 20 నుంచి డిసెంబర్ 18 వరకు ఈ మెగా ఈవెంట్ జరగనుంది.
ప్రపంచ కప్ - 2022 మ్యాచ్ షెడ్యూల్
గ్రూప్ దశ నవంబర్ 20 నుంచి డిసెంబర్ 2 వరకు జరుగుతుంది. నాకౌట్ మ్యాచులు డిసెంబర్ 3-6 వరకు రౌండ్ ఆఫ్ 16తో ప్రారంభమవుతాయి. డిసెంబర్ 9, 10 తేదీల్లో క్వార్టర్ ఫైనల్స్, డిసెంబర్ 13, 14 తేదీల్లో సెమీ ఫైనల్స్ జరుగుతాయి. మూడో స్థానం కోసం పోటీ ఫైనల్‌కు ఒక రోజు ముందు డిసెంబర్ 17న జరుగుతుంది.
ప్రపంచ కప్- 2022 జరిగే మైదానాలు
టోర్నమెంట్‌లోని 64 మ్యాచ్‌లు 8 వేదికల్లో జరుగుతాయి. అల్ బైట్ స్టేడియం, ఖలీఫా ఇంటర్నేషనల్ స్టేడియం, అల్ తుమామా మైదానం, అహ్మద్ బిన్ అలీ స్టేడియం, లుసైల్ స్టేడియం, స్టేడియం 974, ఎడ్యుకేషన్ సిటీ మైదానం, అల్ జనోబ్ స్టేడియం లలో ఫిఫా ప్రపంచకప్ జరగనుంది.
ఫిఫా ప్రపంచకప్ కు అర్హత సాధించిన జట్లు
గ్రూప్ ఏ
ఖతార్, ఈక్వెడార్, సెనెగల్, నెదర్లాండ్స్
గ్రూప్ బి
ఇంగ్లాండ్, IR ఇరాన్, యూఎస్ ఏ, వేల్స్
గ్రూప్ సి
అర్జెంటీనా, సౌదీ అరేబియా, మెక్సికో, పోలాండ్
గ్రూప్ డి
ఫ్రాన్స్, ఆస్ట్రేలియా, డెన్మార్క్, ట్యునీషియా
గ్రూప్ ఈ
స్పెయిన్, కోస్టారికా, జర్మనీ, జపాన్
గ్రూప్ ఎఫ్
బెల్జియం, కెనడా, మొరాకో, క్రొయేషియా
గ్రూప్ జి
బ్రెజిల్, సెర్బియా, స్విట్జర్లాండ్, కామెరూన్
గ్రూప్ హెచ్
పోర్చుగల్, ఘనా, ఉరుగ్వే, కొరియా రిపబ్లిక్
We've got some exciting clashes ahead in Group H 💥
— FIFA World Cup (@FIFAWorldCup) November 2, 2022
Who'll progress into the knockouts? pic.twitter.com/drFqPaMNbP