FIFA World Cup 2022 Closing Ceremony: కళ్లు చెదిరేలా ఫిఫా ప్రపంచకప్ ముగింపు వేడుక- ఎవరెవరు రానున్నారో తెలుసా!
ఫిఫా ప్రపంచకప్ ప్రారంభ వేడుకను ఘనంగా నిర్వహించారు. అలాగే ముగింపు వేడుకలను అంతకుమించేలా ఖతార్ నిర్వహించనున్నట్లు సమాచారం. ఇందుకోసం ప్రముఖ కళాకారుల ప్రదర్శనలు ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది.
FIFA World Cup 2022 Closing Ceremony: ఫిఫా ప్రపంచకప్ 2022 ముగింపు దశకు వచ్చేసింది. రేపు (ఆదివారం) అర్జెంటీనా- ఫ్రాన్స్ మధ్య ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఖతార్ లోనే అతిపెద్ద స్టేడియమైన దోహాలోని లుసైల్ మైదానం ఈ మ్యాచుకు ఆతిథ్యమివ్వనుంది. దీని సామర్ధ్యం 80 వేలు. డిఫెండింగ్ ఛాంపియన్ ఫ్రాన్స్, మాజీ ఛాంపియన్ అర్జెంటీనా మధ్య రసవత్తర పోరు ఖాయం. అర్జెంటీనా స్టార్ లియోనల్ మెస్సీ, ఫ్రాన్స్ కీలక ఆటగాడు ఎంబాపే ఆటను చూసేందుకు అభిమానులు ఎదురుచూస్తున్నారు.
ఘనంగా ఫిఫా ముగింపు వేడుక
ఫిఫా ప్రపంచకప్ ప్రారంభ వేడుకను ఘనంగా నిర్వహించారు. అలాగే ముగింపు వేడుకలను అంతకుమించేలా ఖతార్ నిర్వహించనున్నట్లు సమాచారం. ఇందుకోసం ప్రముఖ కళాకారుల ప్రదర్శనలు ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. ప్రపంచం మొత్తం గుర్తుపెట్టుకునేలా ఈ వేడుకను ఖతార్ నిర్వహించనుంది. మరి ముగింపు వేడుకల కోసం ఎవరు వస్తున్నారు? ఏయే ప్రదర్శనలు ఏర్పాటు చేశారు? ముగింపు వేడుక ఏ సమయంలో జరుగుతుంది? అనే వివరాలను తెలుసుకుందామా...
ఫిఫా ప్రపంచకప్ ముగింపు వేడుకల వివరాలు
తేదీ... డిసెంబర్ 18 ఆదివారం.
సమయం... భారత కాలమానం ప్రకారం రాత్రి 7 గంటలకు.
వేదిక... లుసైల్ స్టేడియం, దోహా.
డిసెంబర్ 18 ఖతార్ జాతీయ దినోత్సవం. కాబట్టి మైదానంలో బాణసంచా ప్రదర్శనలు, కవాతులు ఉండవచ్చు.
Dec 18 22, Davido will become the first African artist to perform on the biggest stage of the world’s sports in the ongoing World Cup being held in Doha, Qatar
— 30BG Updates (@30BG_Updates) December 11, 2022
The Lusail Iconic Stadium capacity is 88,966 and Davido will perform live for the Closing Ceremony #QatarWorldCup2022 pic.twitter.com/BhKJs5Z0t4
ఫిఫా ముగింపు వేడుకకు రానున్న ప్రముఖులు
ఫిఫా ముగింపు వేడుకలకు వచ్చే ప్రముఖుల వివరాలను చివరి వరకు రహస్యంగా ఉంచేందుకు ఖతార్ ప్రయత్నించింది. అయితే కొన్ని అధికారిక నివేదకల ప్రకారం... భారత ప్రముఖ గాయని, నృత్యకారిణి అయిన నోరా ఫతేహి ఫిఫా ముగింపు వేడుకలకు హాజరు కానున్నారు. అలాగే పాప్ స్టార్లు షకీరా, జెన్నిఫర్ లోపెజ్ మ్యూజిక్ వీడియో చేయనున్నారు. నైజీరియన్ గాయకుడు డేవిడో, ట్రినిడాడా కార్టోనా, ఐషా వంటి మ్యుజిషియన్స్ పాల్గొననున్నారు. ప్రముఖ ప్యూర్టో రికన్ ప్రదర్శనకారుడు, కాంగో- ఫ్రెంచ్ రాపర్ ఓజునా కూడా రానున్నాడు.
ప్రత్యక్షప్రసారం
ఫిఫా ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్, ముగింపు వేడుక భారత్ లో స్పోర్ట్స్ 18 నెట్ వర్క్ లో ప్రత్యక్ష ప్రసారం కానుంది. అలాగే జియో సినిమాస్, వూట్ యాప్ లలో లైవ్ స్ట్రీమింగ్ అందుబాటులో ఉంటుంది.
#FIFAWorldCup Final Qatar 2022
— Khairiyat Pucho (@SSRMU1986TOF) December 15, 2022
Argentina 🇦🇷Vs France 🇨🇵
🌟 🌟 ... 🌟 🌟
In #LusailStadium Doha,Qatar
Sun December 18, 2022
Vamos Argentina 💓🇦🇷💙🔥💯🐐
We want #PeterDrury for commentary in a Final #WorldCup !!!#Messi💯 Faith 💯
Vamos Argentina 💓🇦🇷💙🔥💯🐐 pic.twitter.com/fd4DYUp5fV