By: ABP Desam | Updated at : 14 Dec 2022 07:40 AM (IST)
Edited By: nagavarapu
లియోనల్ మెస్సీ (source: twitter)
FIFA WC 2022: ఫిఫా ప్రపంచకప్ లో అర్జెంటీనా అద్భుతం సృష్టించింది. కెరీర్ లో ఒక్క ప్రపంచకప్ అయినా గెలవాలనే కలకు మరింత దగ్గరయ్యాడు ఆ జట్టు స్టార్ ప్లేయర్ లియోనల్ మెస్సీ. జట్టును ముందుండి నడిపించి ఫైనల్ చేర్చాడు. మంగళవారం అర్ధరాత్రి జరిగిన సెమీఫైనల్ మ్యాచులో క్రొయేషియాపై అర్జెంటీనా 3-0 తేడాతో ఘనవిజయం సాధించింది. దీంతో సగర్వంగా ఫైనల్ కు చేరుకుంది.
క్రొయేషియా- అర్జెంటీనా జట్ల మధ్య సెమీఫైనల్ మ్యాచులో తొలి అర్ధగంట ఎలాంటి గోల్ నమోదు కాలేదు. అయితే 34వ నిమిషంలో స్టార్ ఆటగాడు మెస్సీ గోల్ కొట్టి తన జట్టును 1-0 ఆధిక్యంలో నిలిపాడు. పెనాల్టీ కార్నర్ ద్వారా మెస్సీ ఈ గోల్ సాధించాడు. ఈ ప్రపంచకప్ లో మెస్సీకి ఇది ఐదో గోల్. ఫిపా ప్రపంచకప్ చరిత్రలో 11వ గోల్. ఆ తర్వాత వెంటనే అర్జెంటీనాకు మరో గోల్ అవకాశం వచ్చింది. 39వ నిమిషంలో అర్జెంటీనా ఆటగాడు జూలియన్ అల్వారెజ్ గోల్ కొట్టాడు. దీంతో ఆట తొలి అర్ధభాగం ముగిసే సమయానికి ఆ జట్టు 2-0తో తిరుగులోని ఆధిక్యంలో నిలిచింది.
We get going in the second half! ⏱#FIFAWorldCup | #ARG #HRV
— FIFA World Cup (@FIFAWorldCup) December 13, 2022
జూలియన్ అల్వారెజ్ రెండో గోల్
ఇక రెండో అర్ధభాగంలో గోల్ కోసం ఇరు జట్లు పోటాపోటీగా తలపడ్డాయి. కొన్ని గోల్ అవకాశాలు వచ్చినా ఇరు జట్లు సద్వినియోగం చేసుకోలేకపోయాయి. 58వ నిమిషంలో మెస్సీకి గోల్ చేసే అవకాశం వచ్చింది. అయితే అతను గోల్ కొట్టలేకపోయాడు. అయితే 69వ నిమిషంలో మెస్సీ అందించిన బంతిని అందుకున్న జూలియన్ ఎలాంటి పొరపాటు చేయకుండా గోల్ పోస్టులోకి పంపించాడు. దీంతో అర్జెంటీనాకు 3-0 ఆధిక్యం లభించింది. ఇక ఆట ఆఖరివరకు ఇరు జట్లు ఎలాంటి గోల్ చేయలేకపోయాయి. దీంతో మెస్సీ జట్టు విజయం సాధించింది.
Argentina are in the #FIFAWorldCup Final! 🔥@adidasfootball | #Qatar2022
— FIFA World Cup (@FIFAWorldCup) December 13, 2022
ఫ్రాన్స్- మొరాకో మధ్య నేడు రెండో సెమీస్
అనామక జట్టుగా టోర్నీలో అడుగుపెట్టిన ఆఫ్రికా దేశం మొరాకో సంచలన ప్రదర్శన చేస్తోంది. ఇప్పటి వరకు ఫేవరెట్లు అనుకున్న జట్లను ఓడిస్తూ సెమీస్ వరకు చేరుకుంది. ఫిఫా ప్రపంచకప్ లో సెమీస్ చేరిన తొలి ఆఫ్రికా దేశంగా మొరాకో కొత్త చరిత్రను లిఖించింది. ఇదే దూకుడుతో డిఫెండింగ్ చాంపియన్ ఫ్రాన్స్ ను కూడా ఓడించి ఫైనల్ చేరాలని పట్టుదలగా ఉంది. మరో వైపు డిఫెండింగ్ చాంపియన్ హోదాతో టోర్నీలో అడుగుపెట్టిన ఫ్రాన్స్ అంచనాలకు తగ్గట్లు ఆడుతుంది. క్వార్టర్ ఫైనల్లో ఇంగ్లండ్ ను ఓడించి సెమీస్ చేరింది. ఈ రెండు జట్ల మధ్య రెండో సెమీఫైనల్ బుధవారం అర్ధ రాత్రి 12.30 గంటలకు జరగనుంది. ఈ మ్యాచ్ ను స్పోర్ట్స్ 18, జియో సినిమాలు ప్రత్యక్ష ప్రసారం చేయనున్నాయి.
🥁 The atmosphere is building...#FIFAWorldCup | #Qatar2022 pic.twitter.com/HGeewEaO9g
— FIFA World Cup (@FIFAWorldCup) December 13, 2022
Number 10 Jersey: జెర్సీ నెంబర్ 10తో పీలె, సచిన్, డిగో, మెస్సీ, రొనాల్డినో లవ్‌స్టోరీ!
Pele Demise: దివికేగిన దిగ్గజం - ఫుట్‌బాల్ గ్రేటెస్ట్ పీలే కన్నుమూత!
Lionel Messi - Ziva: ధోనీ కుమార్తె జివా కోసం జెర్సీ పంపిన మెస్సీ- ఫొటోలు వైరల్
Personal Finance tips: మార్కెట్లో మెస్సీని గుర్తించి పెట్టుబడి పెట్టండి - 2023 కోసం ఫిఫా చెప్పిన డబ్బు పాఠాలు!
FIFA WC 2022: అర్జెంటీనా ప్రపంచకప్ సంబరం- రోడ్లన్నీ 'జన'మయం
IND vs NZ, 3rd T20: మ్యాచ్ మనదే, సిరీసూ మనదే- ఆఖరి టీ20లో న్యూజిలాండ్ పై భారత్ ఘనవిజయం
BRS Politics: బీఆర్‌ఎస్‌కు పెరుగుతున్న మద్దతు, సీఎం కేసీఆర్ తో ఛత్తీస్ గఢ్ మాజీ సీఎం తనయుడు భేటీ
UPSC 2023: యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్-2023 నోటిఫికేషన్ విడుదల, 1105 ఉద్యోగాల భర్తీ! ప్రిలిమ్స్ పరీక్ష ఎప్పుడంటే?
Telangana Budget : ఎన్నికలున్న కర్ణాటకకు ప్రత్యేక నిధులు - తెలంగాణకు మాత్రం నిల్ ! బీఆర్‌ఎస్‌కు మరో అస్త్రం