అన్వేషించండి

FIFA WC 2022 Qatar: మాజీ ఛాంపియన్ కు షాక్- స్పెయిన్ ను ఓడించి క్వార్టర్స్ కు చేరుకున్న మొరాకో

FIFA WC 2022 Qatar: ఫిఫా ప్రపంచకప్ లో మరో సంచలనం. మాజీ ఛాంపియన్ స్పెయిన్ ను ఓడించిన పసికూన మొరాకో జట్టు క్వార్టర్స్ లో అడుగుపెట్టింది.

FIFA WC 2022 Qatar:  ఫిఫా ప్రపంచకప్ లో సంచలనాలు ఆగడం లేదు. గ్రూప్ దశలో ఆశ్చర్యకర ఫలితాలతో విస్మయపరిచిన చిన్నజట్లు... నాకౌట్ లోనూ చెలరేగుతున్నాయి. గ్రూప్ దశలో తమది గాలివాటం గెలుపు కాదని రుజువు చేస్తూ పసికూన మొరాకో జట్టు.. మాజీ ఛాంపియన్ స్పెయిన్ ను మట్టికరిపించింది. పెనాల్టీ షూటౌట్ లో 3-0 తేడాతో స్పెయిన్ ను ఓడించిన మొరాకో సగర్వంగా క్వార్టర్స్ లో అడుగుపెట్టింది. 

ఫుట్ బాల్ ప్రపంచకప్ లో నాకౌట్ దశలోనూ సంచలనాలు నమోదవుతున్నాయి. స్పెయిన్‌ ముందు పసికూన లాంటి మొరాకో.. మాజీ ఛాంపియన్‌ను మట్టికరిపించి తొలిసారి క్వార్టర్స్‌కు దూసుకెళ్లింది. కేవలం ఆరోసారి మాత్రమే ప్రపంచకప్‌ ఆడుతూ, ఎప్పుడో 36 ఏళ్ల కిందట ఒకసారి నాకౌట్‌ ఆడిన చరిత్ర ఉన్న మొరాకో.. మంగళవారం అంచనాలకు అందని ఆటతో స్పెయిన్‌కు కళ్లెం వేసింది. 

స్పెయిన్ కొంపముంచిన రక్షణాత్మక ఆట

మ్యాచులో ఎక్కువ భాగం బంతి స్పెయిన్ నియంత్రణలోనే ఉంది. మొరాకోతో పోలిస్తే మూడు రెట్లకు పైగా పాసులు అందించుకున్నారు. అయితే రక్షణాత్మకంగా ఆడడం ఆ జట్టు కొంప ముంచింది. పోరాడితో పోయేదేముందన్నట్లు ఆడిన మొరాకో... స్పెయిన్ ను ఓడించి క్వార్టర్ ఫైనల్ కు దూసుకెళ్లింది.  మంగళవారం నిర్ణీత 90 నిమిషాల్లో, ఇంజురీ టైంలో, అదనపు సమయంలో ఇరు జట్లూ గోల్‌ చేయలేకపోయాయి. దీంతో మ్యాచ్ పెనాల్టీ షూటౌట్ కు వెళ్లింది. అందులో అనూహ్యంగా 3-0తో విజయం సాధించింది మొరాకో. ఆ జట్టు ఆటగాళ్లు ఎంతో ఆత్మవిశ్వాసంతో షూటౌట్‌ను ఎదుర్కొన్నారు. స్పెయిన్‌ ఆటగాళ్లు మాత్రం భయం భయంగా షాట్లు ఆడి జట్టు కొంప ముంచారు. మొరాకో గోల్‌కీపర్‌ యాసిన్‌ బౌనౌ అడ్డుగోడగా నిలబడి స్పెయిన్ ను గోల్ చేయనివ్వలేదు. ఈ ప్రదర్శనతో అతను ఆ దేశ హీరోగా నిలిచాడు. మొరాకో 1986లో ఒక్కసారే ప్రిక్వార్టర్స్‌ ఆడింది. ఇప్పుడు మళ్లీ నాకౌట్ ఆడుతున్నామన్న ఆనందం ఆ దేశ ఆటగాళ్లు, అభిమానులను సంబరాల్లో ముంచెత్తింది. 

షూటౌట్ జరిగిందిలా...

గ్రూప్‌ దశలో మొరాకో చక్కటి ప్రదర్శన చేసినప్పటికీ.. స్పెయిన్‌ ముందు ఆ జట్టు నిలుస్తుందా అన్న సందేహాలు వినిపించాయి. అయితే మొరాకోతో అంత తేలిక కాదని స్పెయిన్‌కు త్వరగానే అర్థమైంది. నిర్ణీత సమయంలో ఆ జట్టును గోల్ చేయనీవకుండా మొరాకో ఆటగాళ్లు అడ్డుకున్నారు. స్పెయిన్ గోల్ కొట్టేందుకు 2 ప్రయత్నాలు చేసినప్పటికీ అవి ఫలించలేదు. రెండో అర్ధంలో స్పెయిన్‌ కొంచెం దూకుడు పెంచినా లాభం లేకపోయింది. మొరాకో కూడా అంతే దీటుగా స్పందించింది. ఇంజురీ టైం, అదనపు సమయంలోనూ గోల్స్‌ నమోదు కాకపోవడంతో షూటౌట్‌ అనివార్యం అయింది. 

అయితే షూటౌట్లలో స్పెయిన్‌కు సరైన రికార్డు లేకపోవడంతో అభిమానుల్లో ఆందోళన తప్పలేదు. ఆ జట్టు ఆటగాళ్లలోనూ అది ప్రతిఫలించింది. సబిరి సునాయాసంగా గోల్‌ కొట్టి మొరాకోను 1-0 ఆధిక్యంలో నిలపగా.. పాబ్లో సరాబియా షాట్‌ గోల్‌ బార్‌ను తాకడంతో స్పెయిన్‌కు ఆరంభంలోనే నిరాశ తప్పలేదు. హకీమ్‌ జియెచ్‌ నెట్‌ మధ్యలోకి షాట్‌ ఆడిన షాట్‌తో మొరాకో 2-0 ఆధిక్యంలోకి వెళ్లగా.. కార్లోస్‌ సోలెర్‌ షాట్‌ను యాసిన్‌ సరిగ్గా అంచనా వేసి ఆపేయడంతో స్పెయిన్‌కు మళ్లీ షాక్‌ తగిలింది. బెనౌన్‌ షాట్‌ను సైమన్‌ ఆపడంతో స్పెయిన్‌ ఆశలు నిలిచాయి. కానీ ఆ జట్టు కెప్టెన్‌ సెర్జియో కొట్టిన షాట్‌ను కుడివైపు దూకుతూ యాసిన్‌ ఆపేయడంతో మొరాకో విజయానికి చేరువ అయింది. తమ జట్టు నాలుగో ప్రయత్నాన్ని విజయవంతం చేస్తూ హకిమి గోల్‌ కొట్టడంతో మొరాకో సంబరాలకు అంతే లేకుండా పోయింది. స్పెయిన్‌ శిబిరం కన్నీళ్లతో నిండిపోయింది.

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Jagga Reddy: 20 ఏళ్లలో రూ.20కోట్లు ఖర్చు, ఎన్నికల్లో ఓటమితో ప్రశాంతంగా ఉంది: జగ్గారెడ్డి సంచలనం
20 ఏళ్లలో రూ.20కోట్లు ఖర్చు, ఎన్నికల్లో ఓటమితో ప్రశాంతంగా ఉంది: జగ్గారెడ్డి సంచలనం
YS Jagan: మరోసారి పెద్ద మనసు చాటుకున్న మాజీ సీఎం వైఎస్‌ జగన్, ఓ ప్రాణం నిలిచింది!
మరోసారి పెద్ద మనసు చాటుకున్న మాజీ సీఎం వైఎస్‌ జగన్, ఓ ప్రాణం నిలిచింది!
Brahmanandam: ‘భారతీయుడు 2’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో బ్రహ్మానందం టాలెంట్ చూశారా- వీడియో చూస్తే షాక్!
‘భారతీయుడు 2’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో బ్రహ్మానందం టాలెంట్ చూశారా- వీడియో చూస్తే షాక్!
Income Tax Notice: మీరు టాక్స్ పరిధిలో లేరా? అయినా సరే మీకు నోటీసులు వస్తాయ్, కారణం ఇదీ
మీరు టాక్స్ పరిధిలో లేరా? అయినా సరే మీకు నోటీసులు వస్తాయ్, కారణం ఇదీ
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Bobbili Maharaja Vintage Cars and Weapons | ఇలాంటి పాత, ఖరీదైన కార్లు మీకు ఎక్కడా కనిపించవు.! | ABPSingirikona Narasimha Swamy Temple | సింగిరికోన అడవిలో మహిమాన్విత నారసింహుడి ఆలయం చూశారా.! | ABP80 Years Old Man Completes 21 PGs | చదువు మీద ఈ పెద్దాయనకున్న గౌరవం చూస్తుంటే ముచ్చటేస్తుందిCM Chandrababu CM Revanth Reddy Meeting | అందరి కళ్లూ... తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంపైనే

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jagga Reddy: 20 ఏళ్లలో రూ.20కోట్లు ఖర్చు, ఎన్నికల్లో ఓటమితో ప్రశాంతంగా ఉంది: జగ్గారెడ్డి సంచలనం
20 ఏళ్లలో రూ.20కోట్లు ఖర్చు, ఎన్నికల్లో ఓటమితో ప్రశాంతంగా ఉంది: జగ్గారెడ్డి సంచలనం
YS Jagan: మరోసారి పెద్ద మనసు చాటుకున్న మాజీ సీఎం వైఎస్‌ జగన్, ఓ ప్రాణం నిలిచింది!
మరోసారి పెద్ద మనసు చాటుకున్న మాజీ సీఎం వైఎస్‌ జగన్, ఓ ప్రాణం నిలిచింది!
Brahmanandam: ‘భారతీయుడు 2’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో బ్రహ్మానందం టాలెంట్ చూశారా- వీడియో చూస్తే షాక్!
‘భారతీయుడు 2’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో బ్రహ్మానందం టాలెంట్ చూశారా- వీడియో చూస్తే షాక్!
Income Tax Notice: మీరు టాక్స్ పరిధిలో లేరా? అయినా సరే మీకు నోటీసులు వస్తాయ్, కారణం ఇదీ
మీరు టాక్స్ పరిధిలో లేరా? అయినా సరే మీకు నోటీసులు వస్తాయ్, కారణం ఇదీ
Ration Cards: తెలంగాణలో రేషన్ కార్డుల్లో మార్పులు చేసుకోవచ్చా? ఎడిట్ ఆప్షన్‌పై అధికారుల క్లారిటీ
తెలంగాణలో రేషన్ కార్డుల్లో మార్పులు చేసుకోవచ్చా? ఎడిట్ ఆప్షన్‌పై అధికారుల క్లారిటీ
Rakul Preet Singh: రకుల్ అందాన్ని చూస్తే రెప్ప వేయగలరా? భారతీయుడు 2 ప్రీ రిలీజ్‌లో గ్లామరస్ లేడీ ఫోటోలు
రకుల్ అందాన్ని చూస్తే రెప్ప వేయగలరా? భారతీయుడు 2 ప్రీ రిలీజ్‌లో గ్లామరస్ లేడీ ఫోటోలు
India vs Zimbabwe, 2nd T20I: అద‌ర‌గొట్టిన అభిషేక్ శర్మ, రఫ్ఫాడించేసిన భారత పేసర్లు- జింబాబ్వేతో సిరీస్ సమం
అద‌ర‌గొట్టిన అభిషేక్ శర్మ, రఫ్ఫాడించేసిన భారత పేసర్లు- జింబాబ్వేతో సిరీస్ సమం
Andhra Pradesh: టీడీపీ వాళ్లు పవన్ కళ్యాణ్‌కు గుడి కట్టాలి, డిప్యూటీ సీఎంను గౌరవించాలి- మార్గాని భరత్
టీడీపీ వాళ్లు పవన్ కళ్యాణ్‌కు గుడి కట్టాలి, డిప్యూటీ సీఎంను గౌరవించాలి- మార్గాని భరత్
Embed widget