By: ABP Desam | Updated at : 26 Mar 2023 07:49 PM (IST)
ట్రోఫీతో రెండు జట్ల కెప్టెన్లు (Image: WPLT20 Twitter)
Delhi Capitals Women vs Mumbai Indians Women, WPL 2023: మహిళల ప్రీమియర్ లీగ్‌లో భాగంగా ముంబై ఇండియన్స్‌తో జరుగుతున్న ఫైనల్ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. మహిళల ప్రీమియర్ లీగ్ పాయింట్ల పట్టికలో కూడా టాప్ 2 స్థానాల్లో ఢిల్లీ, ముంబై జట్లే ఉన్నాయి.
ముంబై ఇండియన్స్ ఎలిమినేటర్ మ్యాచ్‌లో ఆడిన జట్టుతోనే బరిలోకి దిగనుంది. ఢిల్లీ మాత్రం ఒక్క మార్పు చేసింది. మిన్ను మణి స్థానంలో పూనమ్ యాదవ్‌ను జట్టులోకి తీసుకున్నారు. రెండు జట్లూ టాప్ ఫాంలో ఉన్నాయి కాబట్టి మ్యాచ్ రసవత్తరంగా సాగనుంది.
ఢిల్లీ క్యాపిటల్స్ ఉమెన్ (ప్లేయింగ్ XI)
మెగ్ లానింగ్(కెప్టెన్), షెఫాలీ వర్మ, జెమిమా రోడ్రిగ్స్, మారిజానే కాప్, అలిస్ క్యాప్సే, జెస్ జోనాస్సెన్, అరుంధతి రెడ్డి, తానియా భాటియా(వికెట్ కీపర్), మిన్ను మణి, రాధా యాదవ్, శిఖా పాండే
ముంబై ఇండియన్స్ మహిళలు (ప్లేయింగ్ XI)
యాస్తికా భాటియా(వికెట్ కీపర్), హేలీ మాథ్యూస్, నాట్ స్కివర్-బ్రంట్, హర్మన్‌ప్రీత్ కౌర్(కెప్టెన్), మెలీ కెర్, పూజా వస్త్రాకర్, ఇస్సీ వాంగ్, అమంజోత్ కౌర్, హుమైరా కాజీ, జింటిమణి కలిత, సైకా ఇషాక్
టీమ్‌ఇండియా విమెన్స్ టీమ్ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ ఓ అరుదైన రికార్డుపై కన్నేసింది! 15 ఏళ్ల క్రితం ఎంఎస్ ధోనీకి సాధ్యమవ్వని ఘనతను సాధించాలని పట్టుదలగా ఉంది. అరంగేట్రం విమెన్ ప్రీమియర్ లీగులో ఆస్ట్రేలియా కెప్టెన్‌ను ఓడించి ట్రోఫీ అందుకోవాలని కలగంటోంది. అప్పట్లో సీఎస్‌కే కెప్టెన్‌కు అసాధ్యమైన ఈ ఫీట్‌ను ఆమె నిజం చేయగలదా?
ఇండియన్ ప్రీమియర్ లీగులో అద్భుతాలు చేసిన జట్టు చెన్నై సూపర్ కింగ్స్. అప్పటి టీమ్‌ఇండియా నాయకుడు ఎంఎస్ ధోనీయే (MS Dhoni) దీనికి కెప్టెన్. జాతీయ జట్టును ఎలా నడిపించాడో సీఎస్‌కేనూ (CSK) అలాగే చూసుకున్నాడు. ఏకంగా నాలుగు సార్లు ట్రోఫీ అందించాడు. ఆటగాళ్ల ఎంపిక దగ్గర్నుంచి వ్యూహాల వరకు అన్నీ అతడి అదుపాజ్ఞల్లోనే ఉంటాయి. అలాంటిది అరంగేట్రం సీజన్లో మాత్రం చెన్నైకి ట్రోఫీ అందించలేకపోయాడు.
చెన్నై సూపర్ కింగ్స్ 2008లో సీనియర్లు, జూనియర్ల మేళవింపుతో సమతూకంగా ఉండేది. మైకేల్ హస్సీ, మఖాయా ఎన్తిని, ముత్తయ్య మురళీధరన్, మాథ్యూ హెడేన్ వంటి సీనియర్లు, రవిచంద్రన్ అశ్విన్, ఆల్బీ మోర్కెల్, పార్థివ్ పటేల్, సురేశ్ రైనా వంటి కుర్రాళ్లు అదరగొట్టారు. అయితే ఫైనల్లో మాత్రం రాజస్థాన్ రాయల్స్ చేతిలో ధోనీసేనకు ఓటమి తప్పలేదు. ఆస్ట్రేలియా లెజెండ్ షేన్ వార్న్ ట్రోఫీ ఎగరేసుకుపోయాడు.
విమెన్ ప్రీమియర్ లీగులోనూ (WPL 2023) ఇప్పుడు అలాంటి సిచ్యువేషనే కనిపిస్తోంది. టీమ్‌ఇండియా మహిళల కెప్టెన్ హర్మన్ ప్రీతే (Harmanpreet Kaur) ముంబయి ఇండియన్స్‌ను (MI Women) నడిపిస్తోంది. జూనియర్, సీనియర్ల మేళవింపుతోనే జట్టు ఫైనల్‌కు చేరుకుంది. హేలీ మాథ్యూస్, నాట్ సివర్, అమెలియా కెర్, ఇస్సీవాంగ్, సైకా ఇషాకి వంటి అద్భుతమైన ప్లేయర్లు ఉన్నారు. అప్పట్లాగే ఫైనల్ చేరిన మరో జట్టు దిల్లీ క్యాపిటల్స్‌ను ఆసీస్ కెప్టెన్ మెగ్‌లానింగ్ నడిపిస్తోంది. విచిత్రంగా హర్మన్, ధోనీ ఏడో నంబర్ జెర్సీనే ధరిస్తారు.
Asian Games 2023: గోల్డ్ కొట్టేసిన స్మృతి మంధాన సేన! లంకపై ఫైనల్లో థ్రిల్లింగ్ విక్టరీ
Women Cricket Team Wins Gold: మన అమ్మాయిలు బంగారం - ఏసియన్ గేమ్స్ క్రికెట్ ఫైనల్‌లో లంకను ఓడించిన భారత్
Asian Games 2023 Medal Tally: డబుల్ డిజిట్ దాటిన భారత్ పతకాల సంఖ్య - మెడల్స్ కొల్లగొడుతున్న రోయర్లు
Asian Games 2023: తుదిపోరులో తడబడిన భారత బ్యాటింగ్ - లంక టార్గెట్ ఎంతంటే!
Axar Patel Ruled Out: భారత్‌కు భారీ షాక్ - మూడో వన్డేకూ దూరమైన అక్షర్ - ప్రపంచకప్‌లో అయినా ఆడతాడా?
Breaking News Live Telugu Updates: ఆసియా గేమ్స్‌లో మహిళా క్రికెట్ జట్టుకు స్వర్ణం
దాడి చేసేందుకు సిద్ధంగా ఉన్న మరో మహమ్మారి, 5 కోట్ల మంది ప్రాణాలు బలి!
Telangana BJP: తెలంగాణ బీజేపీలో ఏం జరుగుతోంది? నేతల రహస్య సమావేశాలు దేని కోసం ?
Nara Bhuvaneswari: అన్నవరంలో భువనేశ్వరి ప్రత్యేక పూజలు- ప్రజల సొమ్ము తీసుకోవాల్సిన అవసరమేంటని ప్రశ్న
/body>