Year Ender 2022: ఘోరంగా నిరాశపరిచిన భారత బౌలర్లు - టెస్టుల్లో టాప్-10 లిస్ట్‌లో ఒక్కరు కూడా!
జస్‌ప్రీత్ బుమ్రా ఈ సంవత్సరం టెస్టుల్లో టీమిండియా టాపర్‌గా నిలిచాడు.
Team India Test Bowler In 2022: ICC వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ రేసులో భారత జట్టు కొనసాగుతోంది. ఇది చూసిన క్రికెట్ అభిమానులు కాస్త ఊరట చెందారు. ఇప్పుడు టీమిండియా ఫైనల్‌లోకి ప్రవేశించాలంటే ఆస్ట్రేలియాను స్వదేశంలో జరిగే టెస్టు సిరీస్‌లో ఓడించాలి. అయితే ఈ ఏడాది టెస్టు క్రికెట్‌లో భారత బౌలర్ల రికార్డు చూస్తే.. వారు ప్రత్యేకంగా బౌలింగ్ చేయలేదు.
2022లో, టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో టీమిండియా బౌలర్లెవరూ చేరలేదు. దీంతో 2022లో టెస్టు క్రికెట్‌లో భారత బౌలర్లు అలసత్వం వహించారు. ఈ ఏడాది టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో ఎవరు ఉన్నారో చూద్దాం.
అత్యధిక వికెట్లు తీసింది ఎవరో తెలుసా?
2022లో టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లలో విదేశీ బౌలర్లు కూడా ఉన్నారు. ఈ జాబితాలో భారత బౌలర్లెవరూ చేరలేదు. నాథన్ లియాన్, కగిసో రబడా టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లుగా నిలిచారు. ఈ బౌలర్లిద్దరూ చెరో 47 వికెట్లు తీశారు. లియన్ 11 టెస్టు మ్యాచ్‌ల్లో, రబాడ 9 మ్యాచ్‌ల్లో ఈ రికార్డు సాధించారు.
ఈ ఇద్దరు బౌలర్లతో పాటు జాక్ లీచ్ 14 టెస్టుల్లో 46 వికెట్లు, స్టువర్ట్ బ్రాడ్ 9 టెస్టుల్లో 40 వికెట్లు, జేమ్స్ అండర్సన్ 8 టెస్టుల్లో 36 వికెట్లు, పాట్ కమిన్స్ 10 టెస్టుల్లో 36 వికెట్లు, మిచెల్ స్టార్క్ 11 టెస్టుల్లో 35 వికెట్లు, మెహిదీ హసన్ మిరాజ్ 8 టెస్టుల్లో 31 వికెట్లు, ప్రభాత్ జయసూర్య 3 టెస్టుల్లో 29 వికెట్లు, టిమ్ సౌథీ 8 టెస్టుల్లో 28 వికెట్లు, అల్జారీ జోసెఫ్ 7 టెస్టుల్లో 27 వికెట్లు, బెన్ స్టోక్స్ 15 టెస్టుల్లో 26 వికెట్లు, ట్రెంట్ బౌల్ట్ 5 టెస్టుల్లో 25 వికెట్లు, కేశవ్ మహరాజ్ 10 టెస్టుల్లో 25 వికెట్లు తీశారు.
బుమ్రా 18వ స్థానంలో
2022లో అత్యధిక వికెట్లు తీసిన ప్రపంచంలోని టాప్ 17 బౌలర్లలో భారత్ బౌలర్ ఎవరూ లేరు. టీమ్ ఇండియా తరఫున జస్ప్రీత్ బుమ్రా 18వ స్థానంలో ఉన్నాడు. ఈ ఏడాది భారత్ నుంచి టెస్టు క్రికెట్‌లో అత్యధిక వికెట్లు తీసిన తొలి బౌలర్‌గా నిలిచాడు. ఈ ఏడాది టెస్టులో టీమిండియా బౌలర్ రవి చంద్రన్ అశ్విన్ కూడా రాణించలేదు. ఆరు టెస్టుల్లో 20 వికెట్లు మాత్రమే తీయగలిగాడు. ఈ ఇద్దరు బౌలర్లు మినహా ఈ ఏడాది టెస్టుల్లో భారత బౌలర్లెవరూ 13 వికెట్లకు మించి తీయలేకపోయారు.
View this post on Instagram