By: ABP Desam | Updated at : 10 Jun 2023 09:04 PM (IST)
జస్ప్రిత్ బుమ్రా ( Image Source : Jasprit Bumrah Twitter )
Bumrah Comeback: గడిచిన 8 నెలలుగా భారత జట్టు స్టార్ పేసర్ జస్ప్రిత్ బుమ్రా సేవలను కోల్పోతోంది. 2022 సెప్టెంబర్ నుంచి టీమ్‌కు దూరంగా ఉంటున్నా ఇంగ్లాండ్‌లో ముగిసిన రీషెడ్యూల్డ్ టెస్టు, వన్డే సిరీస్ (ఆగస్టు) తర్వాత బుమ్రా జట్టుకు దూరంగానే ఉన్నాడు. బుమ్రా లేకుండా భారత్ గతేడాది ఆసియా కప్, టీ20 వరల్డ్ కప్‌తో పాటు తాజాగా కెన్నింగ్టన్ ఓవల్ లో జరుగుతున్న ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ కూడా ఆడుతోంది.
అయితే బుమ్రా కమ్‌బ్యాక్ ఎప్పుడనేదానిపై బీసీసీఐ ఇంతవరకూ ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు. కానీ తాజాగా టీమిండియా వెటరన్ వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్ మాత్రం బుమ్రా రాకపై క్రేజీ అప్డేట్ ఇచ్చాడు. డబ్ల్యూటీసీ ఫైనల్‌లో కామెంట్రీ విధులు నిర్వర్తిస్తున్న కార్తీక్ మాట్లాడుతూ.. బుమ్రా ఈ ఏడాది ఆగస్టులో ఐర్లాండ్ వేదికగా జరుగబోయే మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో ఆడేందుకు సమాయత్తమవుతున్నాడని చెప్పాడు. ఈ మేరకు బుమ్రా ఫిట్నెస్‌పై దృష్టి సారించాడని త్వరలోనే అతడు స్ట్రాంగ్ కమ్‌బ్యాక్ ఇస్తాడని కార్తీక్ తెలిపాడు.
Dinesh Karthik in the commentary mentioned "Bumrah is trying to come back through Ireland T20 series".
Good news for Team India for the World Cup. pic.twitter.com/EuHS2d3odx— Johns. (@CricCrazyJohns) June 10, 2023
ఈ ఏడాది భారత జట్టు డబ్ల్యూటీసీ ఫైనల్ ముగిసిన తర్వాత సుమారు నెల రోజుల పాటు ఖాళీగానే ఉంటుంది. జులై-ఆగస్టులో వెస్టిండీస్‌లో మూడు ఫార్మాట్ల సిరీస్‌లు ఆడేంతవరకూ టీమిండియాకు ద్వైపాక్షిక సిరీస్‌లు ఏమీ లేవు. విండీస్ పర్యటన ముగిసిన తర్వాత ఐర్లాండ్‌లో మూడు టీ20 మ్యాచ్‌లు ఆడేందుకు అక్కడికి వెళ్లనుంది. నేరుగా సుదీర్ఘ ఫార్మాట్‌లోకి గానీ, వన్డేలలోకి గానీ పాల్గొనకుండా పొట్టి ఫార్మాట్‌లోకి ఎంట్రీ ఇచ్చి తన బాడీ ఎలా సహకరిస్తుందో పరీక్షించనున్నాడు.
ఆగస్టులో విండీస్, ఐర్లాండ్ పర్యటన ముగిసిన తర్వాత భారత జట్టు సెప్టెంబర్‌లో ఆసియా కప్ ఆడనుంది. ఈ టోర్నీ ఎక్కడ జరుగుతుంది..? అనేదానిపై ఇంకా సందిగ్ధత కొనసాగుతున్నా శ్రీలంక, దుబాయ్‌లలో నిర్వహించేందుకు ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) పట్టుదలతో ఉంది. ఆసియా కప్ తర్వాత టీమిండియాకు అక్టోబర్‌లో స్వదేశంలో జరిగే వన్డే వరల్డ్ కప్ చాలా కీలకం. బుమ్రా వన్డే వరల్డ్ కప్ ప్రాబబుల్స్ లో కూడా ఉన్నాడు. ఈ నేపథ్యంలో బుమ్రా ఎంత త్వరగా కోలుకుంటే భారత్‌కు అంత ఉపయోగకరం.
Never easy, but always worth it 💪 pic.twitter.com/aJhz7jCsxQ
— Jasprit Bumrah (@Jaspritbumrah93) November 25, 2022
ఈ ఏడాది ఫిబ్రవరిలో వెన్నునొప్పికి న్యూజిలాండ్‌కు వెళ్లి శస్త్ర చికిత్స చేయించుకున్న తర్వాత బుమ్రా మళ్లీ క్రికెట్ ఫీల్డ్‌లో కనిపించలేదు. ప్రస్తుతం బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో రిహాబిటేషన్ తీసుకుంటున్న బుమ్రా.. ఐర్లాండ్ సిరీస్‌లో ఆడేందుకు సిద్ధమవ్వాలని భావించినా దానికి ఇంకా రెండు నెలల సమయముంది. మరి ఆలోపు ఈ పేస్ గుర్రం సిద్దమవ్వాలని టీమిండియా అభిమానులు కోరుకుంటున్నారు.
ODI World Cup 2023: ఐదు మ్యాచ్‌లే ఆడతా, అలా అయితే రాజీనామా చేస్తా! - బంగ్లా జట్టులో షకిబ్ వర్సెస్ తమీమ్
ODI World Cup 2023: సరే రండి! - పాక్ క్రికెట్ టీమ్‌కు వీసాలు మంజూరుచేసిన భారత్ - హైదరాబాద్‌కు పాక్ జట్టు
ODI World Cup 2023: కపిల్ దేవ్ కిడ్నాప్ కథ సుఖాంతం - ఎందుకోసమంటే!
Asian Games 2023: ఆరాధ్య దేవతను చూడటానికి 1200 కిలోమీటర్ల ప్రయాణం - స్మృతి మంధానకు చైనాలో ఫాలోయింగ్
భారత్, ఆస్ట్రేలియా మూడో మ్యాచ్ పరిస్థితి ఏంటి? - వర్షం ఆటంకం కలిగిస్తుందా?
Singareni Employees: సింగరేణి కార్మికులకు సీఎం కేసీఆర్ శుభవార్త, 32 శాతం బోనస్ ఇవ్వబోతున్నట్లు ప్రకటన
BJP vs Congress in Telangana: ఫుల్ జోష్ లో తెలంగాణ కాంగ్రెస్, సప్పుడు లేని బీజేపీ! బండి దిగాక జోరు తగ్గిందా!
విజయ్ సేతుపతి కుటుంబానికి బెదిరింపులు - అందుకే ఆయన అలా చేశారు: ముత్తయ్య మురళీధరన్
MLC What Next : గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా కేసీఆర్ కొత్త పేర్లు ప్రతిపాదిస్తారా ? మళ్లీ వారి పేర్లే పంపుతారా ?
/body>