WTC Final Commentators: దాదా ఈజ్ బ్యాక్ - డబ్ల్యూటీసీ ఫైనల్స్‌కు కామెంటేటర్‌గా గంగూలీ - పూర్తి జాబితా ఇదే
మరో ఐదు రోజుల్లో భారత్ - ఆస్ట్రేలియా మధ్య ఇంగ్లాండ్ లోని ‘ది ఓవల్’ వేదికగా జరుగబోయే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు స్టార్ స్పోర్ట్స్ కామెంట్రీ ప్యానెల్‌ను ప్రకటించింది.
WTC Final Commentators: రెండు నెలలపాటు క్రికెట్ అభిమానులను ఉర్రూతలూగించిన ఇండియన్ ప్రీమియర్ లీగ్‌కు ఇటీవలే ఘనంగా ఎండ్ కార్డ్ పడింది. ఇక క్రికెట్ అభిమానుల దృష్టంతా ఐసీసీ త్వరలో నిర్వహించబోయే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్ మీద పడింది. జూన్ 7 నుంచి 11 మధ్య లండన్‌లోని ప్రఖ్యాత స్టేడియం ‘ది ఓవల్’ వేదికగా జరుగనుంది. ఈ నేపథ్యంలో డబ్ల్యూటీసీ ఫైనల్స్‌ను ప్రత్యక్ష ప్రసారం చేయబోయే స్టార్ స్పోర్ట్స్ తమ కామెంట్రీ ప్యానెల్‌ను తాజాగా ప్రకటించింది.
చాలాకాలం తర్వాత టీమిండియా మాజీ సారథి, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ మైక్ పట్టుకోబోతుండటం విశేషం. దాదాతో పాటు వివిధ భాషల్లో కామెంట్రీని చెప్పే వ్యాఖ్యాతల పేర్లను వెల్లడించింది. ఇంగ్లీష్, హిందీతో పాటు స్టార్ ఈ మ్యాచ్‌ను తమిళ్, తెలుగు, కన్నడలో కూడా ప్రసారం చేయనుంది. అయితే గంగూలీ.. ఇంగ్లీష్ కామెంట్రీ ప్యానెల్ లో కాకుండా హిందీలో కామెంట్రీ చెప్పనుండటం గమనార్హం.
కామెంటేటర్ల జాబితా :
ఇంగ్లీషులో కామెంట్రీ చెప్పే వక్తలు : రవిశాస్త్రి, హర్షా భోగ్లే , నాసిర్ హుస్సేన్, దినేశ్ కార్తీక్, రికీ పాంటింగ్, మాథ్యూ హెడెన్, జస్టిన్ లాంగర్, కుమార సంగక్క, సునీల్ గవాస్కర్
హిందీ కామెంటేటర్స్ : సౌరవ్ గంగూలీ, హర్భజన్ సింగ్, ఎస్.శ్రీశాంత్, జతిన్ సప్రు, దీప్ దాస్ గుప్తా
తమిళం : యో మహేశ్, ఎస్. రమేశ్ , లక్ష్మీపతి బాలాజీ, ఎస్. శ్రీరామ్
తెలుగు : కౌశిక్, ఆశిష్ రెడ్డి, టి.సుమన్, కె. కళ్యాణ్
కన్నడ : విజయ్ భరద్వాజ్, శ్రీనివాస. ఎం, బి. చిప్లి, పవన్ దేశ్‌పాండే, సునీల్ జోషీ
Hindi commentators for WTC final:
— Johns. (@CricCrazyJohns) June 2, 2023
Ganguly, Harbhajan, Sreesanth, Jatin Sapru, Deep Dasgupta. pic.twitter.com/yHiVzUHHQF
డబ్ల్యూటీసీ ఫైనల్స్‌కు మ్యాచ్ అఫిషియల్స్ లిస్ట్ :
ఆన్ ఫీల్డ్ అంపైర్స్ : క్రిస్ గఫనె, రిచర్డ్ ఇల్లింగ్‌వర్త్
టీవీ అంపైర్ : రిచర్డ్ కెటెల్‌బరో
ఫోర్త్ అంపైర్ : కుమార ధర్మసేన
మ్యాచ్ రిఫరీ : రిచీ రిచర్డ్‌సన్
Focus 💯
— ICC (@ICC) June 2, 2023
Virat Kohli is getting into the groove ahead of the #WTC23 Final 🏏 pic.twitter.com/6BbS1CcNbN
డబ్ల్యూటీసీ ఫైనల్స్‌కు ఇరు జట్లు :
ఇండియా : రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, ఛటేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ, అజింక్యా రహానే, కెఎస్ భరత్, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, ఉమేశ్ యాదవ్, జయదేవ్ ఉనద్కత్, ఇషాన్ కిషన్
స్టాండ్ బై ప్లేయర్స్ : యశస్వి జైస్వాల్, ముఖేష్ కుమార్, సూర్యకుమార్ యాదవ్
ఆస్ట్రేలియా : పాట్ కమిన్స్ (కెప్టెన్), స్కాట్ బొలాండ్, అలెక్స్ కేరీ, కామెరూన్ గ్రీన్, మార్కస్ హారిస్, జోష్ హెజిల్‌వుడ్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లబూషేన్, నాథన్ లియాన్, టాడ్ మర్ఫీ, స్టీవ్ స్మిత్, మిచెల్ స్టార్క్, డేవిడ్ వార్నర్
స్టాండ్ బై ప్లేయర్స్ : మిచెల్ మార్ష్, మాథ్యూ రెన్షా