WPL Auction 2024: ఐపీఎల్ వేలంలో తెలంగాణ అమ్మాయి, గుజరాత్ టీమ్‌లోకి త్రిష
WPL Auction 2024: మహిళల ప్రీమియర్ లీగ్‌లో తెలంగాణ అమ్మాయికి జాక్ పాట్ తగిలింది. త్రిషను రూ. 10 లక్షలతో గుజరాత్ జెయింట్స్ ఫ్రాంచైజీ సొంతం చేసుకుంది.
మహిళల ప్రీమియర్ లీగ్ (WPL Auction) రెండో మినీ వేలం ముంబై(Mumbai)లో జరుగుతోంది. ఈ ప్రీమియర్ బిడ్డింగ్‌లో కొంతమంది స్టార్ ప్లేయర్లు, సీనియర్ ఆటగాళ్ల కంటే యంగ్ ప్లేయర్ల కోసం లక్షలు, అవసరమైతే కోట్లు వెచ్చిస్తున్నాయి. తాజాగా మహిళల ప్రీమియర్ లీగ్‌లో తెలంగాణ అమ్మాయికి జాక్ పాట్ తగిలింది. హైదరాబాద్‌లో శిక్షణ పొందిన్ద త్రిష అండర్-16, 19, 23 విభాగాల్లో అద్భుత ప్రదర్శన చేసింది. హైదరాబాద్ టీమ్ తరఫున కొన్ని మ్యాచ్‌లు కూడా ఆడింది. ఇప్పుడు ఏకంగా మహిళల ప్రీమియర్ లీగ్‌లో ఆడే అవకాశం దక్కించుకుంది. త్రిషను రూ. 10 లక్షలతో గుజరాత్ జెయింట్స్ (Gujarat Giants) ఫ్రాంచైజీ సొంతం చేసుకుంది.
అంతకు ముందు మహిళల ప్రీమియర్ లీగ్ రెండో మినీ వేలంలో ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ అన్నాబెల్ సథర్‌లాండ్‌ను భారీ ధరకు ఢిల్లీ (Delhi capitals) దక్కించుకుంది. 40 లక్షల కనీస ధరతో రిజిస్టర్ అయిన ఆల్‌రౌండర్ అన్నాబెల్ సథర్‌లాండ్‌ను దక్కించుకునేందుకు ముంబై ఇండియన్స్ , ఢిల్లీ క్యాపిటల్స్ చివరి వరకూ గట్టిగా పోరాడాయి. అయితే చివరకు చివరకు ఢిల్లీ రూ. 2 కోట్లతో అన్నాబెల్‌ను దక్కించుకుంది. అన్నాబెల్‌కు టీ20ల్లో అద్భుతమైన రికార్డు ఉంది. ఆమె 14 మ్యాచుల్లో 288 రన్స్ సాధించింది. బౌలింగ్‌లోనూ సత్తా చాటుతూ 23 వికెట్లు పడగొట్టింది. ఇక రూ.30 లక్షల కనీస ధరతో రిజిస్టర్ అయిన లిచ్‌ఫీల్డ్ కోసం యూపీ వారియర్స్, గుజరాత్ జెయింట్స్ పోటీ పడ్డాయి. చివరకు యువ బ్యాటర్ ఫోబె లిచ్‌ఫీల్డ్‌ను గుజరాత్ రూ. 1 కోటికి దక్కించుకుంది. తొలిసారి డబ్ల్యూపీఎల్ వేలంలోకి వచ్చిన ఆమె ఊహించని ధరకు అమ్ముడుపోయింది. రూ. 30 లక్షల కేటగిరీలో వచ్చిన ఆమె కోసం గుజరాత్ కోటీ రూపాయలు ఖర్చు చేసింది.
ఆస్ట్రేలియాకు చెందిన ఫోబె లిచ్‌ఫీల్డ్ 19 ఏళ్ల వయసులోనే అంతర్జాతీయ క్రికెట్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఎడమ చేతి వాటం బ్యాటర్ అయిన లిచ్‌ఫీల్డ్.. 2022లో భారత్ – ఆస్ట్రేలియా మధ్య జరిగిన టీ20 సిరీస్‌లో అరంగేట్రం చేసింది. ఇప్పటివరకూ ఆసీస్ తరఫున అన్ని ఫార్మాట్లలోనూ ఆడిన లిచ్‌ఫీల్డ్.. ఇంటర్నేషనల్ క్రికెట్‌తో పాటు ఉమెన్స్ బిగ్‌బాష్ లీగ్ (డబ్ల్యూబీబీఎల్), దేశవాళీ క్రికెట్‌లో మెరుపులు మెరిపిస్తోంది.
మహిళా ప్రీమియర్ లీగ్ రెండో ఎడిషన్ వేలానికి మొత్తం 165 మంది క్రికెటర్లు తమ పేరును నమోదు చేసుకున్నారు. మొత్తం 165 మందిలో 104 మంది భారత(Indian) క్రికెటర్లు కాగా.. 61 మంది విదేశీ ప్లేయర్లు ఉన్నారు. మరో 15 మంది అసోసియేట్ దేశాల నుంచి కూడా తమ పేర్లను నమోదు చేసుకున్నారు. ఇందులో 56 మంది మాత్రమే క్యాప్‌డ్ ప్లేయర్లు కాగా 109 మంది అన్‌క్యాప్‌డ్ క్రికెటర్లు. జాతీయ జట్టు తరఫున ప్రాతినిథ్యం వహించిన వారిని క్యాప్‌డ్ ప్లేయర్లు అంటారు. నేషనల్ టీమ్‌కు ఇంకా ఆడనివారినే అన్‌క్యాప్‌డ్ ప్లేయర్లుగా పిలుస్తారు. ఐదు ఫ్రాంచైజీ జట్లు వేలంలో పాల్గొంటుండగా... 30 స్లాట్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఐదు టీమ్‌లు మొత్తం 29 మంది క్రికెటర్లను రిలీజ్ చేశాయి. ప్రస్తుతం ఐదు ఫ్రాంచైజీలు 30 మంది ఆటగాళ్లను దక్కించుకునేందుకు రూ.71.65 కోట్లు ఖర్చు చేయనున్నాయి. ఈ 30 మంది ఆటగాళ్లలో 9 మంది విదేశీ ఆటగాళ్లు ఉన్నారు.