WPL 2024: హై స్కోరింగ్ మ్యాచ్‌లో ఆర్సీబీ గెలుపు, పోరాడి ఓడిన యూపీ
Wpl UP vs RCB: మహిళల ప్రీమియర్ లీగ్‌లో యూపీ వారియర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో బెంగళూరు విజయం సాధించింది. 23 పరుగుల తేడాతో ఆర్సీబీ గెలుపొందింది.
Mandhana, Perry helps Bangalore win big: మహిళల ప్రీమియర్ లీగ్(WPL)లో యూపీ వారియర్స్(UP Warriorz)తో జరిగిన మ్యాచ్‌లో బెంగళూరు విజయం సాధించింది. 23 పరుగుల తేడాతో ఆర్సీబీ గెలుపొందింది. 199 పరుగుల భారీ లక్ష్యంతో బ్యాటింగ్ చేసిన యూపీ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల కోల్పోయి 175 పరుగులు చేసింది. లక్ష్య చేధనలో చివరి వరకూ పోరాడినా యూపీకీ ఓటమి తప్పలేదు. ఓపెనర్ అలీసా హేలీ 55... దీప్తి శర్మ 33 పరుగులతో చెలరేగినా మిగతావారు విఫలం కావడంతో ఆ జట్టు ఓటమి పాలైంది. బెంగళూరు బౌలర్లు చివర్లో కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో యూపీకి ఓటమి తప్పలేదు. అంతకుముందు యూపీ వారియర్స్ బౌలర్లను బెంగళూరు దంచికొట్టింది. కెప్టెన్ స్మృతి మంధాన (80), ఎలీస్ పెర్రీ (58) అదరగొట్టడంతో.. ఆ జట్టు 3 వికెట్ల నష్టానికి 198 పరుగులు చేసింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరుకు ఓపెనర్లు మేఘన మంధాన కలిసి శుభారంభానిచ్చారు. మేఘన 28 పరుగులతో రాణించింది. తొలి వికెట్‌కు వీరు 51 పరుగులు జోడించారు. అనంతరం క్రీజ్‌లోకి వచ్చిన ఎలీస్ పెర్రీతో కలిసి మంధాన దూకుడుగా ఆడింది. రిచా ఘోష్ 21 పరుగులు చేసి పర్వాలేదనిపించింది. యూపీ బౌలర్లలో అంజలి, దీప్తి శర్మ, సోఫీ ఎక్లెస్టోన్ ఒక్కో వికెట్ తీశారు.
ఢిల్లీ విజయపరంపర
వుమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో గుజరాత్‌కు మరో ఓటమి ఎదురైంది. ఢిల్లీ క్యాపిటల్స్(DC)తో జరుగుతున్న మ్యాచ్‌లో గుజరాత్(Gujarat) 25 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. 164 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ చేసిన గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 138 పరుగులు చేసింది. అష్లే గార్డెనర్ (40) మినహా మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు.
బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ.. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది. ఢిల్లీ సారథి మెగ్‌లానింగ్ 41 బంతుల్లో 55 పరుగులు చేసింది. అలీస్ క్యాప్సీ 17 బంతుల్లోనే 27 పరుగులు చేసింది. ఓపెనర్ షఫాలీ వర్మ 9 బంతులే ఆడినా ఓ సిక్సర్, ఓ బౌండరీ సాయంతో 13 పరుగులు చేసి ఔట్ అయింది. వన్ డౌన్‌లో వచ్చిన అలీస్ క్యాప్సీ ఆ ఊపును కొనసాగించింది. కెప్టెన్ మెగ్‌లానింగ్ కూడా వేగంగా పరుగులు రాబట్టడంతో ఢిల్లీ స్కోరు పరుగులెత్తింది. వీరి దూకుడుతో ఢిల్లీ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది. గుజరాత్ బౌలర్లలో మేఘనా సింగ్ మూడు (4/37) వికెట్లు పడగొట్టింది. కీలక బ్యాటర్లు అంతా వెనుదిరిగినా అన్నాబెల్ సదర్లండ్ (12 బంతుల్లో 20, 2 ఫోర్లు, 1 సిక్సర్) ధాటిగా ఆడింది. ఆఖర్లో శిఖా పాండే 8 బంతుల్లో 14 నాటౌట్, 2 ఫోర్లు) రెండు బౌండరీలు బాది ఢిల్లీ స్కోరును 160 దాటించింది.
ఛేదనలో తడబాటు
164 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ చేసిన గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 138 పరుగులు చేసింది. అష్లే గార్డెనర్ (40) మినహా మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు. ఢిల్లీ బౌలర్లలో జెస్ జోనాస్సెన్, రాధా యాదవ్ తలో మూడు వికెట్లు తీసి ప్రత్యర్థి జట్టు పతనాన్ని శాసించారు. ఈ విజయంతో దిల్లీ జట్టు పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది. ఇక గుజరాత్ జట్టు ఇంతవరకు ఖాతా తెరవలేదు. ఆడిన 4 మ్యాచ్‌ల్లోనూ ఓటమి చవిచూసింది.