అన్వేషించండి

WPL 2024: హర్మన్‌.. విధ్వంసం, ప్లేఆఫ్స్‌లో ముంబై

MI vs GG: వుమెన్స్‌ ప్రీమియర్‌ లీగ్‌లో మరో ఉత్కంఠభరిత మ్యాచ్‌లో గుజరాత్‌ జెయింట్స్‌పై ముంబై విజయం సాధించింది. ఓటమి ఖాయమనుకున్న దశలో హర్మన్‌ ప్రీత్‌ విధ్వంసంతో ముంబై అదిరిపోయే విజయం సాధించింది.

Harmanpreet heroics help Mumbai win: వుమెన్స్‌ ప్రీమియర్‌ లీగ్‌(WPL)లో మరో ఉత్కంఠభరిత మ్యాచ్‌లో గుజరాత్‌ జెయింట్స్‌(Gijarat Jaints)పై ముంబై(Mumbai) విజయం సాధించింది. హర్మన్‌ ప్రీత్‌ కౌర్‌ విధ్వంసంతో విజయం సాధించిన ముంబై ప్లే ఆఫ్స్‌కు దూసుకెళ్లింది. ఓటమి ఖాయమనుకున్న దశలో హర్మన్‌ ప్రీత్‌ విధ్వంసంతో ముంబై అదిరిపోయే విజయం సాధించింది. చివరి ఆరు ఓవర్లలో దాదాపు ఓవర్‌కు 14 పరుగులు చేయాల్సిన దశలో హర్మన్‌... గుజరాత్‌ బౌలర్లను ఊచకోత కోసింది. హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ 48 బంతుల్లోనే 10 ఫోర్లు, అయిదు సిక్సర్లతో 95 పరుగులతో అజేయంగా నిలిచి ముంబైకి చిరస్మరణీయ విజయం సాధించింది. 36 బంతుల్లో 91 పరుగులు చేయాల్సిన స్థితిలో ఒత్తిడిలో పడింది. ఈ దశలో హర్మన్‌ప్రీత్‌ అసాధారణంగా పోరాడింది. అమేలియా (12 నాటౌట్‌)తో కలిసి మెరుపు భాగస్వామ్యాన్ని నెలకొల్పి మ్యాచ్‌ స్వరూపాన్ని మార్చేసింది. 


మ్యాచ్‌ సాగిందిలా..
మహిళల ప్రిమియర్‌ లీగ్‌ సీజన్‌-2లో భారీ స్కోర్లు నమోదైన మ్యాచ్‌లో ముంబై 7 వికెట్ల తేడాతో గుజరాత్‌ను ఓడించి ప్లేఆఫ్స్‌ చేరింది. ఈ మ్యాచ్‌లో తొలుత గుజరాత్‌ 20 ఓవర్లలో 7 వికెట్లకు 190 పరుగులు చేసింది. హేమలత (74), కెప్టెన్‌ బెత్‌ మూనీ (66) అర్ధ శతకాలు చేశారు. ఛేదనలో ముంబై 19.5 ఓవర్లలో 191/3 స్కోరు చేసి నెగ్గింది. యాస్తిక (49) రాణించింది. హర్మన్‌, కెర్‌ (12 నాటౌట్‌) నాలుగో వికెట్‌కు అజేయంగా 93 రన్స్‌ జోడించి.. జట్టుకు అద్భుత విజయాన్ని అందించారు. 40 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద హర్మన్‌ క్యాచ్‌ను లిచ్‌ఫీల్డ్‌ చేజా ర్చడం మ్యాచ్‌ను మలుపు తిప్పింది. గెలుపునకు చివరి 18 బంతుల్లో 47 పరుగులు కావాల్సి ఉండగా.. రాణా వేసిన 18వ ఓవర్‌లో హర్మన్‌ 24 రన్స్‌ రాబట్టడంతో సమీకరణం ఒక్కసారిగా మారిపోయింది. 19వ ఓవర్లో పది పరుగులే రావడంతో ఆఖరి ఓవర్లో గెలవాలంటే 13 పరుగులు అవసరమయ్యాయి. తొలి రెండు బంతులను సిక్స్‌, ఫోర్‌గా మలిచిన హర్మన్‌ విజయాన్ని ఖాయం చేసింది. ఈ గెలుపుతో ముంబై ప్లేఆఫ్స్‌కు చేరింది.


‘టెస్టు క్రికెట్ ఇన్సెంటివ్‌ స్కీమ్‌’ ప్రకటన

వ‌న్డేలు, టీ20ల రాక‌తో టెస్టు క్రికెట్‌కు ఆద‌ర‌ణ త‌గ్గిపోతుంది. కొంద‌రు ఆట‌గాళ్లు లీగ్‌లకే అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. టెస్టు క్రికెట్‌ ఆడే ఆకలి లేని క్రికెటర్లను టీంలోకి తీసుకోవద్దంటూ రోహిత్‌ శర్మ(Rohit Sharma) ఇటీవల వ్యాఖ్యానించాడు. సుదీర్ఘ ఫార్మాట్‌పై టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ చేసిన వ్యాఖ్యలకు క్రికెట్‌ దిగ్గజం సునీల్‌ గవాస్కర్‌(Sunil Gavaskar) కూడా మద్దతు తెలిపాడు. రోహిత్‌ శర్మ వ్యాఖ్యలు పూర్తి నిజమని.. టెస్టు క్రికెట్‌ ఆడాలనుకునే వారినే ఎంపిక చేయాలని సెలక్షన్‌ కమిటీకి సూచించాడు. ఈ సూచనలతో బీసీసీఐ మరిన్ని చర్యలు తీసుకుంది. ప్రపంచంలోనే అత్యంత ధనిక క్రికెట్‌ బోర్డు అయిన బీసీసీఐ... సెంట్రల్‌ కాంట్రాక్టులో ఉండి టెస్టులు ఆడే క్రికెటర్లకు మ్యాచ్‌ ఫీజులను పెంచడంతో పాటు బోనస్‌ కూడా ప్రకటించింది.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి సిద్ధమైన టీమ్ ఇండియాఅమెరికాలో అదానీపై అవినీతి కేసు సంచలనంసోషల్ మీడియాలో అల్లు అర్జున్ రామ్ చరణ్ ఫ్యాన్ వార్ధనుష్‌పై మరో సంచలన పోస్ట్ పెట్టిన నయనతార

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
Adani Group Statement:  అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
Diksha Divas: తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
Nara Lokesh : ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
Embed widget