అన్వేషించండి

WPL 2024: ఢిల్లీ విజయ పరంపర, గుజరాత్‌ పరాజయ పరంపర

GG vs DC Highlights: వుమెన్స్‌ ప్రీమియర్‌ లీగ్‌లో  గుజరాత్‌కు మరో ఓటమి ఎదురైంది.  ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో గుజరాత్ 25 పరుగుల తేడాతో ఓటమిపాలైంది.

Delhi Capitals beat Gujarat Giants by 25 runs for third win:  వుమెన్స్‌ ప్రీమియర్‌ లీగ్‌లో  గుజరాత్‌కు మరో ఓటమి ఎదురైంది.  ఢిల్లీ క్యాపిటల్స్‌(DC)తో జరుగుతున్న మ్యాచ్‌లో గుజరాత్(Gujarat) 25 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. 164 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌ చేసిన గుజరాత్‌ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 138 పరుగులు చేసింది. అష్లే గార్డెనర్‌ (40) మినహా మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు. 

బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో టాస్‌ ఓడి మొదట బ్యాటింగ్‌ చేసిన ఢిల్లీ.. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది. ఢిల్లీ సారథి మెగ్‌లానింగ్‌ 41 బంతుల్లో 55 పరుగులు చేసింది. అలీస్‌ క్యాప్సీ  17 బంతుల్లోనే 27 పరుగులు చేసింది. ఓపెనర్‌ షఫాలీ వర్మ 9 బంతులే ఆడినా ఓ సిక్సర్‌, ఓ బౌండరీ సాయంతో 13 పరుగులు చేసి ఔట్‌ అయింది. వన్‌ డౌన్‌లో వచ్చిన అలీస్‌ క్యాప్సీ ఆ ఊపును కొనసాగించింది. కెప్టెన్‌ మెగ్‌లానింగ్‌ కూడా వేగంగా పరుగులు రాబట్టడంతో ఢిల్లీ స్కోరు పరుగులెత్తింది. వీరి దూకుడుతో ఢిల్లీ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది.  గుజరాత్‌ బౌలర్లలో మేఘనా సింగ్‌ మూడు (4/37) వికెట్లు పడగొట్టింది. కీలక బ్యాటర్లు అంతా వెనుదిరిగినా అన్నాబెల్‌ సదర్లండ్‌ (12 బంతుల్లో 20, 2 ఫోర్లు, 1 సిక్సర్‌) ధాటిగా ఆడింది. ఆఖర్లో శిఖా పాండే 8 బంతుల్లో 14 నాటౌట్‌, 2 ఫోర్లు) రెండు బౌండరీలు బాది ఢిల్లీ స్కోరును 160 దాటించింది.

ఛేదనలో తడబాటు
164 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌ చేసిన గుజరాత్‌ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 138 పరుగులు చేసింది. అష్లే గార్డెనర్‌ (40) మినహా మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు. ఢిల్లీ బౌలర్లలో జెస్‌ జోనాస్సెన్‌, రాధా యాదవ్‌ తలో మూడు వికెట్లు తీసి ప్రత్యర్థి జట్టు పతనాన్ని శాసించారు. ఈ విజయంతో దిల్లీ జట్టు పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది. ఇక గుజరాత్‌ జట్టు ఇంతవరకు ఖాతా తెరవలేదు. ఆడిన 4 మ్యాచ్‌ల్లోనూ ఓటమి చవిచూసింది.

రెండో స్థానంలో ముంబై 
వుమెన్స్‌ ప్రీమియర్‌ లీగ్‌(WPL)లో ముంబై ఇండియన్స్‌(Mumbai Indians) పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో కొనసాగుతోంది. రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు(Royal Challengers Bangalore)ను చిత్తుగా ఓడించిన ముంబై రెండో స్థానంలో ఉంది.  గత మ్యాచ్‌లో టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరు 6 వికెట్ల నష్టానికి 131 పరుగులే చేసింది. బెంగళూరు బ్యాటర్లు ఘోరంగా విఫలమయ్యారు. కెప్టెన్‌ స్మృతి మంధాన 9, సోఫి డెవిన్‌ 9 తక్కువ పరుగులకే అవుటయ్యారు. ఇతెలుగు అమ్మాయి సబ్బినేని మేఘన కూడా 11 పరుగులకే పెవిలియన్‌ చేరింది. కానీ ఎలిస్‌ పేర్రి జట్టును ఆదుకుంది. 44 పరుగులతో అజేయంగా నిలిచి బెంగళూరుకు ఆ మాత్రం సోరైనా అందించింది. జార్జియా వేర్‌హామ్ కూడా 27 పరుగులతో పర్వాలేదనిపించింది. ముంబయి బౌలర్లలో నాట్ స్కివర్, పూజా వస్త్రాకర్ చెరో రెండు.. ఇస్సీ వాంగ్, సైకా ఇషాక్ ఒక్కో వికెట్‌ తీశారు. దీంతో బెంగళూరు 6 వికెట్ల నష్టానికి 131 పరుగులే చేసింది. తర్వాత బెంగళూరు నిర్దేశించిన 132 పరుగుల లక్ష్యాన్ని 3 వికెట్లు కోల్పోయి 15.1 ఓవర్లలోనే ఛేదించింది. బ్యాటింగ్‌లో యాస్తికా భాటియా 31, మ్యాథ్యూస్‌ 26, నాట్ స్కివర్ 27, అమేలియా ఖేర్‌ 40 రాణించారు. ఆర్సీబీ బౌలర్లలో సోఫి డెవిన్‌, జార్జియా వేర్‌హామ్, శ్రేయాంకా పాటిల్‌ ఒక్కో వికెట్ తీశారు.  ఈగెలుపుతో ఆడిన నాలుగు మ్యాచుల్లో ముంబయి మూడింటిలో నెగ్గి 6 పాయింట్లతో పట్టికలో రెండో స్థానంలో కొనసాగుతోంది.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Lagacherla News: వచ్చేది ఫార్మా ఇండస్ట్రీ కాదు, ఇండస్ట్రియల్ అండ్‌ టెక్స్‌టైల్ పార్కు- లగచర్ల వివాదంలో భారీ ట్విస్ట్
వచ్చేది ఫార్మా ఇండస్ట్రీ కాదు, ఇండస్ట్రియల్ అండ్‌ టెక్స్‌టైల్ పార్కు- లగచర్ల వివాదంలో భారీ ట్విస్ట్
Nara Rammurthy Naidu: సోదరుని పాడె మోసిన సీఎం చంద్రబాబు - అధికారిక లాంఛనాలతో రామ్మూర్తినాయుడు అంత్యక్రియలు పూర్తి
సోదరుని పాడె మోసిన సీఎం చంద్రబాబు - అధికారిక లాంఛనాలతో రామ్మూర్తినాయుడు అంత్యక్రియలు పూర్తి
Pushpa 2 Trailer: మాసు డోసు పెరిగింది బాసూ - ‘పుష్ప 2’ ట్రైలర్ రిలీజ్ - సినిమా ఈ రేంజ్ అయితే ‘బాహుబలి 2’ అవుట్!
మాసు డోసు పెరిగింది బాసూ - ‘పుష్ప 2’ ట్రైలర్ రిలీజ్ - సినిమా ఈ రేంజ్ అయితే ‘బాహుబలి 2’ అవుట్!
Actress Kasthuri: సినీ నటి కస్తూరికి 14 రోజుల రిమాండ్ - చెన్నై సెంట్రల్ జైలుకు తరలించిన పోలీసులు
సినీ నటి కస్తూరికి 14 రోజుల రిమాండ్ - చెన్నై సెంట్రల్ జైలుకు తరలించిన పోలీసులు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

సచ్చిపోదామని యాసిడ్ తాగినా!! ఇతని స్టోరీకి కన్నీళ్లు ఆగవు!బై నాన్నా.. వెక్కివెక్కి ఏడ్చిన నారా రోహిత్Nayanthara vs Dhanush Netflix Documentary | తమిళ్ సినీ ఇండస్ట్రీలో వివాదం..నయనతార vs ధనుష్ | ABP Desamరోహిత్ కి ధోని చేసిన మేలు, తిలక్ కి సూర్య చేస్తున్నాడు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Lagacherla News: వచ్చేది ఫార్మా ఇండస్ట్రీ కాదు, ఇండస్ట్రియల్ అండ్‌ టెక్స్‌టైల్ పార్కు- లగచర్ల వివాదంలో భారీ ట్విస్ట్
వచ్చేది ఫార్మా ఇండస్ట్రీ కాదు, ఇండస్ట్రియల్ అండ్‌ టెక్స్‌టైల్ పార్కు- లగచర్ల వివాదంలో భారీ ట్విస్ట్
Nara Rammurthy Naidu: సోదరుని పాడె మోసిన సీఎం చంద్రబాబు - అధికారిక లాంఛనాలతో రామ్మూర్తినాయుడు అంత్యక్రియలు పూర్తి
సోదరుని పాడె మోసిన సీఎం చంద్రబాబు - అధికారిక లాంఛనాలతో రామ్మూర్తినాయుడు అంత్యక్రియలు పూర్తి
Pushpa 2 Trailer: మాసు డోసు పెరిగింది బాసూ - ‘పుష్ప 2’ ట్రైలర్ రిలీజ్ - సినిమా ఈ రేంజ్ అయితే ‘బాహుబలి 2’ అవుట్!
మాసు డోసు పెరిగింది బాసూ - ‘పుష్ప 2’ ట్రైలర్ రిలీజ్ - సినిమా ఈ రేంజ్ అయితే ‘బాహుబలి 2’ అవుట్!
Actress Kasthuri: సినీ నటి కస్తూరికి 14 రోజుల రిమాండ్ - చెన్నై సెంట్రల్ జైలుకు తరలించిన పోలీసులు
సినీ నటి కస్తూరికి 14 రోజుల రిమాండ్ - చెన్నై సెంట్రల్ జైలుకు తరలించిన పోలీసులు
BRS BJP Alliance: బీఆర్‌ఎస్‌తో పొత్తుపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు- మూసీ ప్రక్షాళన ఆపేందుకు బీజేపీ బస్తీ నిద్ర
బీఆర్‌ఎస్‌తో పొత్తుపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు- మూసీ ప్రక్షాళన ఆపేందుకు బీజేపీ బస్తీ నిద్ర
Crime News: పసికందు గుండె చీల్చిన కన్నతల్లి - తాంత్రిక విద్యలతో మళ్లీ బతికిస్తాననే మూఢ విశ్వాసం, జార్ఖండ్‌లో ఘోరం
పసికందు గుండె చీల్చిన కన్నతల్లి - తాంత్రిక విద్యలతో మళ్లీ బతికిస్తాననే మూఢ విశ్వాసం, జార్ఖండ్‌లో ఘోరం
Miss Universe 2024: విశ్వ సుందరిగా డెన్మార్క్ భామ - ఆ దేశ తొలి మహిళగా రికార్డు
విశ్వ సుందరిగా డెన్మార్క్ భామ - ఆ దేశ తొలి మహిళగా రికార్డు
TGPSC Group III: తెలంగాణలో గ్రూప్‌-3 పరీక్ష ప్రారంభం- అడ్రెస్ తప్పిన అభ్యర్థులను ఎగ్జామ్‌సెంటర్‌కు చేర్చిన పోలీసులు
తెలంగాణలో గ్రూప్‌-3 పరీక్ష ప్రారంభం- అడ్రెస్ తప్పిన అభ్యర్థులను ఎగ్జామ్‌సెంటర్‌కు చేర్చిన పోలీసులు
Embed widget