UPW-W vs DC-W, 1 Innings Highlight: దిల్లీ ఫైనల్ టార్గెట్ 139 - యూపీని దెబ్బకొట్టిన క్యాప్సీ, రాధా!
WPL 2023, UPW-W vs DC-W: విమెన్ ప్రీమియర్ లీగు ఆఖరి లీగు మ్యాచులో యూపీ వారియర్జ్ మోస్తరు స్కోరే చేసింది. 20 ఓవర్లు ఆడి 6 వికెట్ల నష్టానికి 138 పరుగులు చేసింది.
WPL 2023, UPW-W vs DC-W:
విమెన్ ప్రీమియర్ లీగు ఆఖరి లీగు మ్యాచులో యూపీ వారియర్జ్ మోస్తరు స్కోరే చేసింది. 20 ఓవర్లు ఆడి 6 వికెట్ల నష్టానికి 138 పరుగులు చేసింది. తాహిలా మెక్‌గ్రాత్ (58*; 32 బంతుల్లో 8x4, 2x6) మెరుపు హాఫ్ సెంచరీ చేసింది. కెప్టెన్ అలిసా హీలీ (36; 34 బంతుల్లో 4x4, 1x6) ఫర్వాలేదనిపించింది. అలిస్ క్యాప్సీ (3/26), రాధా యాదవ్ (2/28) తమ బౌలింగ్‌తో ప్రత్యర్థి పతనాన్ని శాసించారు. భాగస్వామ్యాలు నెలకొల్పకుండా అడ్డుకున్నారు. ఈ మ్యాచును త్వరగా ఫినిష్ చేస్తే దిల్లీ నేరుగా ఫైనల్ చేరుకుంటుంది.
.@UPWarriorz post 138/6 on the board!
— Women's Premier League (WPL) (@wplt20) March 21, 2023
The @DelhiCapitals chase is now underway!
Can they successfully chase this down❓a
Scorecard ▶️ https://t.co/r4rFmhENd7#TATAWPL | #UPWvDC pic.twitter.com/YJzNb3jxXm
బౌలర్లు భళా!
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన యూపీ వారియర్జ్‌ను దిల్లీ బౌలర్లు చక్కగా అడ్డుకున్నారు. కఠినమైన లెంగ్తుల్లో బంతులేసి పరుగుల్ని నియంత్రించారు. వికెట్లు పడగొట్టారు. విధ్వంసకర బ్యాటర్ అలీసా హేలీ ఓపెనింగ్‌కు వచ్చి పవర్ ప్లేలో బంతికో పరుగు చేయడమే ఇందుకు ఉదాహరణ. శ్వేతా షెరావత్ (19)తో కలిసి ఆమె తొలి వికెట్‌కు 30 పరుగుల భాగస్వామ్యం అందించింది. ఐదో ఓవర్లో శ్వేతను రాధా యాదవ్ ఔట్ చేసింది. క్యాప్సీ వేసిన 9.6వ బంతికి హీలీ స్టంపౌట్ అయింది. అప్పటికి స్కోరు 63. మరికాసేపటికే సిమ్రన్ (11)ను రాధా పెవిలియన్ పంపించింది.
For her impressive 3⃣-wicket haul for @DelhiCapitals, @AliceCapsey becomes our 🔝 performer from the first innings 👏🏻 #TATAWPL | #UPWvDC
— Women's Premier League (WPL) (@wplt20) March 21, 2023
A look at her bowling summary 🔽 pic.twitter.com/8ufUwwM6y7
మెక్‌గ్రాత్ సూపర్ ఫామ్!
ఆదుకుంటుందని భావించిన కిరన్ నవగిరె (2) జొనాసన్ బౌలింగ్‌లో స్టంపౌటైంది. దాంతో యూపీ 16 ఓవర్లకు 94/4తో స్ట్రాటజిక్ టైమౌట్‌కు వెళ్లింది. అయితే మరోవైపు తాహిలా మెక్‌గ్రాత్ తన ఫామ్ కొనసాగించింది. ఆచితూచి ఆడుతూనే దొరికిన బంతుల్ని బౌండరీకి పంపించింది. 30 బంతుల్లో హాఫ్ సెంచరీ బాదేసింది. ఆఖరి రెండు ఓవర్లలో ధనాధన్ షాట్లు ఆడింది. అంజలి (3)తో కలిసి 15 బంతుల్లో 33 పరుగుల భాగస్వామ్యంతో స్కోరును 138కి చేర్చింది. గ్రేస్ హ్యారిస్ లేని లోటు స్పష్టంగా కనిపించింది. దీప్తి శర్మ, ఎకిల్‌స్టోన్ సైతం స్టంపౌట్ అవ్వడం గమనార్హం.
That was a fine half-century from Tahlia Mcgrath 🙌🏻
— Women's Premier League (WPL) (@wplt20) March 21, 2023
She powers #UPW to a competitive total!
Follow the match ▶️ https://t.co/r4rFmhENd7#TATAWPL | #UPWvDC pic.twitter.com/XK28iEnONS