అన్వేషించండి

GG vs UPW: టాస్ లక్‌ గుజరాత్‌దే - తెలుగమ్మాయి ప్లేస్‌లో మరొకరు!

GG vs UPW: బ్రబౌర్న్‌ వేదికగా గుజరాత్‌ జెయింట్స్‌, యూపీ వారియర్జ్‌ తలపడుతున్నాయి. టాస్ గెలిచిన గుజరాత్‌ కెప్టెన్‌ స్నేహ రాణా తొలుత బ్యాటింగ్‌ ఎంచుకుంది.

GG vs UPW, WPL 2023: 

విమెన్‌ ప్రీమియర్ లీగులో 17వ మ్యాచ్‌ జరుగుతోంది. బ్రబౌర్న్‌ వేదికగా గుజరాత్‌ జెయింట్స్‌, యూపీ వారియర్జ్‌ తలపడుతున్నాయి. టాస్ గెలిచిన గుజరాత్‌ కెప్టెన్‌ స్నేహ రాణా తొలుత బ్యాటింగ్‌ ఎంచుకుంది. 'ఎండ కొడుతోంది. పిచ్ ఫ్లాట్‌గా ఉంది. మేఘనా స్థానంలో మోనికా పటేల్‌ను తీసుకున్నాం. ఇంతకు మించి ఆలోచనలు ఏం లేవు. మేం ఎలిమినేటర్‌ చేరాలంటే పెద్ద మార్జిన్‌తో గెలవాలి. ఏదేమైనా అమ్మాయిల్ని చూసి గర్వపడుతున్నా. ఈ మ్యాచులో మంచు ప్రభావం ఉండదు. బంతి వేగంగా వస్తుంది కాబట్టి మైదానంలో మేం చురుగ్గా ఉండాలి' అని స్నేహ రాణా తెలిపింది.

'టాస్‌ ఓడినందుకు బాధేం లేదు. తొలుత బౌలింగ్‌ చేసి పరిస్థితులకు అలవాటు పడతాం. ఈ వికెట్‌పై ఇది మూడో మ్యాచ్‌. స్పిన్నర్లు ముందుగానే బౌలింగ్‌ చేయాల్సి ఉంటుంది. ఆరంభంలోనే కొన్ని వికెట్లు తీస్తామన్న నమ్మకం ఉంది. జట్టులో మార్పుల్లేవ్‌' అని యూపీ వారియర్జ్‌ సారథి అలీసా హేలీ తెలిపింది.

తుది జట్లు

గుజరాత్‌ జెయింట్స్‌: సోఫీ డంక్లీ, లారా, హర్లీన్‌ డియోల్‌,  యాష్లే గార్డ్‌నర్‌, సుష్మా వర్మ, దయాలన్ హేమలత, అశ్వనీ, స్నేహ రాణా, తనుజా కన్వార్‌, కిమ్‌ గార్త్‌, మోనికా పటేల్‌

యూపీ వారియర్జ్‌: దేవికా వైద్య, అలీసా హీలీ, కిరన్‌ నవగిరె, గ్రేస్‌ హ్యారిస్‌, తాలియా మెక్‌గ్రాత్‌, సిమ్రన్‌ షేక్‌, దీప్తి శర్మ, సోఫీ ఎకిల్‌స్టోన్‌, శ్వేతా షెరావత్‌, అంజలి శర్వాణి, రాజేశ్వరీ గైక్వాడ్‌

సమతూకం కుదిరింది!

యూపీ వారియర్జ్‌ ఆరు మ్యాచులాడి 3 గెలిచి 3 ఓడింది. 6 పాయింట్లతో పట్టికలో మూడో స్థానంలో ఉంది. ఈ మ్యాచ్‌ గెలిస్తే వారు ప్లేఆఫ్‌కు మరింత చేరువ అవుతారు. ఒకవేళ ఓడినా మరో మ్యాచ్‌లో అవకాశం ఉంటుంది. లీగులోనే అత్యంత పటిష్ఠమైన స్పిన్‌ డిపార్ట్‌మెంట్‌ వీరి సొంతం. సోఫీ ఎకిల్‌స్టోన్‌, దీప్తి శర్మ, రాజేశ్వరీ గైక్వాడ్‌ త్రయం ప్రత్యర్థికి చుక్కలు చూపిస్తోంది. ఓపెనింగ్‌లో అలీసా హేలీ, దేవికా వైద్య ఇంకా మెరుగ్గా ఆడాలి. తాహిలా మెక్‌గ్రాత్‌, గ్రేస్‌ హ్యారిస్‌ మిడిలార్డర్లో క్లిక్‌ అయ్యారు. కిరన్ నవగిరె నిలిస్తే బీభత్సమే! అంజలి శర్వాణీ, సిమ్రన్‌ షేక్‌ బౌలింగ్‌ ఫర్వాలేదు. హ్యారిస్‌ అద్భుతమైన పేస్‌తో వికెట్లు పడగొడుతోంది. సోఫీ ఎకిల్‌స్టోన్‌ ఫినిషర్‌గా రెచ్చిపోతోంది. అయితే పవర్‌ప్లేలో యూపీ స్కోరింగ్‌ రేట్‌ అస్సలు బాగాలేదు. పైగా వికెట్లూ తీయడం లేదు.

ఆఖరి మ్యాచ్‌!

ప్లేఆఫ్‌ ఆశలు సజీవంగా ఉండాలంటే గుజరాత్‌ అద్భుతాలే చేయాలి! యూపీ వారియర్స్‌ను 100 తేడాతో ఓడించాలి. అప్పటికీ దిల్లీ చేతిలో యూపీ 112 తేడాతో ఓడిపోవాలని ప్రార్థించాలి. పైగా ఆర్సీబీ పోటీ నుంచి తప్పుకోవాలి. ఇవన్నీ జరిగేవి కావు! పైగా జైత్రయాత్ర సాగిస్తున్న ముంబయిని ఓడించిన యూపీని పడగొట్టడం సులభం కాదు. పిచ్‌లు నెమ్మదించడంతో ప్రత్యర్థి స్పిన్నర్లతో వీరికి ప్రమాదమే! గుజరాత్‌లో యాష్లే గార్డ్‌నర్‌ ఒక్కరే స్థాయికి తగ్గట్టు ఆడుతోంది. బౌలింగ్‌, బ్యాటింగ్‌లో దుమ్మురేపుతోంది. సోఫీయా డాంక్లీ, లారా వూల్‌వర్ట్‌ రూపంలో జెయింట్స్‌కు ఆలస్యంగా ఓపెనింగ్‌ పాట్నర్స్‌ దొరికారు. మేఘన ఇంకా ఇబ్బంది పడుతోంది. హర్లీన్‌ డియోల్‌ మాత్రమే అన్ని మ్యాచుల్లో కన్‌సిస్టెంట్‌గా బ్యాటింగ్‌ చేస్తోంది. హేమలత ఎప్పుడూ ఒత్తిడిలోనే వస్తోంది. కిమ్‌ గార్త్‌ పేస్‌ బౌలింగ్‌ మాత్రం అదుర్స్‌.  ఆమెకు సరైన పేస్‌ బౌలింగ్‌ పాట్నర్‌ లేదు. మంచి స్పిన్నర్లే ఉన్నా వికెట్లు తీయడం లేదు. ఓవర్‌కు 9.35 ఎకానమీతో పరుగులు ఇచ్చేస్తోంది జెయింట్స్‌.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Tamil Nadu Politics: మళ్లీ ఎన్డీఏలోకి అన్నాడీఎంకే - విజయ్‌కు ఒంటరిపోరే గతి - తమిళనాడు రాజకీయాల్లో కీలక మార్పులు
మళ్లీ ఎన్డీఏలోకి అన్నాడీఎంకే - విజయ్‌కు ఒంటరిపోరే గతి - తమిళనాడు రాజకీయాల్లో కీలక మార్పులు
KTR On HCU: హెచ్‌సీయూ భూముల తాకట్టులో భారీ స్కాం - బీజేపీ ఎంపీ ప్రమేయం - కేటీఆర్ తీవ్ర ఆరోపణలు
హెచ్‌సీయూ భూముల తాకట్టులో భారీ స్కాం - బీజేపీ ఎంపీ ప్రమేయం - కేటీఆర్ తీవ్ర ఆరోపణలు
YS Sharmila: భారతి రెడ్డి మీద అసభ్యకర వ్యాఖ్యలు బాధాకరం, వాళ్లను ఉరితీసినా తప్పులేదన్న వైఎస్ షర్మిల
భారతి రెడ్డి మీద అసభ్యకర వ్యాఖ్యలు బాధాకరం, వాళ్లను ఉరితీసినా తప్పులేదన్న వైఎస్ షర్మిల
TTD News: సమ్మర్‌లో శ్రీవారి దర్శనానికి వెళ్లాలనుకుంటున్నారా ? - ఇదిగో ప్రత్యేక రైళ్ల జాబితా - టిక్కెట్లు బుక్ చేస్కోండి
సమ్మర్‌లో శ్రీవారి దర్శనానికి వెళ్లాలనుకుంటున్నారా ? - ఇదిగో ప్రత్యేక రైళ్ల జాబితా - టిక్కెట్లు బుక్ చేస్కోండి
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

RCB Home Ground Sad Story IPL 2025 | సొంత మైదానంలోనే ఆర్సీబీకి షాకులుKL Rahul 93* vs RCB IPL 2025 | కేఎల్ రాహుల్ మాస్ ఇన్నింగ్స్ కు అసలు రీజన్ ఇదేKL Rahul Strong Statement | RCB vs DC మ్యాచ్ లో వీర విజృంభణ తర్వాత కేఎల్ రాహుల్ మాస్RCB vs DC Match Highlights IPL 2025 | ఆర్సీబీపై 6 వికెట్ల తేడాతో ఢిల్లీ జయభేరి | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tamil Nadu Politics: మళ్లీ ఎన్డీఏలోకి అన్నాడీఎంకే - విజయ్‌కు ఒంటరిపోరే గతి - తమిళనాడు రాజకీయాల్లో కీలక మార్పులు
మళ్లీ ఎన్డీఏలోకి అన్నాడీఎంకే - విజయ్‌కు ఒంటరిపోరే గతి - తమిళనాడు రాజకీయాల్లో కీలక మార్పులు
KTR On HCU: హెచ్‌సీయూ భూముల తాకట్టులో భారీ స్కాం - బీజేపీ ఎంపీ ప్రమేయం - కేటీఆర్ తీవ్ర ఆరోపణలు
హెచ్‌సీయూ భూముల తాకట్టులో భారీ స్కాం - బీజేపీ ఎంపీ ప్రమేయం - కేటీఆర్ తీవ్ర ఆరోపణలు
YS Sharmila: భారతి రెడ్డి మీద అసభ్యకర వ్యాఖ్యలు బాధాకరం, వాళ్లను ఉరితీసినా తప్పులేదన్న వైఎస్ షర్మిల
భారతి రెడ్డి మీద అసభ్యకర వ్యాఖ్యలు బాధాకరం, వాళ్లను ఉరితీసినా తప్పులేదన్న వైఎస్ షర్మిల
TTD News: సమ్మర్‌లో శ్రీవారి దర్శనానికి వెళ్లాలనుకుంటున్నారా ? - ఇదిగో ప్రత్యేక రైళ్ల జాబితా - టిక్కెట్లు బుక్ చేస్కోండి
సమ్మర్‌లో శ్రీవారి దర్శనానికి వెళ్లాలనుకుంటున్నారా ? - ఇదిగో ప్రత్యేక రైళ్ల జాబితా - టిక్కెట్లు బుక్ చేస్కోండి
AP Inter Results 2025: ఏపీ ఇంటర్ ఫలితాలపై మంత్రి నారా లోకేష్ కీలక ప్రకటన, రిజల్ట్స్ ఎప్పుడంటే
ఏపీ ఇంటర్ ఫలితాలపై మంత్రి నారా లోకేష్ కీలక ప్రకటన, రిజల్ట్స్ ఎప్పుడంటే
Hyderabad Traffic: హైదరాబాద్‌వాసులకు బిగ్‌ అలర్ట్‌- శనివారం హనుమాన్‌ విజయ యాత్ర సందర్భంగా ట్రాఫిక్ డైవర్షన్ రూట్స్ ఇవే
హైదరాబాద్‌వాసులకు బిగ్‌ అలర్ట్‌- శనివారం హనుమాన్‌ విజయ యాత్ర సందర్భంగా ట్రాఫిక్ డైవర్షన్ రూట్స్ ఇవే
TamilNadu Minister: హిందూ దేవతల్ని ఘోరంగా అవమానించిన తమిళనాడు మంత్రి - దేవుళ్లంటే ఇంత అలుసా ? వీడియో
హిందూ దేవతల్ని ఘోరంగా అవమానించిన తమిళనాడు మంత్రి - దేవుళ్లంటే ఇంత అలుసా ? వీడియో
Hit and Run Case: హైదరాబాద్‌లో హిట్ అండ్ రన్, బీఫార్మసీ విద్యార్థిని మృతి- నిందితుడ్ని చాకచక్యంగా పట్టుకున్న పోలీసులు
హైదరాబాద్‌లో హిట్ అండ్ రన్, బీఫార్మసీ విద్యార్థిని మృతి- నిందితుడ్ని చాకచక్యంగా పట్టుకున్న పోలీసులు
Embed widget