News
News
X

WPL 2023, RCB-W vs GG-W: మెగ్‌గ్రాత్‌ చితక్కొట్టినా సరిపోని పోరాటం - యూపీపై డీసీదే గెలుపు!

WPL 2023, RCB-W vs GG-W: విమెన్‌ ప్రీమియర్‌ లీగులో దిల్లీ క్యాపిటల్స్‌ వరుసగా రెండో గెలుపు అందుకుంది. 212 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన యూపీ వారియర్జ్‌ను 169/5 కి పరిమితం చేసింది.

FOLLOW US: 
Share:

WPL 2023, RCB-W vs GG-W: 

విమెన్‌ ప్రీమియర్‌ లీగులో దిల్లీ క్యాపిటల్స్‌ వరుసగా రెండో గెలుపు అందుకుంది. తనకు తానే సాటి అని నిరూపించుకుంది. 212 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన యూపీ వారియర్జ్‌ను 169/5 కి పరిమితం చేసింది. ఏకంగా 42 పరుగుల తేడాతో ప్రత్యర్థిని చిత్తు చేసింది. ఆల్‌రౌండర్‌ జెస్‌ జొనాసెన్‌ (42*; 20 బంతుల్లో 3x4, 3x6), (3/43) బ్యాటింగ్‌, బౌలింగ్‌తో ప్రత్యర్థి పతనాన్ని శాసించింది. తాహిలా మెక్‌గ్రాత్‌ (90*; 50 బంతుల్లో 11x4, 4x6) ఒంటరి పోరాటం చేసినా తన జట్టును గెలిపించలేకపోయింది. అంతకు ముందు దిల్లీలో కెప్టెన్‌ మెగ్‌ లానింగ్‌ (70; 42 బంతుల్లో 10x4, 3x6) హాఫ్ సెంచరీ బాదేసింది. జెమీమా రోడ్రిగ్స్‌ (34*; 22 బంతుల్లో 4x4, 0x6) కీలక ఇన్నింగ్స్‌ ఆడింది.

మెక్‌గ్రాత్‌ లేకుంటే..!

కొండంత లక్ష్య ఛేదనకు దిగిన యూపీ వారియర్జ్‌కు శుభారంభం దక్కలేదు. జట్టు స్కోరు 29 వద్దే కెప్టెన్‌ అలీసా హేలీ (24; 17 బంతుల్లో 5x4) వికెట్‌ చేజార్చుకుంది. వరుస బౌండరీలతో విరుచుకుపడ్డ ఆమెను జొనాసెన్‌ ఔట్‌ చేసింది. మరో 2 పరుగులకే కిరన్‌ నవగిరె (2)నూ పెవిలియన్‌కు పంపింది. అదే స్కోరు వద్ద శ్వేత షెరావత్‌ (1)ను మారిజానె కాప్‌ను ఔట్‌ చేసింది. పవర్‌ప్లే ముగిసే సరికి 33/3తో కష్టాల్లో పడ్డ యూపీని దీప్తి శర్మ (12), తాహిలా మెక్‌గ్రాత్‌ ఆదుకున్నారు. 35 బంతుల్లో 40 పరుగుల భాగస్వామ్యం అందించారు.

జట్టు స్కోరు 71 వద్ద దీప్తిని ఔట్‌ చేసిన శిఖా పాండే ఈ జోడీని విడదీసింది. ఈ క్రమంలో యువ క్రికెటర్‌ దేవికా వైద్య (23; 21 బంతుల్లో 2x4) కలిసి మెక్‌గ్రాత్‌ పోరాడింది. ఐదో వికెట్‌కు 40 బంతుల్లో 49 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పంది. అయితే 16.5వ బంతికి వైద్యను జొనాసెన్‌ ఔట్‌ చేసింది. అప్పటికి స్కోరు 120/5. దాంతో గెలుపు సమీకరణం 18 బంతుల్లో 92గా మారింది. కాగా బౌండరీలు, సిక్సర్లు బాదేసిన మెగ్‌గ్రాత్‌ ఓటమి అంతరాన్ని బాగా తగ్గించింది. జట్టు స్కోరును 169/5కు చేర్చింది.

దంచికొట్టిన లానింగ్‌!

టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన దిల్లీ క్యాపిటల్స్‌కు శుభారంభం దక్కింది. తొలి రెండు ఓవర్లు పరిస్థితులకు అలవాటు పడ్డ ఓపెనర్లు మెగ్‌ లానింగ్‌, షెఫాలీ వర్మ (17) ఆ తర్వాత దూకుడు పెంచారు. షెఫాలీ కాస్త కుదురుగా ఆడగా లానింగ్‌ మాత్రం వరుస బౌండరీలతో చెలరేగింది. అందివచ్చిన బంతుల్ని సిక్సర్లుగా మలిచింది. దాంతో పవర్‌ప్లే ముగిసే సరికి డీసీ 62/0తో నిలిచింది. జట్టు స్కోరు 67 వద్ద షెఫాలీనీ మెక్‌గ్రాత్‌ ఔట్‌ చేసినా మారిజానె కాప్‌ (16) ధనాధన్‌ ఇన్నింగ్సే ఆడింది.

దుమ్మురేపిన జొనాసెన్‌

లానింగ్‌ 32 బంతుల్లో హాఫ్ సెంచరీ అందుకోవడంతో 10.4 ఓవర్లకు స్కోరు 100కు చేరుకుంది. 10.2వ బంతికి కాప్‌ను ఎకిల్‌స్టోన్‌ ఔట్‌ చేసింది. సెంచరీ వైపు సాగిన లానింగ్‌ను 11.3 వద్ద రాజేశ్వరీ క్లీన్‌బౌల్డ్‌ చేసింది. అలిస్‌ కాప్సీ (21) కొన్ని షాట్లు ఆడి త్వరగానే ఔటైంది. ఈ క్రమంలో యూపీ బౌలర్లు దిల్లీ వేగానికి అడ్డుకట్ట వేసేందుకు ప్రయత్నించారు. అయితే జెమీమాతో కలిసి జెస్‌ జొనాసన్‌ విధ్వంసం సృష్టించింది. ఆఖరి రెండు ఓవర్లు కళ్లు చెదిరే సిక్సర్లు, బౌండరీలు దంచికొట్టింది. ఐదో వికెట్‌కు 34 బంతుల్లో 67 పరుగులు అజేయ భాగస్వామ్యాన్ని నెలకొల్పింది. జట్టు స్కోరును 211/4కు చేర్చింది.

Published at : 07 Mar 2023 11:12 PM (IST) Tags: Delhi Capitals Shafali Verma WPL Womens Premier League WPL 2023 UP Warriorz DCW vs UPWW Meg Lanning Deepti Sharma Alyssa Healy tahila mcgrath

సంబంధిత కథనాలు

Chris Gayle: క్రిస్ గేల్‌కు ఆర్సీబీ అరుదైన గౌరవం - విరాట్ కోహ్లీ ఏమన్నాడు?

Chris Gayle: క్రిస్ గేల్‌కు ఆర్సీబీ అరుదైన గౌరవం - విరాట్ కోహ్లీ ఏమన్నాడు?

MI vs DC Playing XI: మహిళల ప్రీమియర్ లీగ్ ఫైనల్లో తుదిజట్లు ఎలా ఉండనున్నాయి?

MI vs DC Playing XI: మహిళల ప్రీమియర్ లీగ్ ఫైనల్లో తుదిజట్లు ఎలా ఉండనున్నాయి?

DCW Vs MIW WPL 2023: ఫైనల్స్‌లో ప్లేస్ కోసం ముంబై, యూపీల మధ్య పోటీ - లైవ్ ఎక్కడ చూడచ్చంటే?

DCW Vs MIW WPL 2023: ఫైనల్స్‌లో ప్లేస్ కోసం ముంబై, యూపీల మధ్య పోటీ - లైవ్ ఎక్కడ చూడచ్చంటే?

Smriti Mandhana: టోర్నీలోనే ఖరీదైన ప్లేయర్ - పెర్ఫార్మెన్స్ మాత్రం అతి దారుణంగా!

Smriti Mandhana: టోర్నీలోనే ఖరీదైన ప్లేయర్ - పెర్ఫార్మెన్స్ మాత్రం అతి దారుణంగా!

Glenn Maxwell: బెంగళూరుకు బ్యాడ్ న్యూస్ - నెల రోజులు దూరం కానున్న మ్యాక్స్‌వెల్!

Glenn Maxwell: బెంగళూరుకు బ్యాడ్ న్యూస్ - నెల రోజులు దూరం కానున్న మ్యాక్స్‌వెల్!

టాప్ స్టోరీస్

BRS PLan : మహారాష్ట్రలో రెండో సభ - ఇతర రాష్ట్రాలను బీఆర్ఎస్ చీఫ్ లైట్ తీసుకుంటున్నారా ?

BRS PLan : మహారాష్ట్రలో రెండో సభ - ఇతర రాష్ట్రాలను బీఆర్ఎస్ చీఫ్ లైట్ తీసుకుంటున్నారా ?

BRS Leaders Fight : ఎల్బీనగర్ బీఆర్ఎస్ నేతల మధ్య వర్గపోరు, మంత్రి కేటీఆర్ సమక్షంలోనే ఘర్షణ

BRS Leaders Fight : ఎల్బీనగర్ బీఆర్ఎస్ నేతల మధ్య వర్గపోరు, మంత్రి కేటీఆర్ సమక్షంలోనే ఘర్షణ

Nara Rohit : రాజకీయాల్లోకి జూ.ఎన్టీఆర్ ? ఎంట్రీ ఎప్పుడో చెప్పిన నారా రోహిత్

Nara Rohit :  రాజకీయాల్లోకి జూ.ఎన్టీఆర్   ? ఎంట్రీ ఎప్పుడో చెప్పిన నారా రోహిత్

TTD News: ఏడుకొండల్లో పెరిగిన రద్దీ, వీకెండ్ వల్ల 26 కంపార్ట్మెంట్లల్లో భక్తులు - దర్శన సమయం ఎంతంటే

TTD News: ఏడుకొండల్లో పెరిగిన రద్దీ, వీకెండ్ వల్ల 26 కంపార్ట్మెంట్లల్లో భక్తులు - దర్శన సమయం ఎంతంటే