Women's Cricket World Cup: మరికాసేపట్లో భారత్ vs శ్రీలంక మ్యాచ్‌తో ప్రారంభం, షెడ్యూల్, జట్లు, ప్రైజ్ మనీ వివరాలు!
Women Cricket World Cup 2025: మహిళా ప్రపంచ కప్ ఇవాల్టి నుంచే ప్రారంభమవుతోంది. భారత్ శ్రీలంక మ్యాచ్ మధ్యాహ్నం ప్రారంభం అవుతుంది. షెడ్యూల్, వేదికలు, ప్రైజ్‌మనీ వంటి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.

Women's Cricket World Cup: మహిళల వన్డే ప్రపంచ కప్ 2025 ఈరోజు భారత్ వర్సెస్ శ్రీలంక (Ind Vs SL) మ్యాచ్‌తో ప్రారంభం కానుంది. ప్రపంచంలోని 8 అత్యంత బలమైన జట్ల మధ్య టైటిల్ కోసం పోటీ ఉంటుంది. మొత్తం 31 మ్యాచ్‌లు జరుగుతాయి. భారత్‌తో పాటు శ్రీలంక కూడా ఆతిథ్యం ఇస్తోంది. ఇక్కడ మీకు టోర్నమెంట్‌కు సంబంధించిన పూర్తి సమాచారం ఉంటుంది. మహిళల ప్రపంచ కప్ షెడ్యూల్, అన్ని జట్ల స్క్వాడ్, వేదిక, ఫార్మాట్, ప్రైజ్ మనీ, లైవ్ టెలికాస్ట్ మరియు లైవ్ స్ట్రీమింగ్ వివరాలు ఇక్కడ ఇచ్చాం.
మహిళల వన్డే ప్రపంచ కప్ 2025 సెప్టెంబర్ 30న ప్రారంభమై నవంబర్ 2న ఫైనల్ మ్యాచ్‌తో ముగుస్తుంది. భారత్‌లోని 4 నగరాలతో పాటు శ్రీలంకలోని కొలంబోలో ఉన్న 5 స్టేడియాలలో టోర్నమెంట్ మ్యాచ్‌లు జరుగుతాయి. పాకిస్తాన్ తమ అన్ని మ్యాచ్‌లను శ్రీలంకలో ఆడనుంది. అక్టోబర్ 5న జరిగే భారత్-పాకిస్తాన్ మ్యాచ్ కూడా కొలంబోలోని ఆర్ ప్రేమదాస స్టేడియంలో జరుగుతుంది. పాకిస్తాన్ మహిళల క్రికెట్ జట్టు ఫైనల్‌కు చేరుకుంటే, టైటిల్ మ్యాచ్ కూడా శ్రీలంకలో జరుగుతుంది.

మహిళల ODI ప్రపంచ కప్ 2025 ఫార్మాట్
మహిళల క్రికెట్ ప్రపంచ కప్ 2025 రౌండ్-రాబిన్ ఫార్మాట్‌లో జరుగుతుంది. ఆ తర్వాత టాప్ 4 జట్లు నాకౌట్ దశకు చేరుకుంటాయి ..మిగిలిన 4 జట్లు నిష్క్రమిస్తాయి. రౌండ్-రాబిన్ ఫార్మాట్ కింద, ప్రతి జట్టు టోర్నమెంట్‌లోని ఇతర జట్లతో 1-1 మ్యాచ్ ఆడుతుంది, అంటే ఒక జట్టు మొత్తం 7 మ్యాచ్‌లు ఆడుతుంది. పాయింట్ల పట్టికలో టాప్ 4 జట్లు సెమీ-ఫైనల్స్ ఆడతాయి.
మహిళల వన్డే ప్రపంచ కప్ 2025 జట్లు
భారత్, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, శ్రీలంక, బంగ్లాదేశ్, పాకిస్తాన్.
మహిళల వన్డే ప్రపంచ కప్ 2025 వేదిక
డివై పాటిల్ స్టేడియం (నవీ ముంబై)
అస్సాం క్రికెట్ అసోసియేషన్ స్టేడియం (గువాహటి)
ACA-VDCA స్టేడియం (విశాఖపట్నం)
హోల్కర్ స్టేడియం (ఇండోర్)
ఆర్ ప్రేమదాస స్టేడియం (కొలంబో)
మహిళల వన్డే ప్రపంచ కప్ 2025 పూర్తి షెడ్యూల్
సెప్టెంబర్ 30, మంగళవారం: భారత్ vs శ్రీలంక (గువాహటి)
అక్టోబర్ 1, బుధవారం: ఆస్ట్రేలియా vs న్యూజిలాండ్ (ఇండోర్)
అక్టోబర్ 2, గురువారం: బంగ్లాదేశ్ vs పాకిస్తాన్ (కొలంబో)
అక్టోబర్ 3, శుక్రవారం: ఇంగ్లాండ్ vs దక్షిణాఫ్రికా (గువాహటి)
అక్టోబర్ 4, శనివారం: శ్రీలంక vs ఆస్ట్రేలియా (కొలంబో)
అక్టోబర్ 5, ఆదివారం: భారత్ vs పాకిస్తాన్ (కొలంబో)
అక్టోబర్ 6, సోమవారం: న్యూజిలాండ్ vs దక్షిణాఫ్రికా (ఇండోర్)
అక్టోబర్ 7, మంగళవారం: బంగ్లాదేశ్ vs ఇంగ్లాండ్ (గువాహటి)
అక్టోబర్ 8, బుధవారం: ఆస్ట్రేలియా vs పాకిస్తాన్ (కొలంబో)
అక్టోబర్ 9, గురువారం: భారత్ vs దక్షిణాఫ్రికా (విశాఖపట్నం)
అక్టోబర్ 10, శుక్రవారం: బంగ్లాదేశ్ vs న్యూజిలాండ్ (గువాహటి)
అక్టోబర్ 11, శనివారం: శ్రీలంక vs ఇంగ్లాండ్ (కొలంబో)
అక్టోబర్ 12, ఆదివారం: భారత్ vs ఆస్ట్రేలియా (విశాఖపట్నం)
అక్టోబర్ 13, సోమవారం: బంగ్లాదేశ్ vs దక్షిణాఫ్రికా (విశాఖపట్నం)
అక్టోబర్ 14, మంగళవారం: శ్రీలంక vs న్యూజిలాండ్ (కొలంబో)
అక్టోబర్ 15, బుధవారం: ఇంగ్లాండ్ vs పాకిస్తాన్ (కొలంబో)
అక్టోబర్ 16, గురువారం: ఆస్ట్రేలియా vs బంగ్లాదేశ్ (విశాఖపట్నం)
అక్టోబర్ 17, శుక్రవారం: శ్రీలంక vs దక్షిణాఫ్రికా (కొలంబో)
అక్టోబర్ 18, శనివారం: న్యూజిలాండ్ vs పాకిస్తాన్ (కొలంబో)
అక్టోబర్ 19, ఆదివారం: భారత్ vs ఇంగ్లాండ్ (ఇండోర్)
అక్టోబర్ 20, సోమవారం: బంగ్లాదేశ్ vs శ్రీలంక (నవీ ముంబై)
అక్టోబర్ 21, మంగళవారం: పాకిస్తాన్ vs దక్షిణాఫ్రికా (కొలంబో)
అక్టోబర్ 22, బుధవారం: ఆస్ట్రేలియా vs ఇంగ్లాండ్ (ఇండోర్)
అక్టోబర్ 23, గురువారం: భారత్ vs న్యూజిలాండ్ (నవీ ముంబై)
అక్టోబర్ 24, శుక్రవారం: శ్రీలంక vs పాకిస్తాన్ (కొలంబో)
అక్టోబర్ 25, శనివారం: ఆస్ట్రేలియా vs దక్షిణాఫ్రికా (ఇండోర్)
అక్టోబర్ 26, ఆదివారం: ఇంగ్లాండ్ vs న్యూజిలాండ్ (విశాఖపట్నం)
అక్టోబర్ 26, ఆదివారం: భారత్ vs బంగ్లాదేశ్ (నవీ ముంబై)
అక్టోబర్ 29, బుధవారం: సెమీ-ఫైనల్ 1 (క్వాలిఫికేషన్ ఆధారంగా)
అక్టోబర్ 30, గురువారం: సెమీ-ఫైనల్ 2 (క్వాలిఫికేషన్ ఆధారంగా)
నవంబర్ 2, ఆదివారం: ఫైనల్ (క్వాలిఫికేషన్ ఆధారంగా)
మహిళల ప్రపంచ కప్ 2025లోని 8 జట్ల స్క్వాడ్
భారత్: హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్) HarmanPreet Kaur, స్మృతి మంధాన (వైస్-కెప్టెన్) Smriti Mandhana, ప్రతీకా రావల్, హర్లీన్ డియోల్, జెమీమా రోడ్రిగ్స్, రిచా ఘోష్, ఉమా ఛెత్రి, రేణుకా సింగ్ ఠాకూర్, దీప్తి శర్మ, స్నేహ్ రాణా, శ్రీ చరణి, రాధా యాదవ్, అమన్‌జోత్ కౌర్, అరుణ్‌ధతి రెడ్డి, క్రాంతి గౌడ్.
రిజర్వ్ ఆటగాళ్లు: తేజల్ హస్బనిస్, ప్రేమా రావత్, ప్రియా మిశ్రా, మిన్ను మణి, సయాలి సత్ఘరే.
ఆస్ట్రేలియా: అలిస్సా హీలీ (కెప్టెన్), డార్సీ బ్రౌన్, ఆష్ గార్డనర్, కిమ్ గార్త్, హీథర్ గ్రాహం, అలానా కింగ్, ఫోయెబ్ లిచ్‌ఫీల్డ్, తహ్లియా మెక్‌గ్రాత్, సోఫీ మోలినక్స్, బెత్ మూనీ, అలిస్ పెర్రీ, మేగన్ షట్, అన్నబెల్ సదర్‌ల్యాండ్, జార్జియా వోల్, జార్జియా వేర్‌హమ్.
బంగ్లాదేశ్: నిగర్ సుల్తానా జోటి (కెప్టెన్), నహిదా అక్తర్, ఫర్జానా హక్, రుబ్యా హైదర్ జెలిక్, షర్మిన్ అక్తర్ సుప్తా, శోభనా మోస్తరి, రితు మోని, శోర్నా అక్తర్, ఫాహిమా ఖాటూన్, రాబేయా ఖాన్, మారుఫా అక్తర్, ఫరిహా ఇస్లాం త్రిస్నా, షాంజిదా అక్తర్ మాఘలా, నిషితా అక్తర్ నిషి, సుమయ్య అక్తర్
ఇంగ్లాండ్: నాట్ సివర్-బ్రంట్ (కెప్టెన్), ఎం అర్లాట్, టామీ బ్యూమాంట్, లారెన్ బెల్, అలిస్ కాప్సీ, చార్లీ డీన్, సోఫియా డంక్లీ, సోఫీ ఎక్లెస్టోన్, లారెన్ ఫైలర్, సారా గ్లెన్, ఎమీ జోన్స్, హీథర్ నైట్, ఎమ్మా లాంబ్, లిన్సే స్మిత్, డానీ వ్యాట్-హాడ్జ్.
న్యూజిలాండ్: సోఫీ డివైన్ (కెప్టెన్), సూజీ బేట్స్, ఈడెన్ కార్సన్, ఫ్లోరా డెవోన్‌షైర్, ఇజీ గేజ్, మాడీ గ్రీన్, బ్రూక్ హాలిడే, బ్రీ ఇల్లింగ్, పాలీ ఇంగ్లిస్, బెల్లా జేమ్స్, మెలీ కెర్, జెస్ కెర్, రోజ్‌మేరీ మేయర్, జార్జియా ప్లిమర్, లీ తహుహు.
పాకిస్తాన్: ఫాతిమా సనా (కెప్టెన్), మునీబా అలీ సిద్దిఖీ (వైస్-కెప్టెన్), ఆలియా రియాజ్, డైయానా బేగ్, ఎమాన్ ఫాతిమా, నష్రా సుంధు, నటాలియా పర్వేజ్, ఒమైమా సోహైల్, రమీన్ షమీమ్, సదాఫ్ షమాస్, సాదియా ఇక్బాల్, షావల్ జుల్ఫికర్, సిద్రా అమీన్, సిద్రా నవాజ్, సయ్యదా అరూబ్ షా.
రిజర్వ్: గుల్ ఫిరోజా, నజీహా అల్వి, తుబా హసన్, ఉమ్-ఎ-హాని, వహిదా అక్తర్.
దక్షిణాఫ్రికా: లారా వోల్వార్డ్ట్ (కెప్టెన్), అయబొంగా ఖాకా, క్లో ట్రయాన్, నాడిన్ డి క్లార్క్, మారిజాన్ కాప్, తాజ్మిన్ బ్రిట్స్, సినలో జాఫ్తా, నోన్‌కులెకో మ్లాబా, ఎనెరీ డర్క్సన్, ఎనెకే బాష్, మసబాతా క్లాస్, సునే లూస్, కరాబో మెసో, తుమి సెఖుఖునే, నోండుమిసో షంగాసే.
రిజర్వ్: మియాన్ స్మిత్.
శ్రీలంక: చమారి అథపత్తు, హసిని పెరీరా, విషమి గుణరత్నే, హర్షితా సమరవిక్రమ, కవిషా దిల్హారి, నీలాక్షి సిల్వా, అనుష్క సంజీవని, ఇమేషా దులాని, దేవమీ విహంగా, పియమీ వాత్సల, ఇనోకా రణవీరా, సుగంధికా దసనాయక, ఉదేశికా ప్రభోదాని, మల్కి మదారా, అచిని కులసూర్య.
రిజర్వ్: ఇనోషి ఫెర్నాండో.
మహిళల ప్రపంచ కప్ 2025 ప్రైజ్ మనీ జాబితా
విజేత: 4,480,000 డాలర్లు
రన్నర్-అప్: 2,240,000 డాలర్లు
సెమీ-ఫైనలిస్ట్: 1,120,000 డాలర్లు
5వ మరియు 6వ స్థానంలో ఉన్న జట్టు: 700,000 డాలర్లు
7వ మరియు 8వ స్థానంలో ఉన్న జట్టు: 280,000 డాలర్లు
మహిళల ప్రపంచ కప్ 2025 మ్యాచ్‌ల ప్రత్యక్ష ప్రసారం ఏ ఛానెల్‌లో వస్తుంది?
Where to Watch Women Cricket World Cup 2025..?
మహిళల వన్డే ప్రపంచ కప్ 2025 బ్రాడ్‌కాస్ట్ భాగస్వామి స్టార్ స్పోర్ట్స్, జియోహోట్‌స్టార్. ప్రత్యక్ష ప్రసారం స్టార్ స్పోర్ట్స్ ఛానెల్‌లో వస్తుంది.
మహిళల ప్రపంచ కప్ 2025 మ్యాచ్‌ల లైవ్ స్ట్రీమింగ్ ఎక్కడ జరుగుతుంది?
జియోహోట్‌స్టార్‌లో మహిళల ప్రపంచ కప్ 2025 మ్యాచ్‌ల లైవ్ స్ట్రీమింగ్ జరుగుతుంది.




















