Viral Video : రోహిత్ శర్మ కారుకు ఏమైందీ? తమ్ముడిని అందరి ముందు ఎందుకు తిట్టాడు?
Rohit Sharma : వాంఖడే స్టేడియంలో రోహిత్ శర్మ పేరు మీద ప్రత్యేక స్టాండ్ నిర్మించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న రోహిత్ శర్మ ఆఖరిలో తన తమ్ముడిని తిట్టడం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Rohit Sharma scolds his younger brother: రోహిత్ శర్మ తన టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్ అయిన తర్వాత కూడా నిరంతరం వార్తల్లో ఉంటున్నాడు. శుక్రవారం ముంబైలోని వాంఖడే స్టేడియంలో రోహిత్ శర్మ స్టాండ్‌ను ప్రారంభించారు. ఈ సన్మాన కార్యక్రమంలో రోహిత్ తల్లిదండ్రులు, భార్య రితికా సజ్దే కూడా వేదికపై ఉన్నారు. అలాగే ఆ కార్యక్రమంలో తమ్ముడు విశాల్ కూడా ఉన్నాడు. ఇప్పటి వరకు ఈ కార్యక్రమంలో భావోద్వేగానికి గురైన భార్య వీడియోతోపాటు మరో వీడియో వైరల్ అవుతోంది, దీనిలో రోహిత్ తన తమ్ముడిని మందలిస్తున్నట్లుగా ఉంది.
ఇది కారుకు డెంట్ వచ్చిన ఘటనకు సంబంధించినదని తెలుస్తోంది. రోహిత్ డెంట్‌ను చూపిస్తూ తన తమ్ముడు విశాల్‌ను, "ఇదేంటి?" అని అడిగాడు. విశాల్ "రివర్స్" అని సమాధానం చెప్పగానే, రోహిత్ శర్మ ఆయన మాటను అడ్డుకుంటూ, "ఎవరిది? నీ వల్లనా?" అన్నాడు. ఈ ఘటన తర్వాత రోహిత్ శర్మ తన కుటుంబాన్ని కారులో ఎక్కించుకుని వెళ్ళిపోయాడు. రోహిత్ శర్మ ప్రపంచ స్థాయి క్రికెట్ ఆటగాడు కావడంతో పాటు కార్లంటే చాలా ఇష్టం. వాంఖడే స్టేడియం నుంచి వచ్చిన ఈ వైరల్ వీడియో అందుకు నిదర్శనంగా నిలుస్తోంది.
Rohit Sharma lost his cool and scolded his younger brother after he accidentally damaged Rohit’s car while reversing. Furious, Rohit 🗣️ “Can’t you see? Where the hell is your brain?!” pic.twitter.com/GtVLJ2N9n7
— Vipin Tiwari (@Vipintiwari952) May 17, 2025
రోహిత్ శర్మ భార్య రితికా భావోద్వేగం
వాంఖడే స్టేడియంలో రోహిత్ శర్మ స్టాండ్ ప్రారంభోత్సవంలో ఆయన భార్య రితికా సజ్దే కూడా వేదికపై ఉన్నారు. రితికా ఏడుస్తున్న ఒక వీడియో బాగా వైరల్ అయింది. ఆమె కన్నీళ్లు తుడుచుకుంటూ వెనుకకు వెళ్ళిపోయింది.
ప్రారంభోత్సవంలో రోహిత్ శర్మ తన ప్రొఫెషనల్ క్రికెట్ కెరీర్ వాంఖడే నుంచే ప్రారంభమైందని, అదే మైదానంలో ప్రత్యేకంగా స్టాండ్ లభించడం చాలా గొప్ప విషయమని అన్నారు. రోహిత్ శర్మ ఇప్పుడు టెస్ట్, టీ20 క్రికెట్‌నుంచి రిటైర్ అయ్యాడు. ఇకపై ODI మ్యాచ్‌ల‌్లో మాత్రమే టీమ్ ఇండియాకు ప్రాతినిధ్యం వహిస్తాడు.




















