అన్వేషించండి

Virat Kohli: ఆ తెర వెనుక హీరోలే నా బ్యాటింగ్‌కు కారణం - విరాట్‌ కోహ్లీ

Virat Kohli: టీమ్‌ఇండియా త్రో డౌన్‌ స్పెషలిస్టుల వల్లే తాను మెరుగైన బ్యాటర్‌గా మారానని విరాట్‌ కోహ్లీ అంటున్నాడు. తన పరుగుల వరదకు వారే కారణమని పేర్కొన్నాడు.

Virat Kohli:

టీమ్‌ఇండియా త్రో డౌన్‌ స్పెషలిస్టుల వల్లే తాను మెరుగైన బ్యాటర్‌గా మారానని విరాట్‌ కోహ్లీ అంటున్నాడు. తన పరుగుల వరదకు వారే కారణమని పేర్కొన్నాడు. నెట్స్‌లో వారు విసిరే బంతుల వల్లే అద్భుతంగా బ్యాటింగ్‌ చేస్తున్నానని ప్రశంసించాడు. ఈ తెరవెనుక హీరోలను అభిమానులు గుర్తుంచుకోవాలని సూచించాడు. శ్రీలంకతో వన్డే సిరీస్‌ విజయం తర్వాత శుభ్‌మన్‌తో కలిసి విరాట్‌ మీడియాతో మాట్లాడాడు.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Team India (@indiancricketteam)

శ్రీలంకతో జరిగిన మూడో వన్డేలో టీమ్‌ఇండియా 317 పరుగుల తేడాతో విజయం సాధించింది. 3-0తో సిరీస్‌ క్లీన్‌స్వీప్‌ చేసింది. 391 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన లంకేయులు 22 ఓవర్లకు 73కే కుప్పకూలారు. మొదట విరాట్‌ కోహ్లీ అజేయ సెంచరీతో చెలరేగాడు. కేవలం 110 బంతుల్లో 13 బౌండరీలు, 8 సిక్సర్లతో 166 పరుగులు సాధించాడు. అతడికి తోడుగా శుభ్‌మన్‌ గిల్‌ (116; 97 బంతుల్లో 14x4, 2x6) సెంచరీ అందుకున్నాడు. మ్యాచ్‌ ముగిశాక త్రో డౌన్‌ స్పెషలిస్టులు రాఘవేంద్ర, దయానంద్‌ గరానీ, నువాన్‌ సెనెవిరత్నెను విరాట్ ప్రశంసించాడు.

'మేం ఆడిన ప్రతిసారీ ఆ ముగ్గురూ మాకు ప్రపంచ స్థాయి ప్రాక్టీస్‌ అందిస్తారు. 145, 150 కిలోమీటర్ల వేగంతో నెట్స్‌లో బంతులేసి సవాల్‌ విసురుతారు. ప్రతిసారీ ఔట్‌ చేసేందుకు ప్రయత్నిస్తారు. నిత్యం మమ్మల్ని పరీక్షిస్తూనే ఉంటారు' అని కోహ్లీ అన్నాడు.

'కొన్ని సార్లు తీవ్రత మరింత పెంచుతారు. నిజాయతీగా చెప్పాలంటే నా కెరీర్‌ను ప్రత్యేకంగా మార్చింది ఈ ప్రాక్టీసే. ఇలాంటి సాధన వల్లే నేనిలా ఉన్నాను. మా పరుగుల ఘనత వారికే చెందుతుంది. వాళ్లు ప్రతిరోజూ నమ్మశక్యం కాని విధంగా మాతో ప్రాక్టీస్‌ చేయిస్తారు. మీరంతా వారి పేర్లు, ముఖాలు గుర్తుంచుకోవాలి. ఎందుకంటే మా విజయాల వెనక వాళ్లే ఉంటారు. మా కోసం ఎక్కువ శ్రమిస్తారు' అని విరాట్‌ పేర్కొన్నాడు.

మరో సెంచూరియన్‌ శుభ్‌మన్‌ గిల్‌ సైతం త్రో డౌన్‌ సెషలిస్టులను అభినందించాడు. 'ఆ ముగ్గురూ కలిసి 1200-1500 వికెట్లు తీసుంటారు. మ్యాచుకు ముందు అన్ని రకాల పరిస్థితులకు మేం అలవాటు పడేలా చేస్తారు' అని వివరించాడు.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Team India (@indiancricketteam)

టాప్ హెడ్ లైన్స్

Arshdeep Test Call UP: ఆ పేస‌ర్ ను టెస్టుల్లో ఆడించాల్సిందేనంటూ గావ‌స్క‌ర్ డిమాండ్.. తొలి వ‌న్డే లో స్వింగ్ మాయాజాలం చూసి ఫిదా 
ఆ పేస‌ర్ ను టెస్టుల్లో ఆడించాల్సిందేనంటూ గావ‌స్క‌ర్ డిమాండ్.. తొలి వ‌న్డే లో స్వింగ్ మాయాజాలం చూసి ఫిదా 
Kohli Sachin Milestone: సచిన్ ఆల్ టైమ్ రికార్డును బద్దలు కొట్టిన  కోహ్లీ.. వన్డే చేజింగ్‌లో సరికొత్త చరిత్ర, నంబర్ 3లో అరుదైన ఘనత
సచిన్ ఆల్ టైమ్ రికార్డును బద్దలు కొట్టిన  కోహ్లీ.. వన్డే చేజింగ్‌లో సరికొత్త చరిత్ర, నంబర్ 3లో అరుదైన ఘనత
Virat Kohli  Storm: అభిమానుల‌కు బ‌ర్త్ డే కానుక ఇచ్చిన‌ కోహ్లీ.. ఫిఫ్టీతో విధ్వంసం.. తొలి వ‌న్డేలో కివీస్ పై భార‌త్ ఘ‌న విజ‌యం
అభిమానుల‌కు బ‌ర్త్ డే కానుక ఇచ్చిన‌ కోహ్లీ.. ఫిఫ్టీతో విధ్వంసం.. తొలి వ‌న్డేలో కివీస్ పై భార‌త్ ఘ‌న విజ‌యం
Kohli Flying Catch: 38 ఏళ్ల వయసులో గాల్లోకి డైవ్ కొట్టి, క్యాచ్ పట్టిన కోహ్లీ.. యారో సంబరాలతో  కింగ్ జోష్, కుప్ప‌కూలిన‌ కివీస్ 
38 ఏళ్ల వయసులో గాల్లోకి డైవ్ కొట్టి, క్యాచ్ పట్టిన కోహ్లీ.. యారో సంబరాలతో  కింగ్ జోష్, కుప్ప‌కూలిన‌ కివీస్

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP ZPTC MPTC Elections: నవంబర్ 5న యథావిధిగా ఎంపీటీసీ, జెడ్పీజీసీ ఎన్నికలు.. కొన్నిచోట్ల వాయిదా: ఏపీ ఎస్ఈసీ
నవంబర్ 5న యథావిధిగా ఎంపీటీసీ, జెడ్పీజీసీ ఎన్నికలు.. కొన్నిచోట్ల వాయిదా: ఏపీ ఎస్ఈసీ
Virat Kohli  Storm: అభిమానుల‌కు బ‌ర్త్ డే కానుక ఇచ్చిన‌ కోహ్లీ.. ఫిఫ్టీతో విధ్వంసం.. తొలి వ‌న్డేలో కివీస్ పై భార‌త్ ఘ‌న విజ‌యం
అభిమానుల‌కు బ‌ర్త్ డే కానుక ఇచ్చిన‌ కోహ్లీ.. ఫిఫ్టీతో విధ్వంసం.. తొలి వ‌న్డేలో కివీస్ పై భార‌త్ ఘ‌న విజ‌యం
Ongole Mayor Result: కూటమి ఖాతాలోకి ఒంగోలు కార్పొరేషన్.. మేయర్‌గా టీడీపీ అభ్యర్థి నల్లమల్లి శ్రీశిల్ప విజయం
కూటమి ఖాతాలోకి ఒంగోలు కార్పొరేషన్.. మేయర్‌గా టీడీపీ అభ్యర్థి నల్లమల్లి శ్రీశిల్ప విజయం
RTC Conductor Dies: ఆర్టీసీ కండక్టర్ ప్రవళిక మృతి.. ప్రభుత్వ ఉద్యోగం, ఇందిరమ్మ ఇల్లు.. కోటి పరిహారం
ఆర్టీసీ కండక్టర్ ప్రవళిక మృతి.. ప్రభుత్వ ఉద్యోగం, ఇందిరమ్మ ఇల్లు.. కోటి పరిహారం
Diwali Reddit Story : ఇదే నా చివరి దీపావళి కావచ్చు.. కంటతడి పెట్టిస్తోన్న 21 ఏళ్ల యువకుడి పోస్ట్, మీరు ఆ తప్పు చేయకండి
ఇదే నా చివరి దీపావళి కావచ్చు.. కంటతడి పెట్టిస్తోన్న 21 ఏళ్ల యువకుడి పోస్ట్, మీరు ఆ తప్పు చేయకండి
ముంచెత్తిన వరద.. ప్రాణాలకు తెగించి ముగ్గురు మహిళలను కాపాడిన చిలకలూరిపేట సీఐ
ముంచెత్తిన వరద.. ప్రాణాలకు తెగించి ముగ్గురు మహిళలను కాపాడిన చిలకలూరిపేట సీఐ
Medical College Ragging: కామారెడ్డి మెడికల్‌ కాలేజీలో ర్యాగింగ్‌.. 14 మంది సీనియర్ విద్యార్థులపై సస్పెన్షన్‌!
కామారెడ్డి మెడికల్‌ కాలేజీలో ర్యాగింగ్‌.. 14 మంది సీనియర్ విద్యార్థులపై సస్పెన్షన్‌!
మహాభారతంపై తొలి MA డిగ్రీ: చరిత్ర సృష్టించిన సెంట్రల్ సంస్కృత్ యూనివర్శిటీ!
మహాభారతంపై తొలి MA డిగ్రీ: చరిత్ర సృష్టించిన సెంట్రల్ సంస్కృత్ యూనివర్శిటీ!
Embed widget