Warner as Pathaan: 'పఠాన్' గా అదరగొట్టిన డేవిడ్ వార్నర్- ఆస్కార్ కమింగ్ అంటూ ఫ్యాన్స్ కామెంట్
Warner as Pathaan: ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ 'పఠాన్' మూవీ టీజర్ కు చేసిన రీల్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Warner as Pathaan: డేవిడ్ వార్నర్- ఈ ఆస్ట్రేలియా డాషింగ్ బ్యాట్స్ మెన్ మైదానంలో దూకుడుగా ఆడడమే కాదు.. రీల్స్ చేయడంలోనూ చురుగ్గానే ఉంటాడు. గ్రౌండ్ లో పరుగుల వరద పారించడమే కాదు.. రీల్స్ లో తన యాక్షన్ తో నవ్వులను పంచుతుంటాడు. భారత్ లోని హిందీ, తెలుగు సినిమాల్లోని పాటలకు, సీన్లలోని క్యారెక్టర్లకు వార్నర్ తన ముఖాన్నిపెట్టి చేసే రీల్స్ కు ఎంతో మంది అభిమానులున్నారు. ఇప్పటికే చాలా చిత్రాల్లోని క్యారెక్టర్లకు తన ఫేస్ ను యాడ్ చేసిన రీల్స్ ను ఇన్ స్టాగ్రామ్ లో పెట్టాడు వార్నర్. అవన్నీ ఎంతో పాపులర్ అయ్యాయి.
ప్రస్తుతం డేవిడ్ వార్నర్ బాలీవుడ్ లో ఇటీవల రిలీజ్ అయ్యి సూపర్ డూపర్ హిట్ అయిన షారుఖ్ ఖాన్ 'పఠాన్' మూవీ టీజర్ కు రీల్ చేశాడు. ఆ టీజర్ లో షారుఖ్ ముఖానికి తన ముఖాన్ని యాడ్ చేసిన రీల్ ను తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేశాడు. ప్రస్తుతం అది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇప్పటికి ఆ వీడియోకు 8 లక్షలకు పైగానే లైకులు వచ్చాయి. నెటిజన్లు అయితే సూపర్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. మరి ఆ వీడియోను మీరూ చూసేయండి.
వందో టెస్టులో డబుల్
ఇక క్రికెట్ విషయానికొస్తే ఫిబ్రవరిలో భారత్ తో జరగనున్న బోర్డర్- గావస్కర్ ట్రోఫీ కోసం డేవిడ్ వార్నర్ సిద్ధమవుతున్నాడు. ఇటీవల దక్షిణాఫ్రికాతో జరిగిన బాక్సింగ్ డే టెస్టులో డబుల్ సెంచరీ చేసిన వార్నర్ మంచి ఫాంలో ఉన్నాడు. మొన్నటివరకు ఫాంలేమితో ఇబ్బందిపడ్డ ఈ డాషింగ్ ఓపెనర్.. వందో టెస్టులో ద్విశతకం బాది టచ్ లోకి వచ్చాడు.
మెల్ బోర్న్ క్రికెట్ గ్రౌండ్ లో దక్షిణాఫ్రికాతో టెస్టుతో తన వందో మ్యాచ్ ఆడిన వార్నర్... డబుల్ సెంచరీని అందుకున్నాడు. నాణ్యమైన ప్రొటీస్ బౌలింగ్ ను ఎదుర్కొంటూ అతడు చేసిన ఈ ద్విశతకం ఎంతో ప్రత్యేకమైనదిగా నిలిచింది. టెస్టు జట్టులో నుంచి తీసేయాలంటూ వస్తున్న విమర్శలకు తన బ్యాట్ తోనే సమాధానం చెప్పాడీ విధ్యంసక బ్యాట్స్ మెన్. మొత్తం 254 బంతులు ఎదుర్కొని 200 పరుగులు చేశాడు. అందులో 16 ఫోర్లు, 2 సిక్సర్లు ఉన్నాయి. ఈ ద్విశతకంతో అరుదైన రికార్డు సాధించాడు. ఇంగ్లండ్ ఆటగాడు జోరూట్ తర్వాత వందో టెస్టులో డబుల్ సెంచరీ బాదిన ప్లేయర్ గా గుర్తింపు పొందాడు.
View this post on Instagram
View this post on Instagram