అన్వేషించండి

U19 World Cup: ధావన్‌ సరసన ముషీర్‌, అండర్‌ 19 ప్రపంచకప్‌లో నయా రికార్డు

Musheer Khan : దేశవాళీ క్రికెట్‍లో సత్తాచాటుతున్న అన్న సర్ఫరాజ్ ఖాన్ భారత జట్టుకు ఎంపికయ్యాడు. తమ్ముడు అండర్-19 ప్రపంచకప్‍లో భారత యంగ్ బ్యాటర్ ముషీర్ ఖాన్ సత్తాచాటుతున్నాడు.

India vs New Zealand: వెస్టిండీస్‌-అమెరికా సంయుక్తంగా నిర్వహిస్తున్న అండర్‌ 19 ప్రపంచకప్‌(U19 World Cup)లో యువ భారత్‌ వరుస విజయాలతో దూసుకుపోతోంది. ఇప్పటికే సూపర్‌ సిక్స్‌కు చేరిన టీమిండియా(Team India)... సూపర్‌ సిక్స్‌ తొలి మ్యాచ్‌లో న్యూజిలాండ్‌( New Zealand)ను చిత్తు చేసింది. ఈ మ్యాచ్‌లో అద్భుత శతకంతో భారత బ్యాటర్‌ ముషీర్‌ ఖాన్‌(Musheer Khan)... విధ్వంసం సృష్టించాడు. ఈ ప్రపంచకప్‌లో ఇప్పటికే రెండు సెంచరీలు, ఒక అర్ధ సెంచరీతో కదం తొక్కిన ముషీర్‌ ఖాన్‌ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. ప్రస్తుత వరల్డ్‌కప్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గానూ ముషీర్‌ నిలిచాడు. ఇప్పటివరకు 4 మ్యాచ్‌లు ఆడి 81.25 సగటున 2 సెంచరీలు, ఓ హాఫ్‌ సెంచరీలతో 325 పరుగులు చేశాడు.

రెండు శతకాలు.. ఒక అర్ధ శతకం
అండర్‌ 19 ప్రపంచకప్‌లో ఐర్లాండ్‌పై 118 పరుగులు చేసిన ముషీర్‌... న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 131 పరుగులు చేశాడు.  ఈసెంచరీలతో ముషీర్‌ ఒకే ప్రపంచకప్‌ ఎడిషన్‌లో ఒకటికంటే ఎక్కువ సెంచరీలు చేసిన రెండో భారత ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. టీమిండియా సీనియర్‌ ఆటగాడు శిఖర్‌ ధవన్‌ మాత్రమే సింగిల్‌ వరల్డ్‌కప్‌ ఎడిషన్‌లో రెండు సెంచరీలు చేశాడు. ఇప్పుడు రెండు సెంచరీలు చేసిన ముషీర్‌.. శిఖర్‌( Shikhar Dhawan) రికార్డును సమం చేశాడు. న్యూజిలాండ్‌పై సెంచరీతో ముషీర్‌ మరో ఘనతను కూడా సాధించాడు. 

సోదరుడే స్ఫూర్తి అంటున్న అన్న
దక్షిణాఫ్రికా వేదికగా జరుగుతున్న ఐసీసీ అండర్‌ –19 వరల్డ్‌ కప్‌లో సర్ఫరాజ్‌ ఖాన్‌ సోదరుడు ముషీర్‌ ఖాన్‌(Musheer Khan) అద్భుత ఆటతీరుతో అలరిస్తున్నాడు. ఈ టోర్నీలో ఇప్పటికే రెండు సెంచరీలు , మరో అర్థ సెంచరీతో జోరుమీదున్నాడు. తాను ఫామ్‌ కోల్పోయి ఇబ్బంది పడినప్పుడు సోదరుడు ముషీర్‌ ఖాన్‌ ఆటతీరును గమనిస్తానని సర్ఫరాజ్‌ తెలిపాడు. ముషీర్‌  తన కంటే మంచి బ్యాటర్ అని అన్నాడు. తన సోదరుడి టెక్నిక్‌ని గమనిస్తూ దానిని అనుకరించేందుకు ప్రయత్నిస్తానని తెలిపాడు. తన సోదరుడి ఆటతీరు తనకు నమ్మకాన్ని ఇస్తుందని సర్ఫరాజ్‌ తెలిపాడు. తాను బాగా బ్యాటింగ్ చేయలేనప్పుడు ముషీర్‌ ఖాన్‌ని చూసి నేర్చుకుంటానని అన్నాడు. తాను స్వీప్ బాగా ఆడతానని అనుకుంటున్నానని. మా ఇద్దరి మధ్య ఎల్లప్పుడూ పోటీ ఉంటుందని సర్ఫరాజ్‌ తెలిపాడు. జాతీయ క్రికెట్ అకాడమీలో సర్ఫరాజ్‌ ఎంతో నేర్చుకున్నాడని... అతనిపై నమ్మకం ఉంచిన బీసీసీఐ, సెలక్టర్లు.. అతడికి మద్దతుగా నిలిచిన అభిమానులు ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలని సర్ఫరాజ్‌ తండ్రి నౌషాద్ ఖాన్ అన్నారు.


సిద్ధమవుతున్న టీమిండియా
ఇంగ్లాండ్‌తో రెండో టెస్ట్‌కు టీమిండియా సిద్ధమవుతోంది. తొలి టెస్టులో అనూహ్య పరాజయం పాలై సర్వత్రా విమర్శలు ఎదుర్కొంటున్న రోహిత్‌ సేన... ఈ టెస్టులో గెలిచి మళ్లీ గాడిన పడాలని చూస్తోంది. రాహుల్‌, జడేజా గాయం కారణంగా రెండో టెస్ట్‌ నుంచి తప్పుకోవడంతో ఇప్పుడు జట్టు కూర్పు సమస్యగా మారింది. ఈ నేపథ్యంలో తుదిజట్టు కూర్పుపై మాజీ క్రికెటర్‌ పార్థివ్‌ పటేల్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఫాస్ట్‌ బౌలర్‌ అవసరం లేనపుడు మహ్మద్‌ సిరాజ్‌ను తప్పించి ఒక బ్యాటర్‌ను అదనంగా తీసుకోవడం ఉత్తమమని అభిప్రాయపడ్డాడు.

టాప్ హెడ్ లైన్స్

India Dominates Galle Test:  విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
Siraj Wierd Throw Towords Umpire: అంపైర్ వైపు దూసుకొచ్చిన సిరాజ్ రాకెట్ త్రో.. జడేజా ఫన్నీ రియాక్షన్ తో గాలే టెస్టులో నవ్వులు.. ఆన్ ఎయిర్ లో తిట్టుకున్న కామేంటేటర్లు..!
అంపైర్ వైపు దూసుకొచ్చిన సిరాజ్ రాకెట్ త్రో.. జడేజా ఫన్నీ రియాక్షన్ తో గాలే టెస్టులో నవ్వులు.. ఆన్ ఎయిర్ లో తిట్టుకున్న కామేంటేటర్లు..!
Pujara Bold Strategy: టీమిండియా గెలవాలంటే సాహసోపేత డిక్లరేషన్ ఇవ్వాల్సిందే.. గాలే టెస్ట్ లో నెగ్గాలంటే ఏం చేయాలో చెప్పిన మాజీ క్రికెట‌ర్!
టీమిండియా గెలవాలంటే సాహసోపేత డిక్లరేషన్ ఇవ్వాల్సిందే.. గాలే టెస్ట్ లో నెగ్గాలంటే ఏం చేయాలో చెప్పిన మాజీ క్రికెట‌ర్!
Shubman Gill Flying Catch:  నిన్న లంక కెప్టెన్, నేడు భార‌త కెప్టెన్.. స్ట‌న్నింగ్ క్యాచ్ లతో దుమ్మురేపిన సార‌థులు.. సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారిన ధ‌నంజ‌య‌, గిల్ క్యాచ్ లు..
నిన్న లంక కెప్టెన్, నేడు భార‌త కెప్టెన్.. స్ట‌న్నింగ్ క్యాచ్ లతో దుమ్మురేపిన సార‌థులు.. సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారిన ధ‌నంజ‌య‌, గిల్ క్యాచ్ లు..

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Cabinet Decisions: స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
CM Revanth Reddy: మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
National Sports Awards: గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
India Dominates Galle Test:  విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
Congress Politics: వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
KBR Park Traffic Rules:కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉండే వారికి బిగ్ అలర్ట్! బస్టాప్‌ల మార్పుపై పోలీసుల కీలక ప్రకటన!
కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉండే వారికి బిగ్ అలర్ట్! బస్టాప్‌ల మార్పుపై పోలీసుల కీలక ప్రకటన!
Konaseema Fishermen Missing:కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
Vijay Son Jason Sanjay: గాంధీ జయంతికి విజయ్ తనయుడి సినిమా... సందీప్ కిషన్ 'సిగ్మా' లేటెస్ట్ రిలీజ్ డేట్ ఇదుగో
గాంధీ జయంతికి విజయ్ తనయుడి సినిమా... సందీప్ కిషన్ 'సిగ్మా' లేటెస్ట్ రిలీజ్ డేట్ ఇదుగో
Embed widget