అన్వేషించండి
Advertisement
IND vs AUS U19 Final: టాస్ గెలిచిన కంగారూలు - బ్యాటింగ్ షురూ
IND vs AUS U19 World Cup Final 2024: బెనోనిలో విల్లోమూర్ పార్క్‌లో అండర్-19 ప్రపంచకప్ ఫైనల్ లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా బ్యాటింగ్ ఎంచుకుంది.
IND vs AUS Under 19 World Cup AUS Under19 chose to bat: దక్షిణాఫ్రికా వేదికగా జరుగుతున్న అండర్-19 ప్రపంచకప్( U19 World Cup Final 2024) ఆఖరి అంకానికి చేరుకుంది. బెనోనిలో విల్లోమూర్ పార్క్‌లో అండర్-19 ప్రపంచకప్ ఫైనల్ లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా బ్యాటింగ్ ఎంచుకుంది. ఉదయ్ సహారన్ నేతృత్వంలో భారత జట్టు బౌలింగ్ చేయనుంది.
గత ఏడాది నవంబర్ 19న భారత్ వేదికగా జరిగిన వన్డే ప్రపంచకప్ ఫైనల్లో భారత అభిమానులను ఆస్ట్రేలియా కన్నీరు పెట్టించింది. అయితే ఈ కన్నీళ్లకు బదులు తీర్చుకునేందుకు యువ భారత్ సిద్ధమైంది. ఉదయ్ సహారాన్, సచిన్ దాస్, ముషీర్ ఖాన్, సౌమ్‌కుమార్ పాండేలతో బలంగా ఉన్న టీమిండియాను ఓడించడం కంగారులకు అంత తేలిక కాదు. తాము ప్రతీకారం గురించి ఆలోచించడం లేదని.. గతం గురించి కూడా ఆలోచిచడం లేదని... తమ దృష్టంతా వర్తమానంపైనే ఉందని భారత సారధి ఉదయ్ సహారన్ తెలిపాడు. కంగారు జట్టులో కెప్టెన్ హ్యూ వీబ్‌జెన్, ఓపెనర్ హ్యారీ డిక్సన్, సీమర్లు టామ్ స్ట్రాకర్, కల్లమ్ విడ్లర్ నిలకడగా రాణిస్తున్నారు. 2012, 2018ల్లో జరిగిన ప్రపంచకప్ ఫైనల్స్‌లో ఆస్ట్రేలియాను భారత జట్టు ఓడించింది. మరోసారి అదే ఫలితం పునరావృతం కావాలని టీమిండియా అభిమానులు కోరుకుంటున్నారు.
ఉదయ్ సహారాన్, సచిన్ దాస్, ముషీర్ ఖాన్, సౌమ్‌కుమార్ పాండేలతో బలంగా ఉన్న టీమిండియాను ఓడించడం కంగారులకు అంత తేలిక కాదు. తాము ప్రతీకారం గురించి ఆలోచించడం లేదని.. గతం గురించి కూడా ఆలోచిచడం లేదని... తమ దృష్టంతా వర్తమానంపైనే ఉందని భారత సారధి ఉదయ్ సహారన్ తెలిపాడు. అటు కంగారు జట్టులో కెప్టెన్ హ్యూ వీబ్‌జెన్, ఓపెనర్ హ్యారీ డిక్సన్, సీమర్లు టామ్ స్ట్రాకర్, కల్లమ్ విడ్లర్ నిలకడగా రాణిస్తున్నారు.
2016, 2018, 2020, 2022, 2024 అండర్ 19 ప్రపంచకప్పుల్లో యువ భారత జట్టు వరుసగా ఫైనల్‌కు చేరింది. 2018, 2022 ఎడిషన్‌లలో కప్పును ఒడిసిపట్టిన టీమిండియా.... 2016, 2020లలో ఓడిపోయింది. 2024లో కూడా విజయం సాధించి వరుసగా రెండోసారి కప్పును గెలిచిన జట్టుగా రికార్డు సృష్టించాలని టీమిండియా చూస్తోంది.
ఫైనల్ టీమిండియా జట్టు:
ఉదయ్ సహారన్ (కెప్టెన్), అర్షిన్ కులకర్ణి, ఆదర్శ్ సింగ్, సచిన్ దాస్, ప్రియాంషు మోలియా, ముషీర్ ఖాన్, అరవెల్లి అవనీష్ రావు, సౌమీ కుమార్ పాండే, మురుగన్ అభిషేక్,రాజ్ లింబానీ, నమన్ తివారీ.
ఫైనల్ ఆస్ట్రేలియా జట్టు:
హ్యూ వీబ్‌జెన్ (కెప్టెన్), చార్లీ ఆండర్సన్, మహ్లీ బార్డ్‌మ్యాన్, టామ్ కాంప్‌బెల్, హ్యారీ డిక్సన్, ర్యాన్ హిక్స్, సామ్ కాన్స్టాస్, రాఫెల్ మాక్‌మిలన్, హర్జాస్ సింగ్, కల్లమ్ విడ్లెర్, ఒల్లీ పీక్.
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
కర్నూలు
హైదరాబాద్
పర్సనల్ ఫైనాన్స్
విశాఖపట్నం
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Sadhguru is a Yogi, mystic, visionary and authorYogi, mystic, visionary and author
Opinion