News
News
X

U19 Women's T20 WC: రేపు అండర్- 19 టీ20 ప్రపంచకప్ విజేతలకు సన్మానం- ముఖ్య అతిథి ఎవరంటే!

U19 Women's T20 WC: భారత్- న్యూజిలాండ్ ఆఖరి టీ20 మ్యాచ్ కు ముందు అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో భారత జూనియర్ అమ్మాయిలను బీసీసీఐ సత్కరించనుంది. బుధవారం సాయంత్రం 6 గంటలకు ఈ కార్యక్రమం జరగనుంది.

FOLLOW US: 
Share:

U19 Women's T20 WC:  దక్షిణాఫ్రికాలో జరిగిన తొలి అండర్- 19 టీ20 ప్రపంచకప్ ను భారత జూనియర్ అమ్మాయిలు గెలుచుకున్నారు. ఇంగ్లండ్ తో జరిగిన ఫైనల్ లో 7 వికెట్ల తేడాతో భారత జట్టు ఘనవిజయం సాధించింది. భారత అమ్మాయిలు సాధించిన ఈ గొప్ప విజయానికి బీసీసీఐ వారిని సత్కరించనుంది. రేపు (బుధవారం) అహ్మదాబాద్ లో టీమిండియా మాజీ దిగ్గజం సచిన్ టెండూల్కర్ చేతుల మీదుగా ఆటగాళ్లను సత్కరించనున్నారు. 

భారత్- న్యూజిలాండ్ ఆఖరి టీ20 మ్యాచ్ కు ముందు అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో భారత జూనియర్ అమ్మాయిలను బీసీసీఐ సత్కరించనుంది. బుధవారం సాయంత్రం 6 గంటలకు ఈ కార్యక్రమం జరగనుంది. 'ఫిబ్రవరి 1న నరేంద్ర మోదీ స్టేడియంలో సాయంత్రం 6.30 గంటలకు టీమిండియా దిగ్గజం సచిన్ టెండూల్కర్ చేతుల మీదుగా అండర్- 19 విజేతలను సత్కరించనున్నాం. అందుకు చాలా సంతోషంగా ఉంది.' అని బీసీసీఐ కార్యదర్శి జైషా ట్వీట్ చేశారు. యువ క్రికెటర్లు దేశం గర్వించేలా చేశారు. వారి విజయాలను మేం గౌరవిస్తాం అని షా అన్నారు. టీ20 ప్రపంచకప్ గెలిచిన క్రికెటర్లకు, సహాయ సిబ్బందికి బీసీసీఐ రూ. 5కోట్ల నగదు బహుమతిని ప్రకటించింది. 

ఇది ఆరంభం మాత్రమే: షెఫాలీ వర్మ

2023 అండర్-19 మహిళల టీ20 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్‌లో భారత మహిళల జట్టు విజయం సాధించి చరిత్ర సృష్టించింది. తొలిసారి భారత మహిళల జట్టు ఐసీసీ ట్రోఫీని గెలిచింది. ఈ చరిత్రాత్మక విజయం తర్వాత భారత కెప్టెన్ షెఫాలీ వర్మ తన తర్వాతి ప్రణాళికను వివరించింది.

అండర్- 19 టీ20 ప్రపంచకప్ లో భారత మహిళల జట్టుకు షెఫాలీ వర్మ కెప్టెన్ గా వ్యవహరించింది. ఫైనల్ మ్యాచ్ లో ఇంగ్లండ్ పై 7 వికెట్ల తేడాతో విజయం సాధించి కప్ ను అందుకుంది. ఈ టోర్నీ మొత్తం షెఫాలీ ప్లేయర్ గా, కెప్టెన్ గా ఆకట్టుకుంది. జట్టును విజయపథంలో నడిపించింది. మ్యాచ్ గెలిచాక షెఫాలీ ఈ ప్రపంచకప్ విజయం గురించి, తన తర్వాతి ప్రణాళికల గురించి వివరించింది. 'ఇది ఆరంభం మాత్రమే. రెండు వారాల తర్వాత జరగనున్న సీనియర్ మహిళల టీ20 ప్రపంచకప్ లోనూ ఇదే ప్రదర్శనను పునరావృతం చేయాలనుకుంటున్నాను' అని భారత కెప్టెన్ తెలిపింది.

Published at : 31 Jan 2023 01:33 PM (IST) Tags: Sachin Tendulkar BCCI latest news U-19 India Womens Team U-19 India Womens Team news

సంబంధిత కథనాలు

UPW-W vs DC-W, Match Highlights: క్యాప్సీ కేక! యూపీపై గెలుపుతో WPL ఫైనల్‌కు దిల్లీ క్యాపిటల్స్‌!

UPW-W vs DC-W, Match Highlights: క్యాప్సీ కేక! యూపీపై గెలుపుతో WPL ఫైనల్‌కు దిల్లీ క్యాపిటల్స్‌!

UPW-W vs DC-W, 1 Innings Highlight: దిల్లీ ఫైనల్‌ టార్గెట్‌ 139 - యూపీని దెబ్బకొట్టిన క్యాప్సీ, రాధా!

UPW-W vs DC-W, 1 Innings Highlight: దిల్లీ ఫైనల్‌ టార్గెట్‌ 139 - యూపీని దెబ్బకొట్టిన క్యాప్సీ, రాధా!

UPW vs DCW: ఆఖరి లీగు మ్యాచులో టాస్‌ డీసీదే - యూపీపై గెలిస్తే ఫైనల్‌కే!

UPW vs DCW: ఆఖరి లీగు మ్యాచులో టాస్‌ డీసీదే - యూపీపై గెలిస్తే ఫైనల్‌కే!

RCB-W vs MI-W, Match Highlight: ముంబయి కేర్‌టేకర్‌ 'కెర్‌' - ఆర్సీబీపై 4 వికెట్ల తేడాతో మళ్లీ టేబుల్‌ టాపర్‌!

RCB-W vs MI-W, Match Highlight: ముంబయి కేర్‌టేకర్‌ 'కెర్‌' - ఆర్సీబీపై 4 వికెట్ల తేడాతో మళ్లీ టేబుల్‌ టాపర్‌!

RCB-W vs MI-W, 1 Innings Highlight: ముంబయి టార్గెట్‌ జస్ట్ 126 - ఆఖరి మ్యాచులో ఆర్సీబీ గెలుస్తుందా?

RCB-W vs MI-W, 1 Innings Highlight: ముంబయి టార్గెట్‌ జస్ట్ 126 - ఆఖరి మ్యాచులో ఆర్సీబీ గెలుస్తుందా?

టాప్ స్టోరీస్

Teenmar Mallanna Arrest: తీన్మార్ మల్లన్న అరెస్ట్, క్యూ న్యూస్ ఆఫీసులో పలు డివైజ్ లు సీజ్ - బండి సంజయ్ మండిపాటు

Teenmar Mallanna Arrest: తీన్మార్ మల్లన్న అరెస్ట్, క్యూ న్యూస్ ఆఫీసులో పలు డివైజ్ లు సీజ్ - బండి సంజయ్ మండిపాటు

Kavitha ED Enquiry: ముగిసిన కవిత ఈడీ విచారణ, మూడోసారి సుదీర్ఘంగా ప్రశ్నించిన అధికారులు - 22న విచారణ లేదు

Kavitha ED Enquiry: ముగిసిన కవిత ఈడీ విచారణ, మూడోసారి సుదీర్ఘంగా ప్రశ్నించిన అధికారులు - 22న విచారణ లేదు

Happy Ugadi Wishes in Telugu 2023:మీ బంధుమిత్రులకు ఈ కొటేషన్స్ తో శ్రీ శోభకృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేయండి

Happy Ugadi Wishes in Telugu 2023:మీ బంధుమిత్రులకు ఈ కొటేషన్స్ తో శ్రీ శోభకృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేయండి

Rangamarthanda Movie Review - 'రంగమార్తాండ' రివ్యూ : ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం హీరోలుగా కృష్ణవంశీ తీసిన సినిమా

Rangamarthanda Movie Review - 'రంగమార్తాండ' రివ్యూ : ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం హీరోలుగా కృష్ణవంశీ తీసిన సినిమా