Virat Kohli: ఈ ప్రపంచకప్‌లో బలహీన జట్టే లేదన్న విరాట్ కోహ్లీ
ODI World Cup 2023: ప్రపంచకప్ వంటి ప్రతిష్టాత్మక టోర్నమెంట్‌లో బలహీన జట్లు అంటూ ఏవీ ఉండవని విరాట్ తేల్చి చెప్పాడు. అన్ని జట్లు అద్భుత ప్రదర్శన చేయడం మాత్రమే దృష్టి పెడతాయని వ్యాఖ్యానించాడు.
Cricket World Cup 2023: ప్రపంచకప్‌లో వరుస విజయాలతో ఊపుమీదున్న టీమిండియా.. బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌కు సిద్ధమైంది. వరుసగా మూడు విజయాలతో మంచి ఫామ్‌లో ఉన్న రోహిత్ మూడు మ్యాచుల్లో ఒక మ్యాచ్ గెలిన బంగ్లాతో అమీతుమీ తేల్చుకోనుంది. ఈ క్రమంలో కింగ్ కోహ్లీ కీలక వ్యాఖ్యలు చేశాడు. ప్రపంచకప్ వంటి ప్రతిష్టాత్మక టోర్నమెంట్‌లో బలహీన జట్లు అంటూ ఏవీ ఉండవని విరాట్ తేల్చి చెప్పాడు. ఈ ప్రపంచకప్‌లో బలహీనమైన జట్లు ఏవనీ లేవని.. అన్ని జట్లు అద్భుత ప్రదర్శన చేయడం మాత్రమే దృష్టి పెడతాయని వ్యాఖ్యానించాడు.
షకీబ్ ఓ బలమైన ప్రత్యర్థి
బంగ్లా సారధి షకీబ్ అల్ హసన్‌ను విరాట్ కోహ్లీ ప్రశంసించాడు. షకీబ్ నైపుణ్యాలను కొనియాడాడు. షకీబ్ అల్ హసన్‌ను చాలా బలమైన ప్రత్యర్థిగా అభివర్ణించాడు. ప్రపంచ అగ్రశ్రేణి బ్యాటర్లపై షకీబ్ ఆధిపత్యం చెలాయిస్తాడని, ఆ సామర్ధ్యం అతడికి ఉందని విరాట్ ప్రశంసించాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో షకీబ్‌కు చాలా అనుభవం ఉందని, కొన్నేళ్లుగా అతనితో చాలా క్రికెట్ ఆడానని.. అతని నియంత్రణ ప్రశంసనీయంగా ఉంటుందని కింగ్ కోహ్లీ అన్నాడు. బౌలర్‌గా షకీబ్ అల్ హసన్‌కు అపారమైన అనుభవం ఉందని.. బ్యాటర్‌ను ఎలా బోల్తా కొట్టించాలో అతడికి బాగా తెలుసని.. కొత్త బంతితో కూడా మెరుగ్గా బౌలింగ్ చేస్తాడని కింగ్ కోహ్లీ ప్రశంసించాడు.
విరాట్ యుగానికి ఒక్కడు
టీమిండియా బ్యాటింగ్ మాస్ట్రో విరాట్ కోహ్లీపై బంగ్లాదేశ్ కెప్టెన్ షకీబ్ అల్ హసన్
ప్రశంసల వర్షం కురిపించాడు. అన్ని ఫార్మాట్లలో విరాట్ కోహ్లీని 6 సార్లు అవుట్ చేసినందుకు తాను చాలా అదృష్టవంతుడిగా భావిస్తున్నానని షకీబల్ అన్నాడు. కోహ్లీ ఓ ప్రత్యేకమైన బ్యాట్స్‌మెన్ అని.. ఈ ఆధునిక యుగంలో అత్యుత్తమ బ్యాట్స్‌మన్ అని. అతన్ని 6 సార్లు అవుట్ చేయడం తన అదృష్టమని విరాట్ అన్నాడు. కోహ్లీ వికెట్ తీయడం తనకు చాలా ఆనందాన్ని ఇస్తుందని షకీబ్ అన్నాడు. కోహ్లి, షకీబ్‌లకు గత దశాబ్ద కాలంగా మైదానంలో ఒకరితో ఒకరు పోటీపడుతున్నారు. షకీబ్-కోహ్లీ అన్ని ఫార్మాట్లలో 23 మ్యాచ్‌ల్లో తలపడగా విరాట్‌ను షకీబ్ ఆరుసార్లు అవుట్ చేయగలిగాడు.
Cricket World Cup 2023: ప్రపంచకప్‌లో వరుస విజయాలతో ఊపు మీదున్న టీమిండియా మరో మ్యాచ్‌కు సిద్ధమైంది. మహా సంగ్రామంలో బంగ్లాదేశ్‌ను చిత్తు చేయాలని పట్టుదలగా ఉంది. సెమీస్‌కు మార్గం సుగుమం చేసుకోవాలంటే ఈ మ్యాచ్ కీలకం కావడంతో రోహిత్ సేన అలసత్యానికి చోటివ్వకుండా గెలవాలని రోహిత్ సేన చూస్తోంది. కానీ ఇరు జట్ల ప్రస్తుత ఫామ్‌ను చూస్తే భారత జట్టు పెద్ద కష్టం కాకపోవచ్చని మాజీలు అంచనా వేస్తున్నారు. కానీ ఈ మ్యాచ్‌లో అండర్ డాగ్స్‌గా బరిలోకి దిగే బంగ్లాను తక్కువ అంచనా వేస్తే టీమిండియా దానికి తగిన మూల్యం చెల్లించుకోక తప్పుదు. అఫ్గానిస్తాన్ చేతిలో ఇంగ్లాండ్... నెదర్లాండ్స్ చేతిలో దక్షిణాఫ్రికా ఓడిపోవడంతో ఇప్పుడు భారత్ మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని క్రికెట్ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.
బ్యాటింగ్‌లో తిరుగులేదు
ఎలాంటి అలసత్వానికి చోటివ్వకుండా భారత్.. బంగ్లాదేశ్‌పై బరిలోకి దిగనుంది. ప్రపంచకప్‌లో అప్రతిహాత విజయాల పరంపర కొనసాగించాలని చూస్తోంది. బ్యాటింగ్‌లో కెప్టెన్ రోహిత్ అద్భుతమైన ఫామ్‌ను కొనసాగించాలని చూస్తుండగా... శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ భారీ స్కోర్లపై కన్నేశారు. రోహిత్ గత రెండు మ్యాచ్‌ల్లో పాకిస్థాన్‌పై 86, అఫ్ఘానిస్తాన్‌పై 131 పరుగులతో అద్భుత ఫామ్‌లో ఉన్నాడు. మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో బ్యాటింగ్‌కు అనుకూలమైన పిచ్ ఉంటుందన్న విశ్లేషణలు ఉన్నాయి. ఈ పరిస్థితులను సద్వినియోగం చేసుకోవాలని రోహిత్ సేన ప్రణాళిక రచిస్తోంది. వన్డేల్లో ఈ వేదికపై ఏడు మ్యాచ్‌లు ఆడిన టీమిండియా నాలుగు మ్యాచుల్లో గెలిచి.. మూడింట్లో ఓడిపోయింది. ఆస్ట్రేలియాను కేవలం 199 పరుగులకే, పాకిస్థాన్‌ను 191 పరుగులకే పరిమితం చేసి భారత బౌలర్లు టాప్ ఫామ్‌లో ఉన్నారు. బౌలింగ్‌లోనూ టీమిండియా అద్భుతాలు చేస్తోంది.