అన్వేషించండి

T20 World Cup Celebration: ఈ ప్రేమను వర్ణించలేం, అభిమానాన్ని మరువలేం

Team India: టీ20 ప్రపంచ కప్ సాధించి స్వదేశానికి చేరుకున్న టీమ్‌ఇండియా ఆటగాళ్ళకు అడుగడుగునా సాదర స్వాగతం లభించింది. విజయోత్సవ ర్యాలీ తరువాత వాంఖడె స్టేడియంలో ఆటగాళ్ళు సందడి చేశారు.

Team India Victory Parade Highlights: ఒక క్రికెటర్‌గా ఆటగాళ్లు... క్రికెట్‌ను అభిమానించి ప్రేమించే వారిగా అభిమానులకు వాంఖడే స్టేడియం జీవితాంతం గుర్తుంచుకునే మరపురాని క్షణాలను అందించింది. వాంఖడే స్టేడియంలో జరిగిన సన్మాన కార్యక్రమంలో ఆటగాళ్లు భావోద్వేగ ప్రసంగం చేశారు.

ఆఖరి ఓవర్‌లో అద్భుతంగా బౌలింగ్‌ చేసిన పాండ్యాను కెప్టెన్ రోహిత్‌ శర్మ ప్రసంగించాడు. ప్రపంచకప్‌ పైనల్లో ఆ ఓవర్ వేయడానికి చాలా ఒత్తిడి ఉంటుందని.. కానీ పాండ్యా దానిని సమర్థంగా నిర్వహించాడని.. పాండ్యాకు హ్యాట్సాఫ్ అని హిట్‌ మ్యాన్‌ అన్నాడు. రోహిత్‌ ప్రసంగం చేస్తున్నప్పుడు హార్దిక్‌ లేచి నిలబడి అభిమానులకు ధన్యవాదాలు తెలిపాడు.

భారతే తనకు ప్రపంచమని... ఈ ప్రేమను అందించిన వారందరికీ ధన్యవాదాలని టీమిండియాకు ప్రపంచకప్‌ రావడంలో కీలకపాత్ర పోషించిన నెంబర్ వన్ ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా అన్నాడు. ఈ విజయోత్సవాన్ని తమతో జరుపుకోవడానికి వచ్చిన వారందరికీ పాండ్యా ధన్యవాదాలు తెలిపాడు. ఇలాంటి ఘన స్వాగతం ఎప్పుడూ చూడలేదని.. ఈ జ్ఞాపకాలను ఎప్పటికీ మర్చిపోలేనని జస్ప్రీత్ బుమ్రా అన్నాడు. తన కెరీర్‌లో ఇదే అత్యంత మధురమైనదని విరాట్ కోహ్లీ అన్నాడు. విరాట్ కోహ్లీ బుమ్రాను ప్రశంసించాడు. జస్ప్రీత్ బుమ్రా లాంటి బౌలర్‌ తరానికి ఒకడే ఉంటాడని విరాట్‌ అన్నాడు. డెత్ ఓవర్లలో బుమ్రాను ఎదుర్కోవడం ఈ ప్రపంచంలో ఏ బ్యాటర్‌కు అయినా కష్టమేనని కింగ్‌ కోహ్లీ అన్నాడు. బుమ్రా ప్రపంచంలో ఎనిమిదో వింతని కోహ్లీ ఆకాశానికి ఎత్తేశాడు. టీ 20 ప్రపంచకప్‌ జారిపోతుందని అనుకున్నామని... కానీ చివరి ఐదు ఓవర్లలో అద్భుతం జరిగిందని కోహ్లీ అన్నాడు.ఈ మ్యాచ్‌తో టీ 20 క్రికెట్‌లో తన ప్రస్థానం ముగిసిందని.... కానీ ఈ విజయం తనకు చివరిదాకా గుర్తిండిపోతుందని  కోహ్లీ అన్నాడు. చివరి ఐదు ఓవర్లలో బుమ్రా అద్భుతం చేశాడని.. బూమ్ బూమ్ బూమ్ రా అంటూ కోహ్లీ కామెంట్‌ చేశాడు.

మైదానంలో రోహిత్ ఇంత భావోద్వేగాన్ని ప్రదర్శించడం తాను తొలిసారి చూశానని.. అదొక ప్రత్యేక క్షణమని కోహ్లీ అన్నాడు.


ద్రావిడ్‌ ఏమన్నాడంటే...
 విశ్వ విజేతలుగా నిలిచిన ఈ జట్టు ఒక కుటుంబం లాంటిదని...జట్టులోని ఆటగాళ్లు నమ్మశక్యం కానీ ఓ అద్భుతం చేశారని రాహుల్‌ ద్రావిడ్‌ అన్నాడు. ఎప్పుడూ ఓటమిని ఒప్పుకోవద్దన్న నినాదాన్ని ఆటగాళ్లు అమలు చేశారని మిస్టర్ డిపెండబుల్‌ అన్నాడు.

ఇలాంటి జట్టుకు నాయకత్వం వహించడం తన అదృష్టమన్న రోహిత్ శర్మ తాము భారత్‌లో అడుగుపెట్టినప్పటి నుంచి కలలో కూడా ఊహించని ఘటనలు జరిగాయాని అన్నాడు. ఈ ట్రోఫీ కేవలం మాది మాత్రేమే కాదని యావత్ దేశానిదని రోహిత్ శర్మ అన్నాడు.

ఏ పాటకు డ్యాన్స్‌ అంటే
ప్రపంచ కప్ విజయాన్ని పురస్కరించుకుని వాంఖడేలో నిర్వహించిన విజయ్‌ పరేడ్ తర్వాత జరిగిన సన్మాన కార్యక్రమంలో భారత క్రికెట్ ఆటగాళ్లు దేశీ  పాటలకు నృత్యం చేశారు. కెప్టెన్ రోహిత్ శర్మ, అవుట్‌గోయింగ్ హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ, బుమ్రా ఇలా ప్రతీ ఒక్కరూ ఈ స్వాగతానికి భావోద్వేగానికి గురయ్యారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

PM Kisan Scheme: రైతుల ఖాతాల్లో నగదు జమ, రూ.20000 కోట్లు విడుదల చేసిన ప్రధాని మోదీ - ఇలా చెక్ చేసుకోండి
రైతుల ఖాతాల్లో నగదు జమ, రూ.20000 కోట్లు విడుదల చేసిన ప్రధాని మోదీ - ఇలా చెక్ చేసుకోండి
Revanth Reddy On Musi : మూసీ నిర్వాసితులకు రూ. 10 వేల కోట్లు అయినా ఇస్తాం - పేదలను అడ్డం పెట్టుకుంటున్న పెద్దలు - రేవంత్ విమర్శలు
మూసీ నిర్వాసితులకు రూ. 10 వేల కోట్లు అయినా ఇస్తాం - పేదలను అడ్డం పెట్టుకుంటున్న పెద్దలు - రేవంత్ విమర్శలు
Tirumala News: తిరుమలలో వీఐపీ సంస్కృతి తగ్గించండి- ప్రతి భక్తుడి నుంచి ఫీడ్‌బ్యాక్ తీసుకోవాలి- టీటీడీకి చంద్రబాబు కీలక సూచన
తిరుమలలో వీఐపీ సంస్కృతి తగ్గించండి- ప్రతి భక్తుడి నుంచి ఫీడ్‌బ్యాక్ తీసుకోవాలి- టీటీడీకి చంద్రబాబు కీలక సూచన
Best Budget Cars: రూ.7.5 లక్షల్లో టాప్-5 కార్లు ఇవే - బడ్జెట్ కార్లలో మామూలు పోటీ లేదుగా!
రూ.7.5 లక్షల్లో టాప్-5 కార్లు ఇవే - బడ్జెట్ కార్లలో మామూలు పోటీ లేదుగా!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Nirmal Man Returned from Kuwait: కువైట్‌లో గోట్‌లైఫ్ బతుకు! ఒక్క పోస్ట్‌తో సేఫ్‌గా సొంతూరికిRajendra Prasad: నటుడు రాజేంద్ర ప్రసాద్ ఇంట్లో విషాదంManchu Vishnu on Nagarjuna Issue | నాగార్జున, సమంత, నాగచైతన్య వెంటే ఉంటాం | ABP DesamUdhaynidhi Stalin on Pawan Kalyan Comments | పవన్ కళ్యాణ్ కామెంట్స్ కి ఉదయనిధి కౌంటర్లు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
PM Kisan Scheme: రైతుల ఖాతాల్లో నగదు జమ, రూ.20000 కోట్లు విడుదల చేసిన ప్రధాని మోదీ - ఇలా చెక్ చేసుకోండి
రైతుల ఖాతాల్లో నగదు జమ, రూ.20000 కోట్లు విడుదల చేసిన ప్రధాని మోదీ - ఇలా చెక్ చేసుకోండి
Revanth Reddy On Musi : మూసీ నిర్వాసితులకు రూ. 10 వేల కోట్లు అయినా ఇస్తాం - పేదలను అడ్డం పెట్టుకుంటున్న పెద్దలు - రేవంత్ విమర్శలు
మూసీ నిర్వాసితులకు రూ. 10 వేల కోట్లు అయినా ఇస్తాం - పేదలను అడ్డం పెట్టుకుంటున్న పెద్దలు - రేవంత్ విమర్శలు
Tirumala News: తిరుమలలో వీఐపీ సంస్కృతి తగ్గించండి- ప్రతి భక్తుడి నుంచి ఫీడ్‌బ్యాక్ తీసుకోవాలి- టీటీడీకి చంద్రబాబు కీలక సూచన
తిరుమలలో వీఐపీ సంస్కృతి తగ్గించండి- ప్రతి భక్తుడి నుంచి ఫీడ్‌బ్యాక్ తీసుకోవాలి- టీటీడీకి చంద్రబాబు కీలక సూచన
Best Budget Cars: రూ.7.5 లక్షల్లో టాప్-5 కార్లు ఇవే - బడ్జెట్ కార్లలో మామూలు పోటీ లేదుగా!
రూ.7.5 లక్షల్లో టాప్-5 కార్లు ఇవే - బడ్జెట్ కార్లలో మామూలు పోటీ లేదుగా!
KTR News: ఆ మంత్రిని వదిలిపెట్టను, సీఎం రేవంత్ రెడ్డిపై పరువు నష్టం దావా వేస్తా - కేటీఆర్
ఆ మంత్రిని వదిలిపెట్టను, సీఎం రేవంత్ రెడ్డిపై పరువు నష్టం దావా వేస్తా - కేటీఆర్
Fact Check : కర్ణాటక గుహ నుంచి188 ఏళ్ల వ్యక్తిని రక్షించారా ? వైరల్ న్యూస్‌లో ఎంత నిజం అంటే ?
కర్ణాటక గుహ నుంచి188 ఏళ్ల వ్యక్తిని రక్షించారా ? వైరల్ న్యూస్‌లో ఎంత నిజం అంటే ?
Case Against Nagarjuna : నాగార్జునకు వరుస సమస్యలు -  మాదాపూర్‌ పీఎస్‌లో కబ్జా కేసు నమోదు
నాగార్జునకు వరుస సమస్యలు - మాదాపూర్‌ పీఎస్‌లో కబ్జా కేసు నమోదు
Revanth Reddy To Delhi :  ఢిల్లీ వెళ్లనున్న రేవంత్ - ఈ సారైనా కేబినెట్ విస్తరణకు గ్రీన్ సిగ్నల్ వస్తుందా ?
ఢిల్లీ వెళ్లనున్న రేవంత్ - ఈ సారైనా కేబినెట్ విస్తరణకు గ్రీన్ సిగ్నల్ వస్తుందా ?
Embed widget