అన్వేషించండి

KL Rahul 2nd Test: కేఎల్ రాహుల్‌కు గంభీర్‌ సపోర్ట్‌- ఆడే టీంను సోషల్ మీడియా డిసైడ్ చేయబోదని చురకలు

IND vs NZ Pune Test: రేపటి నుంచి న్యూజిలాండ్‌తో భారత్ రెండో టెస్టు మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్‌లో రాహుల్ అడతాడా లేదా అన్న చర్చ విపరీతంగా జరుగుతోంది. దీనిపై హెడ్ కోచ్‌ గౌతమ్ గంభీర్‌ క్లారిటీ ఇచ్చారు.

IND vs NZ Pune Test: బుధవారం నుంచి పూణెలో భారత్ న్యూజిలాండ్ మధ్య రెండో టెస్టు ప్రారంభంకానుంది. పూణె టెస్టు సందర్భంగా టీమిండియా హెడ్‌కోచ్‌ గౌతమ్ గంభీర్‌ మీడియాతో మాట్లాడారు. కేఎల్ రాహుల భవిష్యత్‌ సహా మీడియా అడిగిన చాలా ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు. 

ప్రస్తుతం ఫామ్‌ లేని కేఎల్ రాహుల్‌ అనేకే విమర్శలు ఎదుర్కొంటున్నాడు. అంతే కాకుండా ఆయన భవిష్యత్‌పై కూడా చాలా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా రెండో టెస్టు ఆయన్ని ఆడిస్తారా లేకుంటే రాహుల్ ప్లేస్‌లో వేరే ఆటగాడిని తీసుకుంటారా అనే చర్చ జోరుగా సాగుతోంది. ఈ విషయాలనే గంభీర్‌ను మీడియా అడిగింది. ప్రస్తుతం కేఎల్ రాహుల్‌కు టీమిండియా అండగా ఉంటుందని గౌతీ చెప్పారు. కాన్పూర్‌లో రాహుల్ ఆడిన ఇన్నింగ్స్‌ను గుర్తు చేశాడు. బెంగళూరు టెస్టులో రాహుల్ ప్రత్యేకంగా ఏం చేయలేకపోయాడని అన్నారు. 

న్యూజిలాండ్‌తో ఆడితే 11 మంది టీమిండియా ఆటగాళ్లను సోషల్ మీడియా డిసైడ్ చేయబోదన్నారు" మేము ఆడే జట్టులో 11 మందిని సోషల్ మీడియా డిసైడ్ చేయదు. అందుకే సోషల్ మీడియాలో ఏమనుకుంటున్నారు, ఏం అంచనాలతో ఉన్నారనే విషయాలు మాకు ముఖ్యం కాదు. టీం యాజమాన్యం ఏమనుకుంటుందనేదేముఖ్యం. అతను (కేఎల్‌రాహుల్) కాన్పూర్‌లో కఠినమైన పిచ్‌లో కూడా మంచి ఇన్నింగ్స్ ఆడాడు. మంచి స్కోర్ చేయాలని కసి ఉంది. అతనికి మేనేజ్‌మెంట్‌ మద్దతు కూడా ఉంది. 

కాన్పూర్‌ టెస్టులో అర్థ శతకం చేసిన రాహుల్ 
బెంగళూరులో న్యూజిలాండ్‌తో జరిగిన మొదటి టెస్టు మ్యాచ్‌లో కేఎల్‌ రాహుల్‌ మొదటి ఇన్నింగ్స్‌లో డకౌట్ అయ్యాడు. రెండో ఇన్నింగ్స్‌లో కేవలం 12 పరుగులు మాత్రమే చేసి వెనుదిరిగాడు. ఈ మధ్య బంగ్లాదేశ్‌తో జరిగిన సిరీస్‌లో కాన్పూర్‌ టెస్టులో 68 పరుగులు చేశాడు. ఈ విషయాన్ని ప్రస్తావించిన గంభీర్‌ రేపటి టెస్టులో రాహుల్ ఉంటాడో లేదో మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. 

పిచ్‌ను రాహుల్‌ ఎందుకు ముద్దాడినట్టు?
బెంగళూరులో మొదటి టెస్టు మ్యాచ్‌లో ఓడిపోయిన తర్వాత గ్రౌండ్‌ను వీడుతున్న టైంలో రాహుల్ చేసిన ఓ చర్య అనుమానాలకు తావిస్తోంది. తోటి ప్లేయర్లతో పెవిలియన్‌కు వస్తున్నప్పుడు పిచ్‌ను ముద్దాడాడు. ఈ విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్‌ అయ్యాయి. దీంతో ఆయన మదిలో రిటైర్మెంట్ ఆలోచన చేస్తున్నారని పుకార్లు షికారు చేస్తున్నాయి. 

టెస్టుల్లో 8 సెంచరీలు చేసిన రాహుల్ 
టీమిండియా తరఫున ఆడిన అన్ని ఫార్మాట్‌లో రాహుల్ తన సత్తా చాటుకున్నాడు. ఇప్పటి వరకు 53 టెస్టుల్లో రాహుల్ ఆడాడు. 8 సెంచరీలు, 15 అర్థ సెంచరీలు చేశాడు. మొత్తంగా 2981 రన్స్‌ చేశాడు. 199 పరుగులే టెస్టుల్లో రాహుల్ అత్యధిక స్కోరు 

Also Read: టీం ఇండియా డైనమిక్ వికెట్ కీపర్ రిషబ్ పంత్ లవ్ స్టోరీ తెలుసా మీకు

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR Legal Notice: వారంలో క్షమాపణలు చెప్పండి- చెప్పను ఏం చేసుకుంటారో చేసుకోండి; కేటీఆర్‌, బండి సంజయ్‌ మధ్య వార్
వారంలో క్షమాపణలు చెప్పండి- చెప్పను ఏం చేసుకుంటారో చేసుకోండి; కేటీఆర్‌, బండి సంజయ్‌ మధ్య వార్
YS Jagan News : రౌడీ షీటర్ చేతిలో హత్యకు గురైన యువతి ఫ్యామిలీకి జగన్ సాయం- ప్రభుత్వం క్షమాపణ చెప్పాలని డిమాండ్ 
రౌడీ షీటర్ చేతిలో హత్యకు గురైన యువతి ఫ్యామిలీకి జగన్ సాయం- ప్రభుత్వం క్షమాపణ చెప్పాలని డిమాండ్ 
Yash On KGF 3: ఊహలకు అందని రీతిలో ‘కేజీఎఫ్ 3’... క్రేజీ అప్డేట్ ఇచ్చిన రాకీ భాయ్
ఊహలకు అందని రీతిలో ‘కేజీఎఫ్ 3’... క్రేజీ అప్డేట్ ఇచ్చిన రాకీ భాయ్
Vasireddy Padma Comments On Jagan: బాధ్యత లేని జగన్ మరోసారి మోసం చేసేందుకు సిద్ధం అవుతున్నారు- వాసిరెడ్డి  పద్మ సంచలన వ్యాఖ్యలు
బాధ్యత లేని జగన్ మరోసారి మోసం చేసేందుకు సిద్ధం అవుతున్నారు- వాసిరెడ్డి  పద్మ సంచలన వ్యాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

బ్రిక్స్ సమ్మిట్‌లో జోక్ వేసిన పుతిన్, పగలబడి నవ్విన మోదీసీఎం ఇంట్లో పెత్తనం ఎవరిది? మా చెల్లెలిదా? నా కూతురిదా?విషం ఎక్కించినా చావని మొండోడు.. హమాస్‌ న్యూ చీఫ్ మాషల్మేం ఉండగా ఒక్క ఘటన లేదు, రేవంత్‌కు కేటీఆర్ స్ట్రాంగ్ వార్నింగ్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR Legal Notice: వారంలో క్షమాపణలు చెప్పండి- చెప్పను ఏం చేసుకుంటారో చేసుకోండి; కేటీఆర్‌, బండి సంజయ్‌ మధ్య వార్
వారంలో క్షమాపణలు చెప్పండి- చెప్పను ఏం చేసుకుంటారో చేసుకోండి; కేటీఆర్‌, బండి సంజయ్‌ మధ్య వార్
YS Jagan News : రౌడీ షీటర్ చేతిలో హత్యకు గురైన యువతి ఫ్యామిలీకి జగన్ సాయం- ప్రభుత్వం క్షమాపణ చెప్పాలని డిమాండ్ 
రౌడీ షీటర్ చేతిలో హత్యకు గురైన యువతి ఫ్యామిలీకి జగన్ సాయం- ప్రభుత్వం క్షమాపణ చెప్పాలని డిమాండ్ 
Yash On KGF 3: ఊహలకు అందని రీతిలో ‘కేజీఎఫ్ 3’... క్రేజీ అప్డేట్ ఇచ్చిన రాకీ భాయ్
ఊహలకు అందని రీతిలో ‘కేజీఎఫ్ 3’... క్రేజీ అప్డేట్ ఇచ్చిన రాకీ భాయ్
Vasireddy Padma Comments On Jagan: బాధ్యత లేని జగన్ మరోసారి మోసం చేసేందుకు సిద్ధం అవుతున్నారు- వాసిరెడ్డి  పద్మ సంచలన వ్యాఖ్యలు
బాధ్యత లేని జగన్ మరోసారి మోసం చేసేందుకు సిద్ధం అవుతున్నారు- వాసిరెడ్డి  పద్మ సంచలన వ్యాఖ్యలు
Southern population politics : దక్షిణాదికి చైనా, జపాన్ తరహా సమస్య వచ్చిందా ? జనాభా పెంచితేనే ఉనికి నిలబడుతుందా ?
దక్షిణాదికి చైనా, జపాన్ తరహా సమస్య వచ్చిందా ? జనాభా పెంచితేనే ఉనికి నిలబడుతుందా ?
Thangalaan OTT: 'తంగలాన్' ఓటీటీ రిలీజ్‌కు తొలగిన అడ్డంకి... బ్యాన్ ఎత్తేసిన కోర్టు, ఎప్పుడు, ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందంటే?
'తంగలాన్' ఓటీటీ రిలీజ్‌కు తొలగిన అడ్డంకి... బ్యాన్ ఎత్తేసిన కోర్టు, ఎప్పుడు, ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందంటే?
Jagan Files Petition Against Sharmila : షర్మిల, విజయమ్మపై జగన్ న్యాయపోరాటం- సరస్వతిలో వాటాలు ఇవ్వడం లేదని పిటిషన్
షర్మిల, విజయమ్మపై జగన్ న్యాయపోరాటం- సరస్వతిలో వాటాలు ఇవ్వడం లేదని పిటిషన్
BSNL New Logo: బీఎస్‌ఎన్‌ఎల్‌ లోగో కలర్‌ఫుల్‌గా మారింది, గమనించారా? - కాల్‌ ఛార్జీల పెంపుపైనా అప్‌డేట్‌
బీఎస్‌ఎన్‌ఎల్‌ లోగో కలర్‌ఫుల్‌గా మారింది, గమనించారా? - కాల్‌ ఛార్జీల పెంపుపైనా అప్‌డేట్‌
Embed widget