భారత క్రికెటర్ కేఎల్ రాహుల్ నేటితో 32వ సంవత్సరంలోకి అడుగుపెట్టాడు. ఇప్పటివరకు క్రికెట్‌లో కేఎల్ రాహుల్ బద్దలు కొట్టిన రికార్డులు చూద్దాం. వన్డే వరల్డ్ కప్‌లో వేగవంతమైన సెంచరీ చేసిన ఇండియన్ బ్యాటర్ (62 బంతుల్లో). టెస్టుల్లో వరుసగా ఏడు సార్లు 50కి పైగా స్కోరు చేసిన ఒకే ఒక్క భారతీయ బ్యాటర్. అంతర్జాతీయ టీ20ల్లో ఛేజింగ్‌లో రెండు సెంచరీలు చేసిన ఒకే ఒక ఇండియన బ్యాట్స్‌మెన్. టీ20 వరల్డ్ కప్‌ల్లో వరుసగా మూడు హాఫ్ సెంచరీలు చేసిన మొదటి భారతీయ బ్యాటర్. ఒక వరల్డ్ కప్‌లో అత్యధిక పరుగులు చేసిన ఇండియన్ వికెట్ కీపర్ బ్యాటర్ (452 పరుగులు). ఐపీఎల్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోరు చేసిన కెప్టెన్ (132 నాటౌట్). ఐపీఎల్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోరు చేసిన భారతీయ ఆటగాడు (132 నాటౌట్). ఐపీఎల్ చరిత్రలో రెండో వేగవంతమైన అర్థ సెంచరీ (14 బంతుల్లో).