Team India: నిను వీడని నీడను నేనే - టీమిండియాను తీవ్రంగా వేధిస్తున్న సమస్య అదే!
19వ ఓవర్ సరిగ్గా బౌల్ చేయలేకపోవడం టీమిండియాకు పెద్ద సమస్యగా మారింది.
IND vs SL 2nd T20I: భారత జట్టుకు, ఐసీసీ ట్రోఫీలకు మధ్య ఉన్న అడ్డంకుల్లో 19వ ఓవర్ సమస్య అతి పెద్దది. లక్ష్యాన్ని కాపాడుకునేటప్పుడు అయినా, మొదట బౌలింగ్ చేస్తున్నప్పుడు అయినా 19వ ఓవర్లో పరుగులు కాపాడుకోవడం చాలా అవసరం. ఈ విషయంలో భారత్ ఇప్పటికీ గుణపాఠం నేర్చుకోలేదని అనిపిస్తుంది.
శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో కూడా ఇన్నింగ్స్ 19వ ఓవర్లో భారత జట్టు వెనుకబడింది. భారత్ - శ్రీలంక మధ్య జరుగుతున్న రెండో టీ20 మ్యాచ్‌లో ఫాస్ట్ బౌలర్ అర్ష్‌దీప్ సింగ్ ఇన్నింగ్స్ 19వ ఓవర్‌లో ఒక నోబాల్‌తో మొత్తం 18 పరుగులు సమర్పించుకున్నాడు. 19వ ఓవర్లో పరుగులు ఇచ్చుకోవడం భారత జట్టుకు చాలా కాలంగా సమస్యగా మారింది. 2022లో ఆడిన టీ20 ప్రపంచకప్‌లో కూడా టీమిండియా ముందు ఈ సమస్య తలెత్తింది. ఇప్పుడు మళ్లీ ఇన్నింగ్స్ 19వ ఓవర్ సమస్య మనకు తలెత్తింది. ఇలాంటి పరిస్థితుల్లో భారత జట్టు దీనిపై ఆలోచించాలి.
గత మ్యాచ్‌లో కూడా
అంతకుముందు వాంఖడే వేదికగా శ్రీలంకతో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో ఇన్నింగ్స్ 19వ ఓవర్ ఇబ్బంది పెట్టింది. ఆ మ్యాచ్‌లో భారత్ బౌలింగ్ వేసిన ఇన్నింగ్స్ 19వ ఓవర్లో 16 పరుగులు వచ్చాయి. ఆ మ్యాచ్‌లో ఫాస్ట్ బౌలర్ హర్షల్ పటేల్ 19వ ఓవర్ వేశాడు. ఈ మ్యాచ్‌లో అతని స్థానంలో జట్టులోకి వచ్చిన అర్ష్‌దీప్ సింగ్ 19వ ఓవర్ బౌల్ చేశాడు. అది కూడా కాస్ట్లీగా మారింది.
టచ్‌లో కనిపించిన షనక
భారత జట్టుపై శ్రీలంక కెప్టెన్ దసున్ షనక మరోసారి అద్భుతమైన లయలో కనిపించాడు. ఈ మ్యాచ్‌లో అతను 22 బంతుల్లో 56 పరుగులు సాధించి అజేయంగా నిలిచాడు. అతని ఇన్నింగ్స్‌లో రెండు ఫోర్లు, ఆరు సిక్సర్లు ఉన్నాయి. అతని స్ట్రైక్ రేట్ 254.55గా ఉంది.
అంతకుముందు మ్యాచ్‌లో కూడా అతను 27 బంతుల్లో మూడు ఫోర్లు, మూడు సిక్సర్ల సాయంతో 45 పరుగులతో మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. షనక ఇప్పటివరకు టీ20 ఇంటర్నేషనల్‌లో భారత జట్టుపై 5 ఇన్నింగ్స్‌లు ఆడాడు. అతను తన ప్రతి ఇన్నింగ్స్‌లో 30 పరుగుల మార్కును దాటాడు, రెండు అర్ధ సెంచరీలు చేశాడు. అతను ఇప్పటివరకు భారత్‌పై 205.64 స్ట్రైక్ రేట్‌తో 255 పరుగులు చేశాడు.
View this post on Instagram