Rohit Sharma: ఇంగ్లండ్‌తో జరిగే సెమీస్‌లో భారత్ గేమ్‌ప్లాన్ - రివీల్ చేసిన రోహిత్!
టీమిండియా మేనేజ్‌మెంట్ ఎదురుచూసిన ఆల్‌రౌండ్ ప్రదర్శన ఇదేనని కెప్టెన్ రోహిత్ శర్మ అన్నాడు.
ఐసీసీ టి20 ప్రపంచకప్ సూపర్ 12 మ్యాచ్‌లో జింబాబ్వేపై 71 పరుగుల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా భారత కెప్టెన్ రోహిత్ శర్మ గురువారం అడిలైడ్‌లో ఇంగ్లండ్‌తో జరిగే సెమీఫైనల్ పోరుకు ముందు పరిస్థితులకు వీలైనంత త్వరగా సర్దుబాటు చేసుకోవడం చాలా ముఖ్యం అన్నాడు. సూర్యకుమార్ యాదవ్ మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడడంతో భారత్ 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 186 పరుగులు చేసింది. దాని తర్వాత అద్భుతమైన బౌలింగ్‌తో జింబాబ్వేను 115 పరుగులకే కట్టడి చేసింది.
"మేం ఎదురు చూసిన మంచి ఆల్‌రౌండ్ ప్రదర్శన ఇదే. సూర్యకుమార్ యాదవ్ జట్టుకు ఎంతో ప్లస్. అతని సామర్థ్యం మాకు తెలుసు. అది ఇతర కుర్రాళ్లకు కూడా క్రీజులో నిలదొక్కుకునే సమయం ఇస్తుంది. అతను బ్యాటింగ్ చేసినప్పుడు చాలా ప్రశాంతంగా ఉంటాడు." అని రోహిత్ మ్యాచ్ అనంతరం చెప్పాడు.
"సెమీఫైనల్‌లో వీలైనంత త్వరగా పరిస్థితులకు సర్దుబాటు అవ్వడం మాకు కీలకం. మేం సెమీస్ జరిగే మైదానంలో ఒక మ్యాచ్ ఆడాం కానీ ఇంగ్లాండ్ మాకు మంచి సవాలును అందిస్తుంది. వారు మంచి క్రికెట్ ఆడుతున్నారు. ఇది గొప్ప పోటీ అవుతుంది. ఇది చాలా ఒత్తిడితో కూడిన గేమ్. ఇక్కడ పరిస్థితులకు వీలైనంత వేగంగా సర్దుకోగలగాలి." అన్నాడు.
"అభిమానులు అద్భుతంగా ఉన్నారు. దాదాపు మేం వెళ్లిన ప్రతిచోటా స్టేడియం హౌస్ ఫుల్ అయింది. సెమీఫైనల్‌లో కూడా స్టేడియం నిండుతుందని ఆశిస్తున్నాం. వారికి హ్యాట్సాఫ్. జట్టు తరపున నేను వారికి ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నాను." అని ముగించాడు.
View this post on Instagram
View this post on Instagram