AUS Vs IRE: ఆస్ట్రేలియాకు మరో విజయం - ఐర్లాండ్‌పై 42 పరుగులతో గెలుపు!
ఐర్లాండ్‌తో జరిగిన టీ20 ప్రపంచకప్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 42 పరుగులతో విజయం సాధించింది.
టీ20 ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియాకు రెండో విజయం లభించింది. ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 42 పరుగులతో ఘనవిజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది. అనంతరం ఐర్లాండ్‌ను 18.1 ఓవర్లలో 137 పరుగులకే ఆలౌట్ చేశారు. దీంతో ఆస్ట్రేలియా ఈ టోర్నీలో రెండో విజయం సాధించి పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి దూసుకెళ్లింది.
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఐర్లాండ్ మొదట బౌలింగ్ ఎంచుకుంది. దీంతో ఆస్ట్రేలియా బ్యాటింగ్‌కు దిగింది. ఓపెనర్ డేవిడ్ వార్నర్ (3: 7 బంతుల్లో) త్వరగానే అవుట్ అయినా... కెప్టెన్ ఆరోన్ ఫించ్ (63: 44 బంతుల్లో, ఐదు ఫోర్లు, మూడు సిక్సర్లు), మిషెల్ మార్ష్ (28: 22 బంతుల్లో, రెండు ఫోర్లు, రెండు సిక్సర్లు) ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. వీరిద్దరూ రెండో వికెట్‌కు 52 పరుగులు జోడించారు. తర్వాత మార్ష్ అవుటయినా, మార్కస్ స్టోయినిస్ (35: 25 బంతుల్లో, మూడు ఫోర్లు, ఒక సిక్సర్) రాణించాడు. దీంతో ఆస్ట్రేలియా 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది. ఐర్లాండ్ బౌలర్లలో బారీ మెక్‌కార్తీ మూడు, జోషువా లిటిల్ రెండు వికెట్లను తీసుకున్నారు.
అనంతరం ఐర్లాండ్ ఏ దశలోనూ లక్ష్యం దిశగా సాగలేదు. వికెట్ కీపర్ బ్యాటర్ లోర్కాన్ టక్కర్ (71 నాటౌట్: 48 బంతుల్లో, తొమ్మిది ఫోర్లు, ఒక సిక్సర్) మినహా ఎవరూ కనీసం 15 పరుగులు కూడా చేయలేకపోయారు. ఒక ఎండ్‌లో టక్కర్ పోరాడినా, మరో ఎండ్‌లో తనకు సహకారం కరువైంది. దీంతో ఐర్లాండ్ 18.1 ఓవర్లలో 137 పరుగులకు ఆలౌట్ అయింది. ఆస్ట్రేలియా బౌలర్లలో ప్యాట్ కమిన్స్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, మిషెల్ స్టార్క్, ఆడం జంపాలకు రెండేసి వికెట్లు దక్కాయి. మార్కస్ స్టోయినిస్ ఒక వికెట్ ఒక వికెట్ తీసుకున్నాడు.
View this post on Instagram
View this post on Instagram