బాబర్ అజాం స్వార్థపూరితంగా ఆలోచిస్తున్నాడు: గంభీర్
ఒక కెప్టెన్ కు వ్యక్తిగత ప్రయోజనాల కన్నా జట్టు ప్రయోజనాలే ముఖ్యమని గౌతం గంభీర్ అన్నాడు. పాక్ సారథి బాబర్ అజాం స్వార్థపూరితంగా ఆలోచిస్తున్నాడని విమర్శించాడు.
నాయకుడిగా జట్టు అవసరాన్ని గుర్తించడం చాలా అవసరమని భారత మాజీ ఆటగాడు గౌతం గంభీర్ అన్నాడు. వ్యక్తిగత ప్రయోజనాల కన్నా జట్టు ప్రయోజనాలే ముఖ్యమని అన్నాడు. పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ అజాంను ఉద్దేశించి గంభీర్ ఈ వ్యాఖ్యలు చేశాడు. పాక్ కెప్టెన్ బాబర్ అజాం ఈ టీ20 ప్రపంచకప్ లో తన స్థాయికి తగినట్లు రాణించలేదు. సూపర్- 12 దశలో దారుణంగా విఫలమయ్యాడు. అయితే కీలకమైన సెమీస్ లో న్యూజిలాండ్ పై అర్థశతకంతో రాణించి జట్టు విజయంలో భాగమయ్యాడు.
కెప్టెన్ కు జట్టు ప్రయోజనాలే ముఖ్యం
ఈ క్రమంలో గౌతం గంభీర్ బాబర్ గురించి కీలక వ్యాఖ్యలు చేశాడు. జట్టు కోసం అతడు బ్యాటింగ్ స్థానాన్ని మార్చుకుని ఉండాల్సిందని అభిప్రాయపడ్డాడు. బాబర్ మూడో స్థానంలో రావాలని సూచించాడు. ఒక కెప్టెన్ కు ఎప్పుడూ జట్టు ప్రయోజనాలే ప్రథమ స్థానంలో ఉండాలని అన్నాడు. నాయకుడిగా ముందు జట్టు గురించి ఆలోచించాలి. ఫఖార్ జమాన్ ను బ్యాటింగ్ స్థానంలో ముందు పంపాలి. బాబర్ అజాం, మహ్మద్ రిజ్వాన్ ఓపెనింగ్ చేస్తూ రికార్డులు సృష్టింస్తుండొచ్చు. అవి జట్టుకు ఉపయోగపడుతున్నాయా లేదా అనేది ఆలోచించాలి. వ్యక్తిగత రికార్డులు చూసుకోవడం స్వార్థపూరితం అవుతుంది. సారథిగా ఉండాలంటే ముందు జట్టు గురించి ఆలోచించాలి అని గంభీర్ అన్నాడు. చాలామంది పాక్ మాజీలు సైతం బాబర్ తన బ్యాటింగ్ ఆర్డర్ ను మార్చుకోవాలని సూచించారు.
టీ20 ప్రపంచకప్ లో బాబర్ అజాం ఘోరంగా విఫలమయ్యాడు. భారత్ పై గోల్డెన్ డకౌట్ అయిన అతను జింబాబ్వే,నెదర్లాండ్స్ తో మ్యాచులో 4 పరుగులే చేశాడు. భారత్ తో జరిగిన మ్యాచులో ఆఖరి ఓవర్ మహ్మద్ నవాజ్ కు ఇవ్వడాన్ని పాక్ మాజీలే విమర్శించారు. దీంతో బాబర్ కెప్టెన్సీ కూడా చర్చనీయాంశమైంది. అయితే కీలకమైన సెమీస్ మ్యాచులో రాణించిన బాబర్ ఫాంలోకి వచ్చినట్లే కనిపిస్తోంది.
ఫైనల్ అనుమానమే!
నవంబర్ 13న జరిగే ఫైనల్ లో పాకిస్థాన్- ఇంగ్లండ్ తలపడనున్నాయి. అయితే ఈ మ్యాచుకు వర్షం అడ్డంకిగా మారే అవకాశం ఉంది. భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 1:30 గంటలకు పాకిస్థాన్, ఇంగ్లాండ్ మధ్య ఫైనల్ జరగాల్సి ఉంది. లానినా ప్రభావం వల్ల ఈ పోరు అంత ఈజీగా జరిగేలా కనిపించడం లేదు. శనివారం నుంచి గురువారం వరకు అక్కడ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ, వెబ్‌సైట్లు అంచనా వేస్తున్నాయి. ఇప్పటికే ఈ ప్రపంచకప్‌లో నాలుగు మ్యాచులు వరుణుడి ఖాతాలో చేరిన సంగతి తెలిసిందే.
Pak vs Eng final ❣️
— ⭐⭐ (@sighh_hh) November 6, 2022
What do you guys think?#Semifinal #T20WorldCup2022 pic.twitter.com/6lTW1BcTMh