T20 World Cup 2024: జూన్ 9న మహా సంగ్రామం, భారత్- పాక్ మ్యాచ్ ఆరోజే..
IND vs PAK: క్రికెట్ ప్రేమికులు ఆసక్తిగా ఎదురు చూస్తోన్న టీ20 ప్రపంచకప్ 2024 షెడ్యూల్ వచ్చేసింది.ఈ టోర్నీలో అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూసే దాయాదుల సమరం న్యూయార్క్ వేదికగా జూన్ 9న జరగనుంది.
![T20 World Cup 2024: జూన్ 9న మహా సంగ్రామం, భారత్- పాక్ మ్యాచ్ ఆరోజే.. T20 World Cup 2024 India vs Pakistan Match Date Time Venue team squads other details T20 World Cup 2024: జూన్ 9న మహా సంగ్రామం, భారత్- పాక్ మ్యాచ్ ఆరోజే..](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/01/05/70e4ec5aad240fabcba5b6862bccfb151704467027760872_original.png?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
క్రికెట్ ప్రేమికులు ఆసక్తిగా ఎదురు చూస్తోన్న టీ20 ప్రపంచకప్ 2024 (T 20 World Cup 2024)షెడ్యూల్ వచ్చేసింది. జూన్ 1 నుంచి పొట్టి ప్రపంచకప్ ప్రారంభం కానుండగా తొలి మ్యాచ్‌లో ఆతిథ్య అమెరికాతో కెనడా తలపడబోతోంది. జూన్ 1న ప్రారంభంకానున్న టీ 20 ప్రపంచకప్ జూన్ 29న ముగుస్తుంది. ఈ టోర్నీలో మొత్తం 20 జట్లు నాలుగు గ్రూపుల్లో పోటీ పడతాయి. తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు నాకౌట్‌కు చేరుకుంటాయి. ఈ మెగా టోర్నీలో గ్రూప్ ఏ లో భారత్, పాకిస్థాన్ జట్లు ఉన్నాయి. అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూసే దాయాదుల సమరం న్యూయార్క్ వేదికగా జూన్ 9న జరగనుంది. టీమిండియా గ్రూప్ దశలో జూన్ అయిదున ఐర్లాండ్‌తో 12న అమెరికాతో 15న కెనడాతో తలపడనుంది.
టీ 20 ప్రపంచకప్‌లో భారత్ షెడ్యూల్
ఇండియా vs ఐర్లాండ్ - జూన్ 5 (న్యూయార్క్)
ఇండియా vs పాకిస్థాన్ - జూన్ 9 ( న్యూయార్క్)
ఇండియా vs యూఎస్‌ఏ - జూన్ 12 (న్యూయార్క్)
ఇండియా vs కెనడా - జూన్ 15 (ఫ్లోరిడా)
భారత్ వేదికగా జరిగిన వన్డే ప్రపంచకప్‌ను విజయంవంతంగా నిర్వహించిన ఐసీసీ... 2024లో టీ 20 ప్రపంచకప్ నిర్వహణకు సిద్ధమైంది. వెస్టిండీస్-అమెరికా సంయుక్తంగా నిర్వహించే ఈ మెగా టోర్నీ కోసం అన్ని ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి.
2022 జరిగిన పొట్టి ప్రపంచకప్‌లో 16 జట్లు పోటీ పడగా ఈ సారి మాత్రం 20 జట్లు తలపడనున్నాయి. ఐసీసీ 12 జట్లకు నేరుగా అర్హత కల్పించింది. 2022 టీ20 ప్రపంచకప్‌లో టాప్-8 స్థానాల్లో నిలిచిన ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, భారత్, పాకిస్తాన్, న్యూజిలాండ్, శ్రీలంక, దక్షిణాఫ్రికా, నెదర్లాండ్స్ జట్లలతో పాటు అతిథ్య హోదాలో అమెరికా, వెస్టిండీస్ లతో కలిపి మొత్తం 10 జట్లు నేరుగా అర్హత పొందాయి. టీ20 ర్యాంకింగ్స్‌లో తొమ్మిది, పది స్థానాల్లో నిలిచిన అఫ్గానిస్థాన్ , బంగ్లాదేశ్‌లు కూడా నేరుగా అర్హత సాధించాయి. మిగిలిన 8 స్థానాల కోసం రీజియన్ల వారీగా క్వాలిఫయింగ్ పోటీలను నిర్వహించి విజేతలను టీ 10 ప్రపంచకప్‌నకు అర్హత కల్పించారు. వచ్చే ఏడాది జరిగే ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, భారత్, పాకిస్తాన్, న్యూజిలాండ్, శ్రీలంక, దక్షిణాఫ్రికా, నెదర్లాండ్స్, యూఎస్, వెస్టిండీస్, అఫ్గానిస్థాన్ , బంగ్లాదేశ్, కెనడా, నేపాల్, ఒమన్, పపువా న్యూ గినియా, ఐర్లాండ్, స్కాంట్లాండ్, ఉగాండ, నబీబియా పాల్గొననున్నాయి. వన్డే ప్రపంచకప్ ఫైనల్లో ఓటమిని.. టీ 20 ప్రపంచకప్‌ను కైవసం చేసుకుని మరిపించాలని టీమిండియా కోరుకుంటోంది.
అయితే ఈ టీ 20 ప్రపంచకప్‌లో స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ బరిలోకి దిగుతాడా లేదా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. 2022లో జరిగిన టీ20 ప్రపంచకప్ సెమీ ఫైనల్‌లో భారత జట్టు ఓడిపోయిన తరువాత ఈ ఫార్మాట్‌లో టీమ్ఇండియా తరుపున కోహ్లీ మరో టీ20 మ్యాచ్ ఆడలేదు. దీంతో టీ 20 క్రికెట్‌కు విరాట్ వీడ్కోలు పలికినట్లేనని... అతడి స్థానంలో మరో ఆటగాడి ఎంపికపై అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ కసరత్తులు చేస్తోందని వార్తలు వస్తున్నాయి. మరో ఆరు నెలల్లో వెస్టిండీస్, అమెరికాల్లో టీ20 వరల్డ్‌కప్ జరుగబోతోంది. ఈ మెగా టోర్నీలో కోహ్లీ అవసరం ఉండకపోవచ్చని చాలామంది వ్యాఖ్యానిస్తుండడం కలకలం సృష్టిస్తోంది. విరాట్‌ను వన్‌డౌన్‌లో పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం లేదనే బీసీసీఐ భావిస్తోందన్న వార్తలు వస్తున్నాయి.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)