TATA Affordable Cars: రూ.10 లక్షల లోపు టాటా కార్లు.. టాటా టియాగో, పంచ్, ఆల్ట్రోజ్, టిగోర్ ఫీచర్లు చూశారా
Affordable TATA Cars Under 10 Lakhs: రూ.10 లక్షల లోపు టాటా బడ్జెట్ ఫ్రెండ్లీ కార్లు టాటా టియాగో, టాటా పంచ్, టాటా టిగోర్, టాటా ఆల్ట్రోజ్ ధరల వివరాలు ఇలా ఉన్నాయి.

భారతదేశంలో మీరు రూ. 10 లక్షల లోపు టాటా కారు కొనాలని ప్లాన్ చేస్తున్నారా? ప్రజలు అత్యంత నమ్మదగిన బ్రాండ్లలో ఒకటైన టాటా కార్ల ధరలు తెలుసుకుంటే మీకు ప్రయోజనం ఉంటుంది. మీ బడ్జెట్ తగ్గట్లుగా టాటా మోటార్స్ పది లక్షల లోపు మార్కెట్లోకి తీసుకొచ్చిన కొన్ని మోడల్ కార్ల ధర, ఫీచర్లు ఇక్కడ తెలుసుకోండి. టాటా పంచ్, టాటా ఆల్ట్రోజ్, టాటా టియాగో, టాటా టిగోర్ ఈ శ్రేణిలో అత్యంత ప్రజాదరణ పొందిన కార్లుగా నిలిచాయి. పెట్రోల్, డీజిల్ ధరలతో ఇబ్బంది పడుతుంటే మీకు CNG ఆప్షన్లలో, ఎలక్ట్రిక్ లోనూ కార్లు మార్కెట్లో ఉన్నాయి.
టాటా టియాగో
టాటా టియాగో దేశంలో నాల్గవ అత్యంత చౌకైన కారుగా ఉంది. గతంలో టియాగో XE వేరియంట్ ధర ₹4.99 లక్షలు ఉండేది, కానీ GST తగ్గింపు తర్వాత ₹4.57 లక్షల నుంచి దీని ధర ప్రారంభమవుతుంది. తక్కువ ధర మోడల్ లోనే సుమారు ₹42,500 ప్రయోజనం పొందవచ్చు. కారు నాణ్యత, స్టైలిష్ లుక్‌లతో టియాగోను ఈ ధర వద్ద డబ్బుకు ప్రయోజనం కలుగుతుంది. ఈ కారు రూ.4.57 లక్షల నుంచి రూ.7.82 లక్షల వరకు ఉంది. కాంపాక్ట్ సెడాన్ కోసం చూస్తున్న వారికి బెస్ట్ ఛాయిస్.
టాటా టిగోర్ కొత్త ధర
సెప్టెంబర్ 22 నుండి కొత్త GST రేట్లు తరువాత టాటా మోటార్స్ రెండవ చౌకైన కారు టిగోర్ ₹80,000 వరకు చౌకగా లభిస్తుంది. టాటా టిగోర్ ఎక్స్-షోరూమ్ ధర ₹6 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. గరిష్టంగా రూ.8.74 లక్షల ధరకు కొనుగోలు చేయవచ్చు. టిగోర్ బేస్ మోడల్ పూర్తిగా డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, స్మార్ట్ స్టీరింగ్ వీల్‌తో వస్తుంది.
బేస్ XE ట్రిమ్ లెవల్‌లో కొత్త ఫాబ్రిక్ సీట్లు, ISOFIX, వెనుక పార్కింగ్ సెన్సార్లు, LED టెయిల్‌లైట్లు వంటివి ఉన్నాయి. టియాగో 2025లో అప్డేట్ చేసిన అప్హోల్స్టరీ, డ్రైవర్ డిస్‌ప్లే కూడా ఉన్నాయి. అయితే ఇది HD రివర్స్ కెమెరాతో 10.25-అంగుళాల స్క్రీన్‌తో వస్తుంది.
టాటా ఆల్ట్రోజ్ డీజిల్
భారత మార్కెట్లో డీజిల్ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్‌లలో టాటా ఆల్ట్రోజ్ ఒకటి. ఇది 90 PS పవర్, 200 Nm టార్క్ జనరేట్ చేసే 1.5 లీటర్ టర్బోడీజిల్ ఇంజిన్‌తో వస్తుంది. ఇది 23.64 kmpl మైలేజీతో ఆకట్టుకుంటోంది. GST తగ్గింపు తర్వాత, ఆల్ట్రోజ్ డీజిల్ ఇప్పుడు ₹8.10 లక్షల (ఎక్స్-షోరూమ్) నుండి రూ. 10 లక్షల వరకు ధరలలో మోడల్స్ ఉన్నాయి. ఆల్ట్రోజ్ క్వాలిటీ డిజైన్, ప్రీమియం లక్షణాలతో మధ్యతరగతి వినియోగదారులు సైతం కొనుగోలు చేస్తున్నారు.
టాటా పంచ్
ఇందులో మైక్రో ఎస్‌యూవీ ఫీచర్లు ఉన్నాయి. టాటా పంచ్ CNG ట్విన్ సిలిండర్ సాంకేతికతను కలిగి ఉంది. ఇందులో 1.2 లీటర్ ఇంజిన్ ఉంది, ఇది 26.99 km/kg మైలేజ్ ఇస్తుంది. రూ. 6.68 లక్షలు ప్రారంభ ధరతో మార్కెట్లో విక్రయాలు జరుగుతున్నాయి. టాప్ వేరియంట్ రూ. 9.15 లక్షల వరకు ఉంది. మీరు CNG SUV కొనుగోలు చేయాలని ఆలోచిస్తున్నారా, మీరు రూ. 6.68 లక్షల నుంచి రూ. 14.57 లక్షల వరకు ధరలలో పలు మోడల్స్ ఉన్నాయి.






















