Ravi Teja : భర్తలకు మాస్ మహారాజ రవితేజ రిక్వెస్ట్ - 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' ఫస్ట్ లుక్, గ్లింప్స్ వచ్చేసింది
RT76 Update : 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' అంటూ క్లాస్ టైటిల్‌తో మాస్ మహారాజ రవితేజ రాబోతున్నారు. ఈ మూవీ నుంచి రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ ఆకట్టుకుంటోంది.

Ravi Teja's First Look From RT76 Movie : మాస్ మహారాజ రవితేజ రీసెంట్‌గా మాస్ ఎంటర్టైనర్ 'మాస్ జాతర'తో ఆడియన్స్‌ను ఎంటర్టైన్ చేశారు. బాక్సాఫీస్ వద్ద మూవీ మిక్స్‌డ్ టాక్ తెచ్చుకున్నా వింటేజ్ రవితేజ లుక్, మాస్ యాక్షన్ అదిరిపోయాయంటూ కామెంట్స్ వచ్చాయి. ఆయన నెక్స్ట్ మూవీ కిశోర్ తిరుమల దర్శకత్వంలో చేస్తుండగా ఈ ప్రాజెక్టుకు క్లాసిక్ టైటిల్ ఫిక్స్ చేశారు.
'భర్త మహాశయులకు విజ్ఞప్తి' అంటున్న రవితేజ
సాధారణంగా రవితేజ అంటే మాస్... మాస్ అంటే రవితేజ. కానీ ఈసారి డిఫరెంట్‌గా ఓ క్లాస్ టైటిల్‌తో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసేందుకు రెడీ అవుతున్నారు మాస్ మహారాజ. మనం రోజూ గుడిలో వినే 'భక్త మహాశయులకు విజ్ఞప్తి' అనే కామెంట్‌ను ట్రెండింగ్‌గా 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' అంటూ భర్తలకు ఏదో సందేశం ఇచ్చేందుకు రాబోతున్నారు. పెళ్లైన మగాళ్లకు ఈ మూవీతో ఏదో సూచన చేయబోతున్నారని అర్థమవుతోంది. ఈ క్రమంలో రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్, టైటిల్ గ్లింప్స్ ఆకట్టుకుంటున్నాయి. 'పెళ్లైన భర్తలను ఈ రెండు ప్రశ్నలు ఎవరూ అడగకూడదు' అంటూ రవితేజ ఇంట్రెస్ట్ క్రియేట్ చేశారు. మరి ఆ ప్రశ్నలేంటో తెలియాలంటే మూవీ రిలీజ్ వరకూ ఆగాల్సిందే.
'నేను శైలజ', 'ఉన్నది ఒకటే జిందగీ', 'చిత్ర లహరి', 'రెడ్', 'ఆడాళ్లూ మీకు జోహార్లు' సినిమాలు తెరకెక్కించిన కిశోర్ తిరుమల దాదాపు మూడేళ్ల తర్వాత మాస్ హీరో క్లాస్ టైటిల్‌తో వస్తుండడంతో భారీ హైప్ క్రియేట్ అవుతోంది. రవితేజ కెరీర్‌లో ఇది 76వ మూవీ. మూవీలో రవితేజ సరసన కేతికా శర్మ, ఆషికా రంగనాథ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. వెన్నెల కిశోర్, సునీల్, మురళీధర్ గౌడ్, సత్య తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఎస్ఎల్‌వీ సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్ అందిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ శరవేగంగా సాగుతుండగా... వచ్చే ఏడాది సంక్రాంతికి సినిమా ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు.
Also Read : నా భర్త హీరోయిన్స్‌తో ఎక్కువ ఉండేవాడు - బాలీవుడ్ హీరోపై భార్య సెన్సేషనల్ కామెంట్స్
ఓటీటీ డీల్ ఫిక్స్
ఇక రిలీజ్‌కు ముందే ఈ మూవీ ఓటీటీ డీల్ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. డిజిటల్, శాటిలైట్ రైట్స్‌ను భారీ ధరకు Zee గ్రూప్ సొంతం చేసుకుంది. థియేట్రికల్ రన్ తర్వాత ZEE5 ఓటీటీలో స్ట్రీమింగ్ కానుండగా... జీ తెలుగు, జీ సినిమాలు ఛానళ్లలో ప్రీమియర్ కానుంది.
అందరికి విజ్ఞప్తి 📣
— SLV Cinemas (@SLVCinemasOffl) November 10, 2025
ముఖ్యంగా..
భర్త మహాశయులకు విజ్ఞప్తి 🙏
RT76 is #BharthaMahasayulakuWignyapthi ❤️🔥#Wignyapthi1 : Title Glimspe 📢
▶️ https://t.co/DhgYxYRWQr#BMW in Cinemas Sankranthi 2026 🥳@RaviTeja_offl @DirKishoreOffl @sudhakarcheruk5 @AshikaRanganath @DimpleHayathi… pic.twitter.com/NhgW8vDgQr





















