Mithra Mandali OTT : ఓటీటీలో దుమ్ము రేపుతున్న 'మిత్ర మండలి' - ట్రెండింగ్‌లో లేటెస్ట్ కామెడీ ఎంటర్టైనర్
Mithra Mandali OTT Review : రీసెంట్ కామెడీ ఎంటర్టైనర్ 'మిత్ర మండలి' ఓటీటీలో దుమ్ము రేపుతోంది. దేశవ్యాప్తంగా టాప్ 2 ట్రెండింగ్‌లో ఉందని చిత్ర నిర్మాతలు హర్షం వ్యక్తం చేశారు.

Priyadarshi's Mithra Mandali OTT Response Trending : టాలీవుడ్ యంగ్ హీరో ప్రియదర్శి, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ నిహారిక ఎన్ఎం ప్రధాన పాత్రల్లో నటించిన రీసెంట్ కామెడీ ఎంటర్టైనర్ 'మిత్ర మండలి'. అక్టోబర్ 16న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద మిక్స్‌డ్ టాక్ సొంతం చేసుకుంది. ఆ తర్వాత 20 రోజుల్లోపే ఈ నెల 6న ఓటీటీలో అందుబాటులోకి వచ్చింది.
టాప్ ట్రెండింగ్‌లో మూవీ
ఓటీటీలోకి వచ్చిన 4 రోజుల్లోనే మంచి రెస్పాన్స్ అందుకుంది మూవీ. ప్రముఖ ఓటీటీ 'అమెజాన్ ప్రైమ్ వీడియో'లో స్ట్రీమింగ్ అవుతుండగా... దేశవ్యాప్తంగా టాప్ 2 ట్రెండింగ్‌లో నిలిచినట్లు మూవీ టీం వెల్లడించింది. ప్రస్తుతం టాప్‌లో ఉన్న రిషబ్ శెట్టి 'కాంతార'కు పోటీగా నిలుస్తూ ఓటీటీ లవర్స్‌ను ఎంటర్టైన్ చేస్తుందని తెలిపింది. దీనిపై హర్షం వ్యక్తం చేసింది.
ఈ మూవీకి ఎస్.విజయేంద్ర దర్శకత్వం వహిస్తుండగా... ప్రియదర్శి, నిహారికలతో పాటు రాగ్ మయూర్, విష్ణు ఓయ్, ప్రసాద్ బెహర, సత్య, వెన్నెల కిశోర్, వీటీవీ గణేష్ కీలక పాత్రలు పోషించారు. ఫేమస్ ప్రొడ్యూసర్ బన్నీ వాస్ సమర్పణలో... సప్తాశ్వ మీడియా వర్క్స్, వైరా ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మించాయి. ఆర్ ఆర్ ధ్రువన్ మ్యూజిక్ అందించారు. డైరెక్టర్ విజయేంద్ర, హీరోయిన్ నిహారికలకు ఇదే ఫస్ట్ మూవీ. నలుగురు ఫ్రెండ్స్ మధ్య జరిగే ఫన్నీ ఇన్సిడెంట్స్, కామెడీ టైమింగ్, పంచులు అన్నీ కలగలిపి అన్నీ వర్గాల ప్రేక్షకులను అలరిస్తోందని మూవీ టీం చెబుతోంది.
Also Read : నా భర్త హీరోయిన్స్‌తో ఎక్కువ ఉండేవాడు - బాలీవుడ్ హీరోపై భార్య సెన్సేషనల్ కామెంట్స్
స్టోరీ ఏంటంటే?
జంగ్లీ పట్నానికి చెందిన నారాయణ (వీటీవీ గణేష్)కు కులం అంటే పిచ్చి. తన కులం వారు అంటే ఏ పనైనా చేసి పెడతాడు. ఒకవేళ ఏదైనా ప్రమాదం జరిగితే తన కులం కాని వారి రక్తాన్ని సైతం ఎక్కించుకునేందుకు ఆలోచిస్తాడు. తన కులం, జన బలంతో ఎమ్మెల్యే కావాలని ప్రయత్నాలు చేస్తుంటాడు. ఇదే టైంలో నారాయణ కుమార్తె స్వేచ్ఛ (నిహారిక) ఇల్లు వదిలి వెళ్లిపోతుంది. దీంతో తన పరువు పోతుందని భావించి ఎవరికీ తెలియకుండా ఎలాంటి కేసు లేకుండా ఎస్సై సాగర్ (వెన్నెల కిశోర్) సాయంతో కూతురిని వెతుకుతుంటాడు.
అయితే, స్వేచ్ఛ పారిపోవడానికి అదే ప్రాంతానికి చెందిన నలుగురు యువకుల హస్తం ఉందని తెలుస్తుంది. చైతన్య (ప్రియదర్శి), అభయ్ (రాగ్ మయూర్), రాజీవ్ (ప్రసాద్ బెహర), సాత్విక్ (విష్ణు ఓయ్)లు ఆ అమ్మాయి పారిపోవడానికి కారణం అవుతారు. వీరిలో ఆమె ప్రేమించిన వ్యక్తి ఉన్నాడని తెలుసుకున్న నారాయణ ఏం చేశాడు? అసలు స్వేచ్ఛ పారిపోవడానికి కారణం ఏంటి? స్వేచ్ఛ వల్ల ఈ నలుగురు యువకులు పడ్డ ఇబ్బందులు ఏంటి? ఎమ్మెల్యే కావాలనుకున్న నారాయణ కల నెరవేరిందా? అనేది తెలియాలంటే మూవీ చూడాల్సిందే.






















