Sunitha Ahuja : నా భర్త హీరోయిన్స్‌తో ఎక్కువ ఉండేవాడు - బాలీవుడ్ హీరోపై భార్య సెన్సేషనల్ కామెంట్స్
Bollywood Actor Govinda : బాలీవుడ్ హీరో గోవిందాపై ఆయన భార్య సునీతా అహుజా సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. ఆయన మంచి భర్త కాదని... ఎక్కువ టైం హీరోయిన్లతో ఉంటారని అన్నారు.

Sunitha Ahuja About Her Husband Bollywood Actor Govinda : బాలీవుడ్ స్టార్ గోవిందా, సునీతా అహుజా కపుల్ ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుస్తూనే ఉంటారు. తాజాగా, ఆయన భార్య సునీతా అహుజా ఆయనపై ఓ ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఆమె తన భర్త ప్రవర్తన, పిల్లలు, వివాహం సంబంధం గురించి చెప్పారు. తన భర్త ఇంత వయసు వచ్చినా తప్పులు చేశారంటూ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు.
'హీరోయిన్లతో ఎక్కువగా ఉంటారు'
తన భర్త గోవిందా తన కంటే హీరోయిన్లతో ఎక్కువగా ఉంటారని సునీతా అహుజా తెలిపారు. 'ఎప్పుడైనా మిమ్మల్ని మీరు అదుపులో ఉంచుకోవాలి. ఓ వ్యక్తి చిన్నతనంలో తప్పులు చేయడంలో తప్పు లేదు. నేను కూడా వాటిని చేశాను. గోవిందా కూడా చేశారు. కానీ ఓ వయసు వచ్చాక ఎవరు చేసిన తప్పులు కూడా మంచిగా అనిపించవు. అలాగే, మీకు అందమైన ఫ్యామిలీ, అందమైన భార్య, అద్భుతమైన పిల్లలు ఉన్నప్పుడు అలాంటి తప్పులు ఎందుకు చేస్తారు?' అని ప్రశ్నించారు.
వాళ్లే కారణం
తాను ఈ రోజు బతికి ఉన్నానంటే తన పిల్లలే కారణమని చెప్పారు సునీత. 'గోవిందా ఆలోచన వేరు. నా ఆలోచన వేరు. ఈ రోజు నేను జీవించి ఉండడానికి కారణం నా పిల్లలు. వారిపై నాకున్న ప్రేమ. వాళ్లు నన్ను మాత్రమే ప్రేమించాలని నేను అనుకునేదాన్ని. టీనా చిన్నప్పుడు నేను సరదాగా దాన్ని ఆటపట్టించేదాన్ని. నేను ఇష్టమా? డాడీ ఇష్టమా? అని అడిగితే అది డాడీనే ఎంచుకునేది. కానీ ఆ చిన్నారికి నేనంటే కూడా చాలా ఇష్టం. నాకు ఫుల్ సపోర్ట్ ఇస్తుంది.
నేను నా కొడుకుతోనూ చాలా ఫ్రెండ్లీగా ఉంటాను. యష్, టీనా తరచుగా నన్ను బయటకు తీసుకెళ్తారు. నాకు జీవితంలో వేరే ఫ్రెండ్స్ ఎవరూ లేరు. నాకు స్నేహాలపై నమ్మకం లేదు.' అని చెప్పారు.
Also Read : సందీప్ కిషన్ యాక్షన్ డ్రామా 'సిగ్మా' - డైరెక్టర్‌గా దళపతి విజయ్ కుమారుడి ఎంట్రీ... ఫస్ట్ లుక్ వేరే లెవల్
వచ్చే జన్మలో భర్తగా వద్దు
ఓ స్టార్ భార్య కావాలంటే చాలా బలమైన స్త్రీ కావాలని సునీత అభిప్రాయపడ్డారు. వచ్చే జన్మలో గోవిందాని భర్తగా కోరుకుంటారా? అనే ప్రశ్నకు ఆమె వెరైటీ ఆన్సర్ చెప్పారు. 'గోవింద ఒక హీరో. అతను తన భార్యతో కన్నా హీరోయిన్లతోనే ఎక్కువగా టైం స్పెండ్ చేస్తాడు. ఓ స్టార్ హీరో భార్య కావాలంటే మీరు మీ మనస్సును స్ట్రాంగ్‌గా మార్చుకోవాలి. ఇది తెలుసుకోవడానికి నాకు 38 ఏళ్ల టైం పట్టింది. అప్పట్లో నేను దీన్ని అర్థం చేసుకోలేకపోయాను. మళ్లీ జన్మలో అలాంటి భర్త వద్దు. గోవిందా చాలా మంచి కొడుకు, మంచి సోదరుడు, కానీ మంచి భర్త అయితే కాదు. వచ్చే జన్మలో నువ్వు నా కొడుకుగా పుట్టాలి. భర్తగా మాత్రం వద్దు. ఏడు జన్మలను మర్చిపో.' అంటూ చెప్పారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
బాలీవుడ్ స్టార్ గోవిందా, సునీతలకు 1987లో వివాహం జరిగింది. వీరికి టీనా అహుజా, యశ్వర్థన్ అహుజా ఇద్దరు పిల్లలు. గతంలో ఇద్దరూ డివోర్స్ తీసుకోబోతున్నారంటూ ప్రచారం సాగింది. అయితే, పలు సందర్భాల్లో వీటిని ఖండించారు. తాజా ఇంటర్వ్యూలో గోవిందాపై సునీత కామెంట్స్ వైరల్ కావడంతో మళ్లీ డివోర్స్ రూమర్స్‌పై ప్రచారం సాగుతోంది.





















